Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ ఇవే! ఎవరికి ఎంతో తెలుసా?
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్.. బిగ్ బాస్.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇదే పేరు. గతంలో ఎప్పుడూ చూడని సరికొత్త కాన్సెప్ట్ లతో ముందుకు సాగుతోంది. బిగ్ బాస్ 8 తెలుగు ఈ సీజన్ ప్రారంభం నుంచి ఊహించని టాస్కులు, కాంట్రవర్సీలు, గొడవలు, లవ్ సోర్టీలు, రొమాంటిక్ మూమెంట్స్ తో హౌస్ మేట్స్ నానా రచ్చ చేస్తున్నారు. ఫస్ట్ వీక్ లోనే యూట్యూబర్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది. దీంతో ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్లే ఉన్నారు. ఇదిలాఉంటే.. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఏ కంటెస్టెంట్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? ఏ కంటెస్టెంట్ తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారో మీరు కూడా ఓ లూక్కేయండి.
ఇండియాలోనే మోస్ట్ పాపులర్ రియాలిటీ షో గా గుర్తింపు సంపాదించుకుంది బిగ్ బాస్. ఈ షోలోకి ఎంతో మంది పోటీ పడుతున్నారు. కానీ, ఆ అద్రుష్టం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. తాజా సీజన్ లో సందడి చేసేందుకు పలువురు సెలబ్రిటీలు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అందరూ సోషల్ మీడియాలో ఫేమ్ దక్కించుకున్న వారే కాబట్టి షో పై మరింత హైప్ పెరుగుతోంది. ఈసారి హౌస్‌లో కంటెస్టెంట్ల ఫార్మామెన్స్ ఓ రేంజ్‌లో ఇరగదీస్తున్నారు.

ప్రస్తుతం షోలో యష్మీ గౌడ, అభయ్ నవీన్, కన్నడ హీరో నిఖిల్, కృష్ణ ముకుందా మురారి సీరియల్ నటి ప్రేరణ కంభం, ఆదిత్య ఓం, ఆర్జీవీ హీరోయిన్ సోనియా ఆకుల, ఆర్జే శేఖర్ బాష, కిరాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, విష్ణు ప్రియ, నైనిక, నబీల్, బెజవాడ బేబక్క
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఫస్ట్ వీక్ లోనే బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. అయితే.. ఆమె రెమ్యూనరేష్ తీసుకుంది. ఇంతకీ ప్రతి కంటెస్టెంట్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారనే చర్చ మొదలైంది.
షో ప్రారంభమైన మరుసటి రోజు నుంచే బిగ్‌బాస్ సీజన్-8 లో ఏ కంటెస్టెంట్ రెమ్యునరేషన్ ఎంతంటూ సోషల్ మీడియాలో గుసగుసలు స్టార్ట్ చేశారు జనాలు. కామన్‌గా వన్ వీక్ తర్వాత రెమ్యునరేషన్ చెల్లిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎవరు అత్యధిక పారితోషికం అందుకోబోతున్నారో నెట్టింట ఆసక్తి నెలకొంది. ప్రతీ వారం బిగ్‌బాస్ ఇంత రెమ్యునరేషన్ ఇస్తానని ముందే ఒప్పందం కుదుర్చుకుందట.
తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ తెలుగు 8 షోలోకి ఫస్ట్ కంటెస్టెంట్‌గా యష్మీ గౌడ అడుగుపెట్టారు. ఆమెకు ప్రతీ వారం 2.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలిసింది. ఇక రెండో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన టెలివిజన్ నటుడు నిఖిల్‌కు ప్రతీ వారం 2.25 లక్షల రూపాయలు పారితోషికం ఇచ్చేందుకు నిర్వాహకులు అగ్రిమెంట్ చేసుకున్నారట. ఇక 3వ కంటెంస్టెంట్‌గా వచ్చిన అభియ్ నవీన్ ప్రతీ వారం 2 లక్షల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం జరిగిందనే తాజా సమాచారం. అలాగే.. ప్రేరణ ప్రతీ వారం 2 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు తెలిసింది. ఫైర్ బాండ్ సోనియా ఆకుల 1.5 లక్షల రూపాయలు ప్రతీవారం తన రెమ్యునరేషన్‌గా తీసుకోబోతుందట.

ఇక బిగ్‌బాస్ ఇంటిలో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న బెజవాడ బేబక్క ప్రతీ వారం 1.5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారని, ప్రముఖ ఆర్జే శేఖర్ భాషాకు ప్రతీవారం 2.5 లక్షల రూపాయల రెమ్యురేషన్ అందిస్తున్నట్టు తెలుస్తోంది. బోల్డ్ బ్యూటీ కిర్రాక్ సీతకు ప్రతీవారం 2 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు తెలిసింది. ఇక ఎమోషనల్ స్టార్ మణికంఠకు అత్యంత తక్కువగా 1.2 లక్షల రూపాయలు ప్రతీ వారం అందుకోనున్నారట.
యాంకర్, హాట్ బ్యూటీ విష్ణుప్రియ అందరి కంటే ఎక్కువగా ప్రతీవారం 4 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఢీ షో విన్నర్ నైనిక కు ప్రతీ వారం 2.2 లక్షల రూపాయలు పారితోషికంగా చెల్లించేందుకు అంగీకారం జరిగిందని తెలిసింది. అలాగే యూట్యూబర్ నబీల్ ఆఫ్రిది కి ప్రతీ వారం 2 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











