Bigg Boss Telugu 7: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముహూర్తం ఫిక్స్... టెలికాస్ట్ ఎప్పుడు కానుందంటే?
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షోల్లో బిగ్ బాస్ ఒకటి. ప్రస్తుతం ఈ సీజన్ 7 నడుస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో.. తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే 11వారాలు పూర్తి చేసుకున్న ఈ షో.. 12వ వారం కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటుంది. ఇక ఈ షోకు ముగింపు కార్డు పడే ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే ఈ షోను రెండు వారాలు పొడిగిస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అలాంటిది ఏమి లేదని తెలుస్తోంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే టైమ్ అండ్ డేట్ ఫిక్స్ అయింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో... 11 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక 12వ వారం కూడా పూర్తి చేసుకోబోతుంది. అయితే సెప్టెంబర్ 3న 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్ లో అడుగుపెట్టారు. ఆ తర్వాత అక్టోబర్ 8న అంటే ఐదు వారాల తర్వాత మరో ఐదు మంది అడుగుపెట్టారు. అలా ఈ సీజన్ మొత్తం మీద 19 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఈ సీజన్ లో ఒకరికి రీఎంట్రీ అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, శుభ శ్రీ, రతికా రోజ్, నయని పవని, పూజా మూర్తి, టేస్టీ తేజ, ఆట సందీప్, బోలే షవాలి ఎలిమినేట్ అయ్యారు. ఇక రతికా రోజ్ కు మళ్లీ అవకాశం ఇచ్చి రీ ఎంట్రీ ద్వారా తీసుకున్నారు. ప్రస్తుతం హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, రతికా రోజ్, అశ్విని శ్రీ ఉన్నారు. వీరిలో 6 మంది మేల్ కంటెస్టెంట్స్ కాగా.. నలుగురు ఫీమేల్ కంటెస్టెంట్స్.

ఇక గత వారం నో ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ చెప్పుకువచ్చాడు. అయితే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. నెక్ట్స్ వచ్చే వీక్స్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి.. అన్ని ఉల్టా పుల్టాగా ప్రేక్షకులకు షాక్, ట్విస్టులు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇక గ్రాండ్ ఫినాలే కూడా గ్రాంఢ్ గా లాంచ్ చేయాలని భావిస్తున్నాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే డేట్ అండ్ టైమ్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 డిసెంబర్ 17న ఆదివారం నిర్వహించనున్నారు. ఆరోజు రాత్రి 7 గంటల నుంచి గ్రాంఢ్ ఫినాలే జరగనుంది. ఇక ఇందుకు తగ్గట్లుగానే భారీ ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఫినాలే కోసం.. గెస్టులు కూడా క్రేజ్ ఉన్న వారిని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కాబట్టి.. ఈ సీజన్ లో టాప్ 5 కాకుండా.. టాప్ 7ను ఫినాలేకు తీసుకువెళ్లాలని చూస్తున్నారట. ప్రస్తుతం హౌస్ లో పది మంది ఉన్నారు. ఈ వారం ఒకరు పోగా... డిసెంబర్ 17కి వచ్చేసరికి టాప్ 7 కంటెస్టెంట్స్ మిగులుతారు. అలా ఈ సీజన్ ఫినాలేకి టాప్ 7 కంటెస్టెంట్స్ ను తీసుకుపోవాలని బిగ్ బాస్ ప్లాన్ వేశారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











