Bigg Boss Telugu 8: కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్స్! ఆ హాట్ బ్యూటీకే హయ్యెస్ట్.. !!
బిగ్ బాస్.. బిగ్ బాస్.. నెట్టింట్లో ఎక్కడ చూసిన ఇదే గోల.. అతి తక్కువ సమయంలో బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన బిగ్గెస్ట్ షో బిగ్ బాస్. రియాల్టీ కాన్సెప్టుతో.. అడుగడుగున ఎన్నో ట్విస్టులతో సాగే.. హై టీఆర్పీతో దూసుకెళ్తుంది. ఈ షో స్టార్టయిందంటే చాలు.. బీబీ లవర్స్ టీవీలకు లేకపోతే ఫోన్లకు అతుక్కపోతారు. ప్రపంచాన్ని మరి ప్రతినిషమం ఏం జరుగుతుందా? అని చాలా ఎగ్జైటింగ్ గా చూస్తుంటారు. ఈ రేంజ్‌లో బిగ్‌బాస్ షోకు చూస్తుండటంతో హయ్యెస్ట్ టీఆర్పీతో దూసుకుపోతుంది.
ఇంతటి పాపులర్టీ సంపాందిచుకున్న షో దేశంలో ఉన్న పలు భాషల్లో ప్రసారం అవుతుంది. అయితే.. అన్నింటి కంటే తెలుగులోనే ఎక్కువగా సక్సెస్ అయ్యిందని చెప్పొచు. ఏ షోకు లభించని అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకుని తెలుగు లో సెన్సేషన్ షో గా మారింది. ఇలాంటి షో ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని వేచి చూసిన ఈ 'బిగ్‌బాస్ సీజన్-8'సెప్టెంబరు 1 వ తేదీన ప్రారంభమైంది. దీంతో తెలుగు ప్రేక్షకుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. నిన్న రాత్రి 7 గంటలకు తెలుగు ప్రజలంతా టీవీలకు మొఖాలు పెట్టి బిగ్‌బాస్ షో వీక్షించారు.

ఇకపోతే షో లో సందడి చేసేందుకు పలువురు సెలబ్రిటీలు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అందరూ సోషల్ మీడియాలో ఫేమ్ దక్కించుకున్న వారే కాబట్టి షో పై మరింత హైప్ పెరుగుతోంది. ఈసారి హౌస్‌లో కంటెస్టెంట్ల ఫార్మామెన్స్ ఎలా ఉండబోతుందంటూ గడిచిన ఒక రోజులోనే జనాల్లో నానా ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే.. ఈ షోకు యష్మీ గౌడ, అభయ్ నవీన్, కన్నడ హీరో నిఖిల్, కృష్ణ ముకుందా మురారి సీరియల్ నటి ప్రేరణ కంభం, ఆదిత్య ఓం,సోనియా, సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క, శేఖర్ బాష, కిరాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, విష్ణు ప్రియ, నైనిక, నబీల్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
బిగ్‌బాస్-8 ఏ కంటెస్టెంట్ పారితోషికం హయ్యెస్ట్..
షో ప్రారంభమైన మరుసటి రోజే బిగ్‌బాస్ సీజన్-8 లో ఏ కంటెస్టెంట్ రెమ్యునరేషన్ ఎంతంటూ సోషల్ మీడియాలో గుసగుసలు స్టార్ట్ చేశారు జనాలు. కామన్‌గా వన్ వీక్ తర్వాత రెమ్యునరేషన్ చెల్లిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎవరు అత్యధిక పారితోషికం అందుకోబోతున్నారో నెట్టింట ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో లీక్ అయిన సమాచారం ప్రకారం.. యాంకర్ విష్ణుప్రియ వారానికి రూ. 4 లక్షలు తీసుకోబోతుందట. అందరికంటే ఈమె పారితోషికమే ఎక్కువని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. తర్వాత హీరో ఆదిత్య (3 లక్షల రూపాయలు), ఆదిత్య ఓం( రూ.3 లక్షలు), యష్మీ గౌడ(రూ.2.50), ఆర్జే శేఖర్ బాషా (రూ.2.50),నిఖిల్ మలియక్కల్ (రూ.2.25) నైనికా(రూ.2.20 లక్షలు), అభయ్ నవీన్(రూ.2 లక్షలు), కిరాక్ సీత, ప్రేరణ కంభం, నబీల్ అఫ్రీదీ(రూ.2 లక్షలు), సోనియా(రూ.1.50), బెజవాడ బేబక్క(రూ.1.50), పృథ్వీరాజ్(రూ.1.5)నాగ మణికంఠ(1.20 లక్షలు రూపాయలు). ఇందులో విష్ణుప్రియనే ఎక్కువగా పారితోషికం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











