బిగ్ బాస్ సీజన్ 8 షోకు ఊహించని హోస్ట్.. ప్రోమోలో కంటెస్టెంట్లకు సీరియస్ వార్నింగ్..
Bigg Boss Telugu 8: బుల్లి తెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ షో ను తెలుగులోనూ చాలా మంది ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే 7 సీజన్లలో పుల్ ఎంటర్టైన్ మెంట్ అందించిన ఈ రియాలిటీ షో.. ఈ సారి అంతకు మించి అనేలా.. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ అందించడానికి సిద్దమైంది. ఈ క్రేజీ షో కోసం కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ బిగ్గెస్ట్ షో కు సంబంధించిన పలు అప్టేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతూ.. షో పై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ మోస్ట్ పాపులర్ షో సీజన్ 8 కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన షో ప్రోమోలు బీబీ లవర్స్ కు తెగ ఆకట్టుకున్నాయి. గత ఏడు సీజన్లలో అందించిన ఎంటర్టైన్మెంట్ కు ఏ మాత్రం తగ్గకుండా.. అన్ లిమిటెడ్ ఫన్ అందించాలని ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. అందుకు తగ్గట్టుగానే.. కంటెస్టెంట్స్ లను పర్పెక్ట్ గా సెలెక్ట్ చేసి.. హౌస్ లోకి పంపనున్నారు. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ, అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన లేదు.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ తో పాటు బిగ్ బాస్ బజ్ కూడా అంతే క్రేజ్ ఉంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారు బయటకు వెళ్లే ముందు బజ్ లో పాల్గొంటారు. అయితే.. ఈ స్పెషల్ షో లో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హోస్ట్ గా వ్యవహరిస్తుంటారు. ఇందులో కంటెస్టెంట్ల ఆట తీరు గురించి, హౌస్ లో జరిగే విషయాల గురించి ఎలిమినేట్ అయ్యేవారు తన అనుభవాలను పంచుకుంటారు. అలాగే షో హోస్ట్ అడిగే ప్రశ్నలు, కంటెస్టెంట్స్ చేసే షాకింగ్ కామెంట్స్. కౌంటర్స్... ఎన్ కౌంటర్స్ వేరే లెవలబ్బా.. ఇలాంటి బిగ్ బాస్ సీజన్ 8 బజ్ కు హోస్ట్ గా ఎవరు వ్యవహరించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటివరకు హీరో శివాజీ, శోభ శెట్టి, ప్రియాంక , అశ్విని శ్రీ ఇలా పలువురు పేర్లు వినిపించాయి.
కానీ, ఆ ప్రచారానికి తెరపడింది. తాజాగా బిగ్ బాస్ బజ్ కు సంబందించిన ప్రోమోను విడుదల చేసింది బిబి టీం. ఎవరు ఊహించని విధంగా.. అసలు ఎవరీ అంచనాలకు అందని వ్యక్తిని ఈసారి బజ్ కు హోస్ట్ గా ప్రకటించారు. అతడే అర్జున్ అంబటి. షాక్ అయ్యారు కాదా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కంటెస్టెంట్ వచ్చిన అంబటి అర్జున్ హోస్ట్ గా సెలెక్టల్ చేశారు. అతడు బిగ్ బాస్ ఏడో సీజన్ లో తన ఆటతో బీబీ లవర్స్ ఆకట్టుకున్నాడు. ఆ సీజన్ లో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ.. ఇతర కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చారు. అలాంటి డేరింగ్ అండ్ డ్యాషింగ్ పర్సన్ ను బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా సెలెక్ట్ చేశారంటే.. ఈ సారి బజ్ ఎలాంటి ఉంటుందో మాటల్లో చెప్పడం అసాధ్యమే. పైగా ఆయన ప్రోమోలోనే కంటెస్టెంటులకు ఓ రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నారంటే.. ఈ సారి బజ్ వేరే లెవల్ లో ఉండబోతుంది.

నిజంగా ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. "టైమ్ బాగుంటే సంతోషం.. టైమ్ బాగోకపోతే సంకోచం. టైమ్ బాగుంటే మనం ఏం చేసినా ఒప్పు.. అలా టైమ్ బాగున్న కొంతమంది బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారు. మరి వాళ్ల టైమ్ బ్యాడ్ అయితే? బిగ్ బాస్ బజ్ లోకి వస్తారు. లోపల మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి.. ఈ సీటు యమ హాట్ " అంటూ అర్జున్ వార్నింగ్ కేక పుట్టిస్తుంది. మరి ఈసారి బిగ్ బాస్ 8 ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసుకోవాలంటే.. సెప్టెంబర్ 1 వరకు వేచి ఉండాల్సిందే.. ఆ రోజు అంటే సెప్టెంబర్ 1న రాత్రి 7 గంటల నుంచి బీబీ 8 రియాలిటీ షో షూరు కాబోతుంది.


Click it and Unblock the Notifications











