Bigg Boss Telugu 8: 9 నెలల గర్భవతిని విడిచి బిగ్‌బాస్‌లోకి.. శేఖర్ బాషా కోరిక ఏమిటో తెలుసా?
Bigg Boss Shekar Basha: బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి కంటెస్టెంట్ కు ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ ఉంది. కొంతమంది తమ గతాన్ని హౌస్ లో చెప్పుకుని కన్నీళ్లు పెట్టించారు. బీబీ లవర్స్ సింపతీని గ్రాబ్ చేసే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఒక్కక్క కంటెస్టెంట్ ఏదో ఒక సందర్భంలో ఎమోషనల్ గా బస్ట్ అవుతున్నారు. కానీ బిగ్‌బాస్ 8 తెలుగు కంటెస్టెంట్ శేఖర్ బాషా మాత్రం అందుకు భిన్నం. ఆయన ఈ షోలోకి రాకముందు ఎన్నో అవమానులు ఎదుర్కొన్నారో.. ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. కానీ ఏ రోజు కూడా సింపథీ గేమ్ ఆడలేదు. పైగా నవ్వుకుంటూ.. అందర్ని నవ్విస్తూ బీబీ ప్రేక్షకుల ఎంటర్ ట్రైన్ మెంట్ అందిస్తున్నారు. అలాంటి శేఖర్ బాషా ఓ బాధను దిగమింగుకుంటూ గేమ్ ఆడుతున్నారట.
రేడీయో జాకీ, టీవీ యాంకర్‌గా, క్రికెట్ కామెంటేటర్‌గా పేరు సంపాదించుకున్నాడు శేఖర్ బాషా. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. టీవీ రంగంలో ఒక దశాబ్దం పాటు జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్ టీవీ ఛానల్ లలో వీజేగా వ్యవహరించాడు. 2019 ఇండియా-వెస్ట్ఇండీస్ క్రికెట్ సీజన్ కి క్రీడా వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. మన ఇండియాలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రేడియో అవార్డు "ఎక్సలెన్స్ ఇన్ రేడియో" ఐఆర్ఎఫ్ పురస్కారాన్ని 19 సార్లు గెలుచుకున్న ఏకైక వ్యక్తి శేఖర్ బాషా అని చెప్పుకోవచ్చు. ఎంతో మందిచే ప్రశంసలు అందుకున్నాడు. ఎంట్టైన్మెంట్‌కు కింగ్ గా ఓ ట్యాగ్ సంపాదించుకున్నాడు.

ఇకపోతే శేఖర్ బాషా ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్-8 లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హౌస్‌లో కుస్తో.. కాస్తో..
సందడి ఉండంటే అది శేఖర్ బాష వలనే. సిట్యూవేషన్ దగ్గట్లు పంచ్‌లు, కుళ్లు జోకులు వేస్తూ జనాల్ని నవ్విస్తున్నాడు. నిజంగా ఆయన జోకుల కోసం షో చూసే ఫ్యాన్స్ కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన తెలుగును రోస్ట్ చేసేస్తారు. ఆయన జోకులతో తొలుత విసిగించినా.. తరువాత గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నారు హౌస్ మెట్స్.
బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా శేఖర్ బాషా జోకులకు ఫిదా అయ్యారు. నీ జోకులతో హౌస్ మేట్స్ ను చంపేస్తున్నావ్ గా అంటూ శేఖర్ బాషాను ఆట పట్టించే ప్రయత్నం చేశారు. నిజంగా ఆయన లోపల ఎన్నో బాధలు ఉన్నా ఏ రోజు కూడా ఎమోషనల్ అవ్వడం, థింపతీ చూపుట్టుకునే ప్రయత్నాలు లాంటివి చేయలేదు. కానీ ఆదిత్య పదే పదే శేఖర్ ను 'మీ మనసు ఇక్కడ లేదు ఎక్కడో ఉంది' అని అంటుంటాడు. శేఖర్ బాషా అలా ఉండటానికి కారణమేంటో తాజాగా బయటపడింది.
శేఖర్ బాషా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేముందు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో శేఖర్ బాషా మాట్లాడుతూ తన భార్య గర్భవతి అని చెప్పాడు. ఎవరైనా సరే ఈ టైంలో వారి పక్కన ఉండాలనుకుంటారంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీ భార్య 9 నెలల గర్భవతి అయినా హౌస్‌లోకి వెళ్తున్నారు.. మీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కానీ అది కరెక్టేనా అంటూ యాంకర్ శేఖర్ ను ప్రశ్నించగా.. మొత్తం సైలెంట్ అయిపోయాడు. తర్వాత మెల్లిగా సమాధానం చెబుతూ..'నేను బిగ్‌బాస్‌కు వెళ్లాలని నా భార్య కోరిక, ఆమె కోరిక తీర్చడానికి బిగ్ బాస్ లోకి వెళ్తున్నా. నేను వచ్చే సంవత్సరం అయినా వెళ్లొచ్చు అని ఆమెకు చాలా క్లియర్‌గా చెప్పాను. కానీ తప్పకుండా వెళ్లాల్సిందే అని చెప్పింది. కానీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాక నా భార్యకు ఎలా ఉంటుందో అని టెన్షన్, బెంగ మాత్రం తప్పకుండా ఉంటుంది' అని శేఖర్ బాషా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

కానీ శేఖర్ ఇప్పటివరకు నా భార్య ప్రెగ్నెన్సీ అని ఎప్పుడూ చెప్పలేదు. ఆ ప్రస్తావన కూడా తీసుకరాలేదు. ఎవరి దగ్గర సింపథీ చూపించుకునే ప్రయత్నం చేయలేదు. ఆయనకు తన భార్య గురించి బాధేసినప్పుడు సింగిల్‌గా కూర్చుని బాధపడుతున్నాడు తప్ప ఏడ్వడం భార్యను అడ్డం పెట్టుకుని ఫేమ్ అవ్వాలనుకోవట్లేదు. నిజంగా శేఖర్ బాషా గ్రేట్.. మనస్సులో ఎన్నో బాధలున్నా.. ఏ రోజు కూడా ఆ బాధను ఎవరికి చెప్పలేదు. బయటకు చూపించలేదు బాస్. పైగా .. పంచులు వేస్తూ.. జోకులు చెబుతూ.. హౌస్ లో అందర్నీ ఎంటర్టైన్ చేస్తున్నావ్ .. అవసరమైతే మోటివేట్ చేస్తున్నావ్ భయ్యా.. అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











