‘అమ్మాయిలు సిగరెట్ తాగితే తప్పేంటీ?’ బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎవరూ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైల్డ్ కార్డు ​ఎంట్రీలు, డబుల్ ​ఎలిమినేషన్​ చేసి షోపై మరింత క్యూరియాసిటీని పెంచేశారు. గత సీజన్లో లేని దిమ్మతిరిగే ట్వీస్టులు ఇవ్వడంతో ఎప్పుడూ లేని భారీ రెస్పాన్స్‌ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దూసుకపోతోంది. హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో రసవత్తరంగా రన్ అవుతోంది. అయితే.. ఈ సీజన్ లో ఐదో వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ నైనిక కంటెస్టెంట్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ డాన్సర్ నైనిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. నాలుగో వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినా సోనియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఓ లేడీ కంటెస్టెంట్ సిగరెట్ తాగుబోతుంటే.. తననీ అడ్డుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని యాంకర్ ప్రస్తావిస్తూ ఇంతకీ ఆ లేడీ కంటెస్టెంట్ ఎవరిని ప్రశ్నించాడు. నైనిక సమాధానం ఇస్తూ..'సరిగా తెలియదు .. ఎవరెవరి విషయాలు బయటకు వచ్చాయో? నాకు తెలియదు. అయినా ఈ అమ్మాయి తాగుతున్నట్లు చూపించారా ?' అని తెలివిగా యాంకర్ నే నైనిక ప్రశ్నించింది. దీనికి యాంకర్ 'లేదు' అని సమాధానం ఇస్తాడు.

Bigg Boss telugu season 8 contestant Nainika shocking comments on bigg boss contestants

'అయితే తనకు కూడా తెలియదని ఆ విషయాన్ని చెప్పాలనుకోవడం లేదు' అంటూ తెలివిగా సమాధానం ఇస్తుంది. 'అయినా.. లైవ్ లో వస్తే అందరికీ తెలుసు తెలిసింది కదా.. దాన్ని ప్రత్యేకంగా తాను చెప్పాదల్చుకోవడం లేదు. అయినా సోనియా ఎవరితో మాట్లాడిందో తనకు తెలియదు' అని చెప్పింది. హౌస్ లో ఉన్న పరిస్థితులలో సిగరెట్ తాగాలనిపించడం తప్పేమీ కాదని షాకింగ్ కామెంట్స్ చేసింది.

'అయినా అబ్బాయిలు సిగరెట్ తాగితే ఒప్పు.. అమ్మాయిలు సిగరెట్ తాగితే తప్పా అనిఎందుకు అంటున్నారు తనకు అర్థం కావడం లేదు, ఎందుకు ఈ డిస్క్రిమినేషన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నైనిక. మరి మీరు ఎప్పుడైనా డిప్రెషన్లోకి వెళ్లిపోయారా? అంటూ ప్రశ్నించగా.. తాను కూడా చాలా సార్లు లోన్లీగా ఫీల్ అయ్యారని, ఆ సమయంలో తాను మ్యాగీ తినాలని, పానీ పూరి తినాలని ఫీల్ అయ్యాననీ అన్నారు. కనీసం స్వీట్స్ కూడా ఇవ్వలేదని, తాను రిలీఫ్ కోసం .. చాక్లెట్లు తింటానని, లేదంటే పడుకుంటానని చెప్పింది. కానీ హౌస్ లో పడుకుంటే పనిష్మెంట్ ఇచ్చేవారు అంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది డాన్సర్ నైనిక.

ఇదెలా ఉంటే.. హౌస్ లో సిగరెట్ తాగుతున్న బోల్డ్ బ్యూటీ ఎవరబ్బా అని బిగ్ బాస్ లవర్స్ తెగ సెర్చ్ చేశారు. ఈ క్రమంలో కిర్రాక్ సీతనే కావొచ్చని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. కానీ, అసలు విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దమ్ముకొడుతున్న అమ్మడు ఎవరో కాదు.. విష్ణు ప్రియ నే. వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా కొత్త కంటెస్టెంట్లు వచ్చిన తరువాత.. కంటెస్టెంట్లందరూ స్విమ్మింగ్ పూల్‌లో మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో విష్ణు ప్రియ ఓ కార్నర్ లో కనిపిస్తోంది. స్మోకింగ్ ఏరియాలో కూర్చుని ఎంచక్క సిగరెట్ తాగుతూ కెమెరాకు దొరికిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X