Bigg Boss 7: హోస్టుపై ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఆ స్టార్ హీరోతో సర్‌ప్రైజ్.. కుడి ఎడమైతే అంటూ!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఊహించని విధంగా ప్రేక్షకాదరణను అందుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. సరికొత్త కంటెంట్‌తో పరిచయం అయినా.. ఇక్కడి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఈ కార్యక్రమం.. ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఏడో దానిని కూడా నిర్వహకులు మొదలెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త సీజన్‌కు సంబంధించిన హోస్ట్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. దీని ద్వారా అంచనాలను పెంచేశారు. అసలు ఈ ప్రోమోలో ఏముందో మీరే చూడండి!
రికార్డు రేటింగ్‌తో ఆరు కంప్లీట్:బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా దాదాపు 16 ఏళ్ల క్రితమే బిగ్ బాస్ షో హిందీలో మొదలైంది. ఆ తర్వాత ఇది పలు భాషల్లో ప్రసారం అవుతోంది. ఈ క్రమంలోనే ఏడేళ్ల క్రితం తెలుగులోకి కూడా వచ్చింది. అప్పట్లో ఈ షోపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ, అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఇది రికార్డు స్థాయి రేటింగ్‌ను సాధిస్తూ ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది.

ఆరోది డౌన్.. నాగార్జున అవుట్:తెలుగులో సక్సెస్‌ఫుల్ షోగా పేరొందిన బిగ్ బాస్ షో ప్రతి సీజన్‌ను సక్సెస్ చేసింది. కానీ, ఆరో సీజన్ మాత్రం మొదటి నుంచే ఎంతో చప్పగా సాగింది. దీనికితోడు ఫేక్ ఎలిమినేషన్స్, పసలేని టాస్కులు, లవ్, రొమాన్స్, గొడవలు అంతగా లేకపోవడంతో దీనికి రేటింగ్ కూడా సరిగా రాలేదు. ఫలితంగా ఇది తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే డిజాస్టర్ సీజన్‌గా చెడ్డపేరును తెచ్చుకుంది.

ఏడో సీజన్.. లోగోతో సర్‌ప్రైజ్:బిగ్ బాస్ ఆరో సీజన్ డిజాస్టర్ అవడంతో ఏడో దాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో నిర్వహకులు ఉన్నారు. ఇందులో భాగంగానే దీన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకోసం నాన్ స్టాప్ సీజన్‌ను సైతం క్యాన్సిల్ చేసేశారు. ఇక, ఇటీవలే ఈ సీజన్‌కు సంబంధించిన లోగోను విడుదల చేసిన నిర్వహకులు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

నాగార్జున ఔట్.. ఆ స్టార్ల పేర్లు:బిగ్ బాస్ ఆరో సీజన్ ఫ్లాప్ అవడంతో అక్కినేని నాగార్జున హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే కొత్త హోస్ట్ విషయంలో బాలకృష్ణ, చిరంజీవి, మంచు విష్ణు సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. వీళ్లలో నటసింహమే దాదాపుగా కన్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. దీంతో దీనిపై ఎన్నో రకలా ఊహాగాలు ప్రచారం అవుతున్నాయి.

హోస్టుపై ట్విస్ట్ ఇచ్చిన బాస్:అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌ను నడిపించబోయే హోస్ట్ విషయంలో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. దీనికి కూడా స్టార్ హీరో అక్కినేని నాగార్జునే హోస్టింగ్ చేయబోతున్నట్లు తాజాగా రివీల్ చేశాడు. ఈ మేరకు షో నిర్వహకులు తాజాగా ఆయనకు సంబంధించిన కొత్త ప్రోమోను విడుదల చేశారు. దీంతో హోస్ట్‌పై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టారు.
ఇంతకీ ప్రోమోలో ఏముంది?:తాజాగా విడుదలైన ప్రోమోలో అక్కినేని నాగార్జున స్టైలిష్ లుక్‌తో కనిపించారు. అంతేకాదు, ఆయన ఇందులో 'బిగ్ బాస్ సీజన్ 7.. ఈ సారి సీజన్.. ఏం చెప్పాలి? హా.. చాలా కొత్తగా.. ప్రతిసారీ ఇదేగా చెప్తున్నాం. హా.. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అంటూ సీజన్‌పై సస్పెన్స్ పెంచేశారు. అంటే ఈ సారి ఏదో కొత్తగా ప్లాన్ చేయబోతున్నట్లు పరోక్షంగా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











