Bigg Boss Telugu 7: కెప్టెన్సీ కోసం హాట్ వార్ - యావర్‌పై ఒంటికాలి మీద లేచిన శోభాశెట్టి.. కెప్టెన్ ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రోజురోజుకూ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. 8వ వారం కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంటున్న ఈ షోలో నామినేషన్ల ప్రక్రియ చాలా హాట్ హాట్ గా సాగింది. అయితే తాజాగా వచ్చే వారం కెప్టెన్సీ కోసం పోటీలు జరిగాయి. నామినేషన్ల కంటే కూడా మరింత హాట్ గా ఈ టాస్కులు జరగడం గమనార్హం. ముందుగా హౌస్ లోని కంటెస్టెంట్లు అందరిలో నలుగురు నలుగురిని సెలెక్ట్ చేసి గేమ్ పెట్టాడు బిగ్ బాస్. వాళ్లలో గెలిచిన వారందరికీ మళ్లీ ఫైనల్ గా అదిరిపోయే టాస్క్ ఇచ్చి కెప్టెన్ ను ఎంపిక చేశారు.
ముందుగా ఫ్లోట్ సింక్ టాస్క్ పెట్టగా ప్రియాంక జైన్ గెలిచింది, ఆ తర్వాతి టాస్కులో పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు. అలాగే మూడో టాస్కులో ఆట సందీప్ విన్ అయ్యాడు. నాలుగో పోటీలో శోభా గౌతమ్ కృష్ణ గెలిచాడు. ఐదో పోటీలో శోభా శెట్టి గెలిచింది. ఇలా ఈ ఐదుగురికి బిగ్ బాస్ ఫైనల్ గా మరో గేమ్ పెట్టాడు. అదే ఈ మిర్చి చాలా హాట్. అయితే ఈ టాస్కులో ఈ ఐదగురు పోటీదారుల్లో.. తమకు నచ్చని కంటెస్టెంట్లకు హౌస్ మేట్స్ మిరపకాయల దండలు వేయాల్సి ఉంటుంది. అయితే ఈ మిరపకాయల ఘాటు కంటే కూడా కంటెస్టెంట్ల మధ్య సాగిన వారే మరింత హాట్ గా కనిపిస్తోంది.

ముందుగా వచ్చిన అమర్ దీప్ అందరూ ఊహించినట్లుగానే పల్లవి ప్రశాంత్ మెడలో మిరపకాయలతో గుచ్చిన మాల వేశాడు. ఆ తర్వాత వచ్చిన భోలె షావళి ప్రియాంక జైన్ మెడలో దండ వేశాడు. వీరిద్దరి మధ్య కూడా బాగానే గొడవ జరగింది. ప్రియాంక అయితే ప్రశాంత్ లాగా మాట్లాడుతూ.. వెళ్లి పక్కకెళ్లి ఆడుకో అంటూ కామెంట్లు చేసింది. తర్వాత వచ్చిన రతికా రోజ్ శోభా శెట్టి మెడలో దండ వేసింది. టేస్టీ తేజ కూడా పల్లవి ప్రశాంత్ కు మాల వేసినట్లు చూపించారు. అశ్విని శ్రీ కూడా శోభా శెట్టి మెడలోనే వేసింది. వీరిద్దరి మధ్య మరింత హాట్ గా వాగ్వాదం జరిగింది.

ఆ తర్వాత వచ్చిన ప్రిన్స్ యావర్ శోభా శెట్టి మెడలో మిరపకాయల దండ వేసేందుకు చెప్పిన కారణాలకు.. ఆమె ఘోరంగా ఫైర్ అయింది. ముందు ముందు నీక్కూడా ఇలాంటి సిట్యువేషన్ వస్తుంది, నేను అలాగే చేస్తానంటూ హెచ్చరించింది. అలాగే పిచ్చోడు, పిచ్చోడు అంటూ ప్రిన్స్ యావర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇందుకు యావర్ కూడా చాలా గట్టిగానే సమాధానం చెప్పాడు. తీవ్రంగా కోప్పడ్డాడు. ఒకర మీదకు ఒకరు వెళ్లి మరీ తీవ్రంగా అరుచుకున్నారు. దీంతో యావర్ ఆ మిరపకాయల దండను నేలకేసి కొట్టగా.. శోభా శెట్టియే వెళ్లి ఓ దండ తీసుకొని తన మెడలో వేసుకుంది.

ఇక శివాజీ ఆట సందీప్ మెడలో దండ వేసినట్లు సమాచారం. నామినేషన్లలో అతడు అరిచిన తీరుకు శివాజి చాలా హర్ట్ అయ్యాడు. ప్రియాంకకు రెండు, పల్లవి ప్రశాంత్ కు రెండు, శోభా శెట్టికి నాలుగు, ఆట సందీప్ కు ఒక మాళ వేసినట్లు తెలుస్తోంది. ఇక మిగిలింది ఒక్క గౌతమ్ కృష్ణనే. ఈ టాస్కులో ఎవరితోనూ మెడలో దండ వేయించుకోకుండా విన్నర్ గా నిలిచి నెక్స్ట్ వీక్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఎవరి గ్రూపులోనూ ఉండకుండా తన గేమ్ తాను ఆడుకుంటూ.. అందరితో రాపో మెయింటేన్ చేస్తున్నాడు. అందుకే అతను ఈ టాస్కులో గెలిచి కెప్టెన్ గా ఎన్నికయ్యాడని అంతా అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











