Bigg Boss Telugu 7 Elimination: బిగ్ బాస్ హౌస్‌లో ఫస్ట్ మేల్ ఎలిమినేషన్... ఎవరు అయ్యారంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ షో స్టార్ట్ అయి దాదాపు 8 వారాలు పూర్తి కావొస్తుంది. ఇక గత ఏడు వారాలుగా బిగ్ బాస్ ఫీమేల్ కంటెస్టెంట్స్ మీద పగబట్టినట్లు వరుసగా వారిని ఎలిమినేట్ చేస్తూ వచ్చాడు. ఇక 8వ వారం మాత్రం మొదటిసారిగా బిగ్ బాస్ హౌస్ లో మేల్ ఎలిమినేషన్ జరిగింది. అయితే ఆ ఎలిమినేషన్ కూడా బిగ్ బాస్ ఓ బ్యూటీని సేవ్ చేయడానికి అంటున్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ రోజు రోజుకు ఆసక్తిగా సాగుతోంది. ఇక 8వారాలు పూర్తి చేసుకోబోతున్న ఈ షోలో మొదటి సారిగా మేల్ ఎలిమినేషన్ జరగింది. బిగ్ బాస్ హౌస్ లో మొదటి విడతలో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. అందులో కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతికా రోజ్, శోభ శ్రీ రాయగురు వంటి ఫీమేల్ కంటెస్టెంట్స్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఇలా వరుసగా ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడంపై నెటిజన్స్ సైతం పెదవి విరచారు.

ఇక ఐదో వారంలో ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులకు ట్విస్టు ఇచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ మినీ లాంఛ్ పేరిట.. ఐదుగురు కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. అందులో అర్జున్ అంబటి, నయని పావని, బోలే షవాలి, పూజా మూర్తి, అశ్విని శ్రీ.. ఇలా ఐదుగురు కంటెస్టెంట్స్ రెండో విడతలో హౌస్ లోకి పంపించారు. అయితే ఇందులో మరో ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్స్ పూజా మూర్తి, నయని పవని ఎలిమినేట్ అయ్యారు.

ఇక గత ఏడు వారాలుగా ఫీమేల్ కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేస్తూ.. బిగ్ బాస్ షాక్ ఇస్తున్నాడు. ఇక ఈ వారం కూడా ఆల్మోస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుందని మొదటి నుంచి సమాచారం వచ్చింది. కానీ చివరి క్షణంలో బిగ్ బాస్ ట్విస్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సారి మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారట. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూరైంది.
గత 7 వారాలుగా డేంజర్ జోన్ లోకి అడుగుపెట్టని కంటెస్టెంట్ ఎవరంటే.. ఆట సందప్. ఆయన 7 వారాలుగా నామినేషన్స్ లోకి రాలేదు. ఇక 8 వ వారంలో నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక నామినేషన్స్ లోకి వచ్చిన మొదటి వారంలోనే ఆయన ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ వారం ఓటింగ్ లో ఆయనకు తక్కువ ఓట్లు పడడంతో బిగ్ బాస్ ఆయన్ని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున ఆట సందీప్ ను ఎలిమినేట్ చేయనున్నారు. అయితే మరికొంత వాదన ఏంటంటే.. శోభాశెట్టికి కూడా ఓట్లు తక్కువగా వచ్చాయని.. కానీ బిగ్ బాస్ ఆమెను సేవ్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. శోభా శెట్టి హౌస్ లో ఉంటే.. గొడవలు పెట్టడం వల్ల టీఆర్పీ వస్తుందని ఆలోచించారట. అందుకే ఆమెను కాపాడేందుకు బిగ్ బాస్ ఆట సందీప్ ను బలి చేశారని అంటున్నారు. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











