Bigg Boss Telugu 7: నెక్ట్స్ క్యాప్టెన్ ఎవరో తెలిసిపోయింది... ఆ టాప్ కంటెస్టెంట్ ఛాన్స్ కొట్టేశాడుగా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరోవారం కూడా ఎండింగ్ కు వచ్చేసింది. ఇక ఈ వారం అంతా ఉల్టా పుల్టాగా సాగింది గేమ్ షో. ఇక కొత్తగా అడుగుపెట్టిన వారంతా పోటుగాళ్లుగా... హౌజ్ లో ఉన్న పాత కంటెస్టెంట్స్ అంతా ఆటగాళ్లుగా బిగ్ బాస్ నిర్ణయించాడు. ఇక వీరి మధ్య గేమ్స్ పెట్టాడు. ఇక ఈ టీముల్లో ఆటగాళ్లు, పోటుగాళ్లు సమానంగా స్కోర్ చేశారు. కానీ క్యాప్టెన్సీని మాత్రం ఆటగాళ్ల టీం నుంచి ఓ టాప్ కంటెస్టెంట్ దక్కించుకున్నాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
బిగ్ బాస్ ఉల్టా పుల్టా అంటూ మొదటి నుంచి మేకర్స్ చెప్పుకువస్తున్నారు. ఇక ఆట తీరు కూడా అలాగే ఉంటుంది. ప్రేక్షకులకు సడెన్ ట్విస్టులు, షాక్ లు ఇస్తూ.. బిగ్ బాస్ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఇక ఈ షోలో మొదట 14 మంది ఎంటర్ అవ్వగా... 5 మంది ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదో వారంలో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ను తీసుకువచ్చి... మళ్లీ గేమ్ ను రీస్టార్ట్ చేశాడు బిగ్ బాస్.

ఇక కొత్తగా వచ్చిన వారిని పోటుగాళ్లు అని... పాత కంటెస్టెంట్స్ ను ఆటగాళ్లు అని డివైడ్ చేశాడు బిగ్ బాస్. ఇక పాట కంటెస్టెంట్ అయిన గౌతమ్ మాత్రం ఫేక్ ఎలిమినేషన్ అయి.. సీక్రెట్ రూమ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక మళ్లీ సీక్రెట్ రూం నుంచి బయటకు వచ్చిన గౌతమ్.. పోటుగాళ్లు టీంలో చేరిపోయాడు. ఇక పోటుగాళ్లు 6 మంది ఉంటే.. ఆటగాళ్లు 8 మంది ఉన్నారు. ఇక ఈ టీముల మధ్యే బిగ్ బాస్ గేమ్స్ పెట్టి ఎంటర్ టైన్ చేశాడు.
ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ తర్వాత బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ గేమ్స్ పెట్టాడు. ఇక ఈ టాస్కుల్లో ఆటగాళ్లు, పోటుగాళ్లు.. మధ్య పెద్ద యుద్దమే జరిగింది. ఒకరికి మించి ఒకరు పోటీగా పాల్గొన్నారు. ఇక ఎక్కువగా పోటుగాళ్లు టీం నుంచి గౌతమ్, అర్జున్ ఆడగా... ఇక ఆటగాళ్ల టీం నుంచి యావర్, అమర్ దీప్, శోభా శెట్టి, సందీప్, టేస్టితేజ ఆడుతూ వచ్చారు. ఇక ఆటగాళ్లు టీం లో ఎక్కువగా కష్టపడింది మాత్రం యావర్.

ఇక బిగ్ బాస్ నిర్వహించిన టాస్కుల్లో ఆటగాళ్లు, పోటుగాళ్లు ఇద్దరు సమాన స్కోర్ సాధించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్టు... మామూలుగా అయితే ఈ గేముల్లో ఎవరు ఎక్కువగా యాక్టివ్ గా పాల్గొన్నారో చూసి.. బిగ్ బాస్ కెప్టెన్ గా నిర్ణయిస్తాడు. అయితే ఆటగాళ్లు, పోటుగాళ్లు టీముల్లో ఎవరూ ఎక్కువగా యాక్టివ్ గా అన్నింట్లో పాల్గొన్నారు అంటే.. మొదట వినిపించే పేరు యావర్. ఎప్పటి నుంచో ఈ కంటెస్టెంట్ మంచి పోజిషన్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ వారం యావర్ కెప్టెన్ గా ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు పడ్డ కష్టానికి యావర్ కు మంచి గుర్తింపు అయితే లభించింది. ఇక హౌజ్ లో సెకండ్ కెప్టెన్ గా యావర్ ఎన్నిక అయ్యాడు. మొదటి క్యాప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక మరోసారి ఆటగాళ్ల టీం నుంచే కెప్టెన్ గా యావర్ ఎన్నికయ్యాడు. మరీ ఈ క్యాప్టెన్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తాడో లేదో చూడాలి. ఎందుకంటే తెలుగు సరిగా రాదు.. ఎలా మెయిన్ టెయిన్ చేస్తాడో నెక్ట్స్ వీక్ లో తేలనుంది.


Click it and Unblock the Notifications











