Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్‌లో నెక్ట్స్ వీక్ క్యాప్టెన్ ఎవరో తెలుసా?
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ ఆసక్తిగా సాగుతోంది. ఇక 7వ వారం సైతం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంటున్న ఈ షోలో నామినేషన్స్ ప్రక్రియ కూడా అయిపోయింది. ఇక హౌస్ లో నెక్ట్స్ క్యాప్టెన్ ఎవరు అనే దానిపై బిగ్ బాస్ పోటీలు నిర్వహించారు. హౌస్ లోని వాళ్లని రెండు టీములుగా విడదీసి.. అందులో వారికి టాస్కులు నిర్వహించారు. ఇక అన్ని టాస్కుల్లో ప్రతిభ చూపించిన ఓ కంటెస్టెంట్ క్యాప్టెన్ గా ఎన్నికయ్యారు. ఇక అతను క్యాప్టెన్ గా కావడంతో.. మరో రికార్డు సృష్టించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇంట్రెస్టుగా సాగుతోంది. మొదట 14 మంది ఎంటర్ అవ్వారు. ఇక మొదటి ఐదు వారాలు ఐదు మంది ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఐదో వారంలో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. మళ్లీ హౌస్ లో 14 మంది అయ్యారు. ఇక గత వారం నయని పవని ఎలిమినిట్ అవ్వగా... ప్రస్తుతం హౌస్ లో 13 మంది ఉన్నారు. ఇక ఏడో వారం కూడా ఆట మరింత రంజుగా సాగుతోంది. ఇక ఈ వారం నామినేషన్స్ కూడా ఫుల్ హీటెక్కించేలా జరిగాయి.

ముఖ్యంగా నామినేషన్స్ లో అందరూ బోలే షవాలి, అశ్విని శ్రీలను టార్గెట్ చేశారు. వీరి ఆటతీరు బాగాలేదని తప్పుబడుతూ అందరూ నామినేట్ చేశారు. అయితే శోభాశెట్టి, బోలే షవాలి నామినేషన్, సందీప్, ప్రశాంత్ నామినేషన్స్ మాత్రం షోకి హైలెట్ గా నిలిచింది. వీరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇక ఆ విషయం పక్కన పెడితే.. ఈ వారం క్యాప్టెన్ కంటెండర్స్ కోసం బిగ్ బాస్ పోటీలు నిర్వహించారు.
బిగ్ బాస్ హౌస్ కి మొదటి క్యాప్టెన్ గా పల్లవి ప్రశాంత్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్యాప్టెన్సీ బాధ్యతలు సరిగ్గా నిర్వహించడం లేదంటూ మళ్లీ వెనక్కి తీసుకున్న బిగ్ బాస్... మళ్లీ నెక్ట్స్ డేనే అతనికి క్యాప్టెన్ బ్యాడ్జ్ ఇచ్చేశాడు. ఇక నెక్ట్స్ వీక్ క్యాప్టెన్ గా ప్రిన్స్ యావర్ అయ్యాడు. ఇక మూడో క్యాప్టెన్సీ కోసం ఈ వారం పోటీలు నిర్వహించాడు బిగ్ బాస్. సభ్యులందరినీ జిలేబి పురం, గులాబి పురం అనే రెండు ఊర్లుగా డివైడ్ చేశాడు బిగ్ బాస్.

ఇక ఆ ఊరి టీమ్స్ మధ్య టాస్కులు, పోటీలు నిర్వహించాడు. ఇక ఈ పోటీల్లో బెస్ట్ ఆటగాడిగా ఆట సందీప్ నిలిచాడు. దీంతో ఆయన నెక్ట్స్ వీక్ క్యాప్టెన్ గా ఎన్నిక అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ కి మూడో క్యాప్టెన్ గా ఆట సందీప్ ఎన్నిక అయ్యాడు. ఇక ఆట సందీప్ ఇప్పటి వరకు నామినేషన్స్ కు రాకుండా ఆడుతున్నాడు. ఇప్పుడు మరోసారి క్యాప్టెన్ కావడంతో.. ఆయన నెక్ట్స్ వీక్ కూడా నామినేషన్స్ లో ఉండడు అనమాట.

ఇక ఆట సందీప్ గత ఏడు వారాలుగా నామినేషన్స్ లేకుండా ఆటను ఆడుతున్నాడు. ఇక మరో వారం కూడా నామినేషన్స్ లో ఉండడు అని అర్థం అయిపోయింది. ఈ కంటెస్టెంట్ కు బాగానే కలిసివస్తుంది. మొదటి పవర్ అస్త్ర గెలుచుకుని రికార్డు సృష్టించిన ఈ ఆటగాడు... 8 వారాలుగా నామినేషన్స్ లో లేకుండా మరో రికార్డు సృష్టించాడు ఆట సందీప్. మరి మున్ముందు ఎలా ఉండనుందో చూడాలి.


Click it and Unblock the Notifications











