Bigg Boss Telugu 7 Leaks: బిగ్ బాస్ హౌజ్‌లో భారీ ట్వీస్ట్... ఈసారి డబుల్ ఎలిమినేషన్.. ఎందుకంటే?
బిగ్ బాస్ సీజన్ 7 మొత్తానికి ఆసక్తిగా సాగుతోంది. ఇప్పటికే రెండో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. గత వారంతో పోలిస్తే ఈవారం నామినేషన్స్ వాడీ వేడిగా సాగాయి. షో మొదలైనప్పుడు హోస్ట్ నాగార్జున.. 'ఉల్టా పల్టా' అంటూ చెప్పుకొచ్చాడు. కానీ తొలివారం పెద్దగా ఆసక్తి అనిపించలేదు.. కానీ.... సోమవారం వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. శివాజీ, ప్రశాంత్ ని అందరూ ఉతికే ఆరేశారు. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ డబుల్ ఉండబోతుందని సమాచారం.
ఈ వారం నామినేషన్స్ లో భాగంగా... ఓ బాక్స్ లాంటిది పెట్టారు. బిగ్ బాస్ పిలిచిన వాళ్లు అందులోకి వెళ్లి నిలబడాలి. ఎవరెవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో.. ఎదురుగా నిలబడి కారణాలు చెప్పాలని చెప్పాడు. దీంతో పై నుంచి నామినేట్ అయిన కంటెస్టెంట్ పై కలర్ వాటరు పడుతుంది. ఇక పవర్ అస్త్ర గెలుచుకున్న సందీప్.. ఒకరిని నేరుగా నామినేట్ చేయొచ్చని చెప్పగా.. ప్రిన్స్ పేరు చెప్పాడు.

ఈ వారం నామినేషన్స్ లో ప్రిన్స్ తర్వాత వచ్చిన తేజని శుభశ్రీ, ప్రశాంత్, రతిక నామినేట్ చేశారు. ఆ తర్వాత శివాజీని అమర్‌దీప్, ప్రియాంక, షకీలా, శోభాశెట్టి, దామిని ఇలా ఏకంగా ఐదుగురు నామినేట్ చేశారు. ఒక్కొక్కరు వాళ్ల కారణాలు చెప్పుకొచ్చారు. ఇక ప్రశాంత్ ని ఏకంగా ఆరుగురు నామినేట్ చేశారు. వీళ్లలో గౌతమ్, అమర్‌దీప్, షకీలా, తేజ, దామిని, ప్రియాంక ఉన్నారు.
ఇక పల్లివి ప్రశాంత్ ను నామినేట్ చేస్తున్న సమయంలో అతనికి క్లోజ్ ఉండే రతిక కూడా కౌంటర్ ఇవ్వడంతో.. ప్రశాంత్ షాక్ అయిపోయాడు. ఇక అమర్ దీప్ చెప్పిన పాయింట్స్‌కు కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ఆడియన్స్ కూడా సపోర్ట్ చేశారు. రైతు బిడ్డ అని ఊరికే చెప్పడం కరెక్ట్ కాదని.. అందరూ కష్టాలు పడుతున్నారని చెప్పుకొచ్చాడు.

అయితే ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. దీనికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ హౌజ్ లోకి మరో 8 మంది ఎంటర్ అవ్వనున్నట్లు సమాచారం. బిగ్ బాస్ హౌజ్ లో 14 మంది ఎంటర్ అవ్వగా... గత వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు. హౌజ్ లో ప్రస్తుతం 13 మంది ఉన్నారు.

ఇక నెక్ట్స్ వీక్ మరో ఎనిమిది ఎంటర్ అవ్వనున్నారని... మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ అవుతారని తెలుస్తోంది. ఇక వీరిలో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని... 13 నుంచి ఇద్దరు పోగా.. 11 మంది ఉంటారని తెలుస్తోంది. ఇక కొత్తగా 8 మంది ఎంటర్ అవ్వగా.. మొత్తం 19 మంది అవుతారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











