Bigg Boss Telugu 7: 12వ వారం కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది.. ఈ దెబ్బతో టాప్ 5లో ఆ లేడీ కంటెస్టెంట్!
బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు 7కి మంచి ఆదరణ దక్కుతుంది. రోజు రోజుకు ఈ షో.. ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అవుతుంది. ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకుని 11వ వారం కూడా పూర్తి కావొస్తుంది. మరో 4 వారాల్లో ఈ షోకి ముగింపు పడనుంది. ఇక 12వ వారం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ కోసం.. టాస్కులు నిర్వహించారు. అందులో కంటెస్టెంట్స్ పోటా పోటీగా పాల్గొన్నారు. కానీ ఆ పోటీల్లో ఓ లేడీ కంటెస్టెంట్ గెలుపొందింది. అలా బిగ్ బాస్ హౌస్ కి సెకండ్ లేడీ కంటెస్టెంట్ గా నిలిచింది. ఆమె ఎవరు.. టాప్ 5లో నిలుస్తుందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత సీజన్స్ కంటే ఆసక్తిగా సాగుతోంది. బిగ్ బాస్ షో సెప్టెంబర్ 3న ప్రారంభం కాగా.. ఆ రోజున 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఇక ఐదో వారంలో మరో ఐదుగురు అడుగుపెట్టారు. ఇలా మొత్తం మీద ప్రస్తుతానికి హౌస్ లో ఉన్నది పది మంది కంటెస్టెంట్స్ మాత్రమే. ఇప్పటివరకు పది మంది ఎలిమినేట్ అవ్వగా.. ఒకరు రతికా రోజ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ షో చివరి అంఖానికి చేరుకుంది.

ప్రస్తుతం హౌస్ లో శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, అర్జున్ అంబటి, అశ్విని శ్రీ, రతికా రోజ్ ఇలా పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక వీరి మధ్య పోటా పోటాగా టాస్కులు నిర్వహిస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీలు నిర్వహించారు. అందులో మొదట అర్జున్ అంబటి ఎవిక్షన్ ఫ్రీ పాస్ సాధించాడు. ఆ తర్వాత ఈ పాస్ యావర్ చేతికి వెళ్లిపోయింది.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సంచలన నిర్ణయం... ఈ సీజన్‌లో అసలైన ఉల్టా పుల్టా ఇదే!
https://telugu.filmibeat.com/television/6-or-7-contestants-will-enter-bigg-boss-telugu-7-finale-full-details-here-127957.html
ఇక ఈ సీజన్ లో యావర్ కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కింది. ఇదిలా ఉంటే.. మరోవైపు నెక్ట్స్ వీక్ కెప్టెన్ కోసం బిగ్ బాస్ టాస్కులు పెట్టాడు. ఇక ఈ టాస్కులు పెట్టాడు. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ గా అమర్ దీప్, అర్జున్ అంబటి, ప్రియాంక జైన్ నిలిచారు. ఇక వీరి మధ్య పోటీలు నిర్వహించగా.. చివరకు ప్రియాంక జైన్ గెలిచింది. దీంతో 12వ వారం కెప్టెన్ గా ప్రియాంక జైన్ ఎన్నిక అయ్యారు. దీంతో ప్రియాంక సెకెండ్ లేడీ కెప్టెన్ గా నిలిచారు.

ఇక మరో నాలుగు వారాల్లో ఈ షో ముగియనుంది. ఫినాలేకి టాప్ 6 కంటెస్టెంట్స్ పోతారని తెలుస్తోంది. మరోవైపు ఇంకో వారం పొడిగించి.. టాప్ 5నే పంపుదామని బిగ్ బాస్ ఆలోచిస్తున్నారట. ఇక మొత్తానికి టాప్ 5లో శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్, యావర్, ప్రియాంక వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంక నెక్ట్స్ వీక్ సేఫ్ అయిపోయినట్లే. ఎందుకంటే కెప్టెన్సీలో ఉన్నవారిని నామినేట్ చేయరు. ఈ వీక్ సేఫ్ అయితే.. నెక్ట్స్ వీక్ నామినేషన్స్ లోకి రారు.. ఇక టాప్ 5లోకి చేరిపోతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











