Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్? ఎవరెవరు? లాంచ్ డేట్ ఎప్పుడంటే?

అప్పటివరకు మన తెలుగు బుల్లితెర వద్ద పలు ఛానెల్స్ లో ఎన్నో రియాలిటీ షోలు ఉన్నాయి కానీ వాటి అన్నిటిని మించి మంచి క్రేజ్ తెచ్చుకున్న గ్రాండ్ రియాలిటీ గేమ్ షో ఏదన్నా ఉంది అంటే ఆ గేమ్ షో ఖచ్చితంగా "బిగ్ బాస్" అని చెప్పాలి. అవ్వడానికి వెస్ట్రన్ దేశాల్లో స్టార్ట్ అయినా ఇండియాలో కూడా ఈ షో కి అమితమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా హిందీలో ఇప్పటికే 12 సీజన్లు పూర్తయ్యాయి.

ఓటిటి వెర్షన్ కి కూడా మూడో సీజన్ పెట్టేసారు. కానీ మన తెలుగులో వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఏ భాషలో కూడా రాలేదు. ఇండియా లోనే హైయెస్ట్ రేటింగ్స్ మనం బిగ్ బాస్ కి అందించాం. ఇలా తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు ఆల్రెడీ 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

bigg boss telugu season 8 contestants leaked list Here is launch date details

కాగా ఇప్పుడు ఎనిమిదివ సీజన్ రాబోతుండగా దీని కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక చూస్తూ చూస్తూనే ఈ ఏడాదిలో సగం పూర్తయిపోయింది. సో బిగ్ బాస్ హడావుడి కూడా మొదలవుతుంది. ఈ తరుణంలో ఈసారి సీజన్ తాలూకా డేట్ అండ్ కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అయ్యాయి. కాగా ప్రస్తుతం ఉన్న బజ్ అండ్ కొన్ని అంతర్గత వర్గాల ప్రకారం ఈ సారి సీజన్ ఈ సెప్టెంబర్ 8 నుంచి మొదలు కానుంది అట.

కాగా ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈసారి కంటెస్టెంట్స్ పేర్ల విషయానికి వస్తే కాస్త బాగా తెలిసిన పేర్లే స్టార్ మా వారు పట్టుకున్నారు అనిపిస్తుంది. ఇవి చూస్తే ఇందులో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉన్నాడట. ఇంకా రీసెంట్ కాంట్రవర్సీ కిరాక్ ఆర్పీ, ప్రముఖ నటి సురేఖ వాణి, తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యిన బర్రెలక్క ఇంకా యాంకర్ రీతూ పేర్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. అలాగే కుమారి ఆంటీ, కుషిత కళ్లపు, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, ప్రణయ్ అమృత, జబర్దస్త్ వర్ష, వెటరన్ నటుడు సుధాకర్ ఇంకా యూట్యూబ్ ఫేమ్ బంచిక్ బబ్లూ, సోషల్ మీడియా ఫేమ్ సోనియా సింగ్, ఇంకా నటి హేమ పేరు కూడా మరోసారి పరిశీలనలో ఉందట.

bigg boss telugu season 8 contestants leaked list Here is launch date details

కాగా వీరిలో కొందరు సినిమా పరంగా మంచి పాపులర్ అయ్యి ఫేడ్ అవుట్ అయ్యిన వారు అయితే ఇంకొందరు సోషల్ మీడియాలో, స్మాల్ స్క్రీన్ పై పాపులర్ అయ్యిన వారు అని చెప్పాలి. ఈ మొత్తం ఉంటే ఈసారి ఆట మరింత రసవత్తరంగా ఉంటుంది అని చెప్పొచ్చు.. అలాగే రానున్న రోజుల్లో మరికొందరు పేర్లు కూడా బయటకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మరి ఇదే అఫీషియల్ లిస్ట్ గా బయటకి వస్తుందా లేదా అనేది మాత్రం ఇంకొంత కాలం ఆగి చూడాల్సిందే.

ప్రస్తుతం అయితే స్టార్ మా వారు సెట్ వర్క్స్ అండ్ కంటెస్టెంట్స్ పేర్లు ఫైనల్ చేయడంలో బిజీగా ఉన్నారట. లాస్ట్ సీజన్ తో ఓపెనింగ్ అండ్ ఫైనల్ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చాయి దీనితో స్టార్ మా వారు పడిపోయిన రేటింగ్స్ మళ్ళీ లేచాయి. మరి ఈ సీజన్ తో దాన్ని కంటిన్యూ చేస్తారో లేదో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X