Bigg Boss Telugu 7 Final List:బిగ్‌బాస్‌ షూటింగ్ షురూ...హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు తారుమారు..భారీ ట్విస్ట్

తెలుగు ప్రేక్షకులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో... మరో రెండు రోజుల్లో సీజన్ 7 ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్‏బాస్ సందడి అంతా ఇంతా లేదు. బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ గురించి చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్టు వచ్చేసింది. లోపలికి వెళ్లే వారు ఎవరో తెలిసిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే....

హలీవుడ్ లో మొదలైన బిగ్ బాస్... మన బాలీవుడ్ కు వచ్చి.. ఆ తర్వాత రీజనల్ భాషలకు చేరింది. అలా తెలుగులో ఏకంగా 6 సీజన్స్ పూర్తి చేసుకుంది ఈ రియాలిటీ షో. అంతే కాదు ఒక ఓటీటీ వర్షన్ కూడా రాగా.. దానికి అంతగా రెస్పాన్స్ రాలేదు. ఇక మొదటి షోకు ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహారించగా, రెండో షోకు నాని హోస్టుగా వ్యవహారించారు. ఇక మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున హోస్టుగా చేస్తున్నారు.

Bigg Boss Telugu Season 7 Shooting Started and contestants Final list Full Details Here

ఇక గత ఆరు సీజన్స్ విజయవంతగా సాగిన ఈ షో... ఏడో షోకు సర్వం సిద్ధమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఈ షో ఈరోజు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. అనగా షూటింగ్ నిర్వహించారట. ఇవాళ, రేపు ఈ బిగ్ బాస్ షో షూటింగ్ జరగ్గా... ఎల్లుండి సెప్టెంబర్ 3న స్టార్ మాలో ప్రసారం కానుంది. ఇక సెప్టెంబర్ 3 రాత్రి 7 గంటల నుంచి మనకు టెలికాస్ట్ చేయనున్నారు.

Bigg Boss Telugu Season 7 Shooting Started and contestants Final list Full Details Here

ఇక బిగ్ బాస్ షో టెలికాస్ట్ విషయానికి వస్తే సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచి ప్రసారం కానుంది. ఇక వీకెండ్స్.. శని, ఆది వారాల్లో మాత్రం రాత్రి 9 గంటల నుంచే ప్రసారం కానుంది. ఇక వీకెండ్స్ లో నాగార్జున వచ్చి సందడి చేయనున్నారు. ఇక ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్టు వచ్చేసిందంటూ కథనాలు చాలా వచ్చాయి. కానీ ఈరోజు షూటింగ్ కావడంతో.. కంటెస్టెంట్స్ లిస్టులో పేర్లు మారిపోయాయి.

Bigg Boss Telugu Season 7 Shooting Started and contestants Final list Full Details Here

ఇక ఫైనల్ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి (జానకీ కలగనలేదు ఫేం), నటుడు శివాజీ, శృంగార తార షకీలా, శుభ శ్రీ, ప్రిన్స్ యావర్( మోడల్), టెస్టీ తేజ (యూట్యూబర్, జబర్దస్త్ ), భోలే షావలి, సింగర్ దామినీ భట్ల, ఆట సందీప్, ఇన్ స్టాగ్రామ్ సెన్సెషన్ పల్లవి ప్రశాంత్.. ఈ పది మంది మాత్రం ఫిక్స్ అయ్యారు. ఇంకో ఐదుగురు లేదా ఏడుగురు లోపలికి రేపు వెళ్లనున్నారు. వారి షూటింగ్ రేపు జరుపుకోనుంది.

Bigg Boss Telugu Season 7 Shooting Started and contestants Final list Full Details Here

ఇక అంజలి పవన్ ఫిక్స్ కావాల్సి ఉండగా... రెమ్యూనరేషన్ ఇష్యూ వచ్చి వెనుతిరిగిందని తెలుస్తోంది. ఈమెతో పాటు... సీరియల్ నటి పూజా మూర్తి కూడా వెళ్లాల్సి ఉంది. కానీ ఈమె తండ్రి చనిపోవడంతో... ఎంట్రీ క్యాన్సిల్ చేసుకుంది. యాంకర్ ప్రత్యూష కూడా ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ వెనుతిరిగిందని తెలు్స్తోంది. ఇక వీరికి రీప్లేస్మెంట్స్ ఇప్పటికే బిగ్ బాస్ టీం అరెంజ్ చేసుకుంది. ఇక యాక్టర్ క్రాంతి, సీరియల్ నటి ప్రియాంక జైన్, నటి ఫర్జానా, ఈటీవీ ప్రభాకర్, రియాజ్, అశోకవనంలో అర్జున కల్యాణం హీరోయిన్ రితికా నాయక్ వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X