Bigg Boss Telugu 7: 11వ వారం కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది... ఆ టాప్ కంటెస్టెంట్ ఛాన్స్ కొట్టేశాడుగా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతోంది. ఇక ఈ షో గత 10 వారాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. చివరి దశకు వచ్చిన బిగ్ బాస్.. ప్రస్తుతం హౌజులో ఉన్నది 11 మంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఉంటే.. కేవలం 10మంది కంటెస్టెంట్స్ ఉంటారు. అయితే నెక్ట్స్ వీక్ క్యాప్టెన్ కోసం.. బిగ్ బాస్ టాస్క్ నిర్వహించారు. ఇక ఈ టాస్కుల్లో క్యాప్టెన్సీ కండెంటర్స్ గా శివాజీ, గౌతమ్ ఎన్నిక అయ్యారు. అందులో క్యాప్టెన్సీని అందుకుంది ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకున్నాను. ఆ వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ తెలుగు 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. గత 10వారాలుగా ఈ షోను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మొదటి విడుతలో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక ఐదో వారంలో అసలైన ఉల్టా పుల్టా అంటూ ఆటలోకి ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం హౌస్ లో 11 మంది ఆటగాళ్లు ఉన్నారు. అందులో అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ, శివాజీ, అశ్విని శ్రీ, బోలే షవాలి, శోభా శెట్టి, ప్రియాంక జైన్, రతికా రోజ్, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ ఉన్నారు.

ఇక బిగ్ బాస్ హౌస్ కు మొదటి క్యాప్టెన్ గా పల్లవి ప్రశాంత్ అయ్యాడు. ఇక హౌస్ లో విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో.. ఆయన్ని బిగ్ బాస్ క్యాప్టెన్సీ నుంచి తొలగించాడు. ఇక ఒక రోజు తర్వాత మళ్లీ క్యాప్టెన్సీని ఇచ్చేశాడు. రెండో సారి యావర్ క్యాప్టెన్ గా ఎన్నిక అయ్యాడు. ఇక మూడో సారి గౌతమ్ కృష్ణ క్యాప్టెన్ గా ఎన్నిక అయి.. తన విధులను సక్రమంగా నిర్వహించాడని నాగార్జున సైతం మెచ్చుకున్నాడు.
ఇక గౌతమ్ క్యాప్టెన్సీ తర్వాత.. శోభా శెట్టి క్యాప్టెన్ గా ఎన్నిక అయింది. పదో వారానికి ఆమె క్యాప్టెన్ గా ఉంది. ఇక హౌస్ లో ప్రస్తుతం... ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫ్యామిలీ వీక్ అనంతరం క్యాప్టెన్సీ టాస్కులను నిర్వహించారట. అయితే క్యాప్టెన్సీ టాస్కుల్లో కంటెండర్స్ గా గౌతమ్ కృష్ణ, శివాజీ నిలిచారు. ఇక వీరికి హోరా హోరిగా పోటీలు నిర్వహించాడు బిగ్ బాస్. ఇక వీరిలో పై చేయి సాధించింది మాత్రం శివాజీ అని తెలుస్తోంది.

ఇక 11వ వారం క్యాప్టెన్ గా శివాజీ ఎన్నిక అయ్యాడు. ఇప్పటికే ఆయన మైండ్ గేమ్ తో ఆట ఆడుతూ.. వస్తున్నాడు. ఇక ఇప్పటివరకు క్యాప్టెన్ గా రాని శివాజీ.. ఇప్పుడు మొదటి సారిగా క్యాప్టెన్ అయ్యాడు. ఇప్పటికే ఆయన ఇద్దరిని క్యాప్టెన్ చేశాను అంటూ చెప్పుకువచ్చాడు. ప్రశాంత్, యావర్ లను తానే క్యాప్టెన్ గా చేసినట్లు హౌసులో చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు తాను క్యాప్టెన్ అవడంతో.. ఆట మరింత రసవత్తరంగా సాగనుంది.
హౌస్ లో ఇప్పటికే శివాజీ బ్యాచ్ వర్సెస్ సీరియల్ బ్యాచ్ నడుస్తోంది. ఇప్పుడు క్యాప్టెన్ గా శివాజీ అయ్యాడు. ఇక హౌస్ లో గొడవలు పీక్స్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ కూడా ఆసక్తిగా మారింది. ఈ వారం ఎలిమినేషన్ లో ఐదు మంది ఉన్నారు. శివాజీ, బోలే షవాలి, రతికారోజ్, గౌతమ్ కృష్ణ, యావర్, ప్రశాంత్ ఉన్నారు. అయితే డేంజర్ జోన్ లో మాత్రం రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, బోలే ఉన్నట్లు సమాచారం. చూడాలి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











