Bigg Boss Telugu 8: బిగ్ బాస్ లో దుమ్మురేపుతోన్న పొట్టిపిల్లా.. ఈ డాన్సింగ్ డాల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Bigg Boss Telugu 8: అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభమైన విషయం తెలిసిందే. గతంలో ఏ సీజన్లో లేని ట్వీస్టులతో కంటెస్టెంట్లకే కాదు బిగ్ బాస్ ప్రేక్షకులకు కూడా దిమ్మతిరిగి పోయేలా చేస్తున్నాడు బిగ్ బాస్. ఇలా రసవత్తరంగా సాగుతూన్న ఈ సీజన్ విజయవంతంగా 4 వారాలు కంప్లిట్ చేసుకొని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ లో 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది ఢీ ఫేమ్ డ్యాన్సర్ నైనిక. తనదైన ఆట తీరుతో బిగ్ బాస్ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్న పొట్టిపిల్లా నైనిక రెమ్యునరేషన్ ఎంత? అనే చర్చ నెట్టింట్లో జోరుగా సాగుతోంది. ఎంతనో మీరు కూడా ఓ లూక్కేయండి
ఇప్పటివరకు విజయవంతంగా నాలుగు ఎలిమినేషన్స్ పూర్తి చేసుకుని ఐదో వారంలో అడుగుపెట్టింది బిగ్ బాస్ సీజన్ 8. తాజాగా బిగ్ బాస్ ఇంట్లో భూకంపం అంటూ.. 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇవ్వబోతున్నారంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. అంతేకాదు. వారిని అడ్డుకునే శక్తి కూడా మీకు ఉందంటూ ఫిట్నెస్ టెస్టుల పేరిట ఊహించని టాస్కులు ఇస్తూ కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నారు బిగ్ బాస్. ఇప్పటి వరకూ నాలుగు వైల్డ్ కార్డు ఎంట్రీలను ఆపిన కంటెస్టెంట్స్ మరిన్ని టాస్కులు ఆడించనున్నారు బిగ్ బాస్. ఈ తరుణంలో డి సేమ్ నైనిక తన ఆటతీరుతో అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది.

కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 లో డ్యాన్సర్ నైనిక 13 వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ టీవీలో ప్రసారమైన ఢీ షో ద్వారా నైనిక తెలుగు ప్రజల్లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఈ పొట్టిపిల్లా ముందు మగ డ్యాన్సర్లు కూడా చేతులెత్తేశారు. ఆ రేంజ్‌లో డ్యాన్స్ చేస్తుంది డాన్సింగ్ డాల్ నైనిక. ఇక నైనిక-సాయి జోడి బాగా పాపులర్ అయ్యిందని చెప్పుకోవచ్చు. వీరద్దరి కాంబోలో స్టెప్పులు వేస్తే స్టేజ్ దద్దరిల్లాల్సిందే. అంతలా వీరి డాన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ ఫర్సామెన్స్‌లతో అయితే సాయి-నైనిక మరింత ఆకట్టుకున్నారు. హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు.
ఒడిశాలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు.. తాను పుట్టినప్పడే ఆడపిల్ల అనే కారణంతో తండ్రి వదిలేశాడు. ఈ విషయాన్ని ఢీ స్టేజ్ మీద కూడా చెప్పి చాలా ఎమోషనల్ అయింది నైనిక. ఇక డ్యాన్స్ విషయాన్ని కస్తా పక్కన బెడితే.. సినిమాల్లో నటించేందుకు బాగానే ట్రై చేసింది ఈ బ్యూటీ. కానీ చాలా మంది నిర్మాతలు డైరెక్ట్‌గా ఫోన్ చేసి కమిట్‌మెంట్ అడిగారని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఈ విషయం నచ్చకపోవడంతో సిని ఆఫర్ కోసం ట్రై చేయడం మానేశానని డ్యాన్స్ షోలు, రీల్స్, వెబ్ సిరీస్‌లు చేస్తున్నట్లు చెప్పింది నైనిక. ఇక నైనిక రీసెంట్‌గా చేసిన నయనం వెబ్ సిరీస్ బాగా క్లిక్ అయింది.ఇందులో నటన, అందంతో కట్టిపడేసింది నైనిక. ఇక సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ ట్రీట్‌తో నెటిజన్లకి కనులవిందు చేస్తుంటుంది ఈ బ్యూటీ.

ఇకపోతే నైనిక ఎవరూ ఊహించని విధంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్రాండ్‌గా స్టార్ట్ అయిన ఈ షోకునైనిక స్పెషల్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టి తొలిరోజే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే, వారానికి ఇంత అని హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ నిర్వాహకులు రెమ్యూనరేషన్ ఇస్తారన్న విషయం తెలిసిందే.
కాగా ఢీ నైనికకు కాస్త తక్కువ పారితోషికం ఇస్తున్నారని టాక్. ఈ బ్యూటీకి బిగ్ బాస్ వారానికి రూ.2 లక్షల 25 వేలు పే చేస్తుందట. ఇతర కంటెస్టెంట్లతో పోల్చుకుంటే.. నైనిక పారితోషికం కాస్తా బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఇక నైనిక హౌస్‌లో నామినేషన్ల నుంచి తప్పించుకుంటూ చాలా తెలివిగా ఆట ఆడుతుంది. నెక్స్ట్ ఐదో వారం ఎలిమినేషన్ ఉంది. మరీ ఎవరూ ఎలిమనేషన్ అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











