Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌ ఇంటిలో గంగవ్వకు గుండెపోటు? షాక్‌లో కంటెస్టెంట్లు,నిర్వాహకులు

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది.ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆరవ వారం వైల్డ్ కార్డు ద్వారా ఎనిమిది మంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే హౌస్‌లో ఉన్న వారిని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ (ఓజీ)గా, వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినవారిని రాయల్ క్లాన్‌గా విడిపోయి గేమ్ అడుతున్నారు. వైల్డ్ కార్డు ద్వారా ఏంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో గంగవ్వకు గుండెపోటు వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలేం జరిగిందంటే?

బిగ్ బాస్ సీజన్ 8లో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వైల్డ్ కార్డ్ ద్వారా పాత కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించిన విషయం తెలిసిందే. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లను ఢీకొట్టడం కోసం ఎనిమిది మంది కంటెస్టెంట్లను వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఎంట్రీ ఇచ్చిన వారిలో హరితేజ, టేస్టీ తేజ, రోహిణి, గౌతమ్, నయని పావని, మెహబూబ్, ముక్కు అవినాష్, గంగవ్వ లు ఉన్నారు. వారు హౌస్ లో అడుగుపెట్టిన తరువాత.. బిగ్ బాస్ షో కాస్త జోష్ వచ్చిన విషయం తెలిసిందే. అందులో ఓ కంటెస్టెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

Bigg Boss Telugu season 8 Did Gangavva suffer heart attack inside the Bigg Boss house

వయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ నిర్ణయం తప్పని నిరూపించింది యూట్యూబర్ గంగవ్వ. టాలెంట్‌కు , వయస్సు కు ఎలాంటి సంబంధం లేదనీ, తనకు ఇష్టమైన రంగంలో రాణిస్తుంది గంగవ్వ. అక్షరం ముక్క కూడా తెలియకుండా గంగవ్వ నేడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా అంటే తెలియని గంగవ్వ నేడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా మారింది. యూబ్యూట్ ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 4లోనూ ఎంటర్ చేసింది. వయసుతో సంబంధం లేకుండా చాలా యాక్టివ్ గా ఉంటూ.. తన కామెడి టైమింగ్ తో నవ్వుల పువ్వులను పూయిస్తోంది.

అయితే..4 వ సీజన్లో తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో మధ్యలో నుండి ఎలిమినేటర్ అయి వెళ్లిపోయింది. కానీ ఈ సారి మాత్రం ఓ కొత్త లూక్ లో ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. తొలి రోజు నుంచి తగ్గదేలే అన్నట్టుగా యంగ్ కంటెస్టెంట్లతో పోటీపడి టాస్కులు ఆడుతోంది. స్పెషల్ పవర్స్ కూడా సంపాదించుకుంది. యంగ్ కంటెస్టెంట్లకు కూడా చుక్కలు చూపిస్తోంది. గంగవ్వ. అయితే.. గత రాత్రి గంగవ్వకు గుండెపోటు వచ్చిందనే వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. పలువురు బిగ్ బాస్ రివ్యూవర్స్ ఈ విషయం తెలియజేశారు. అసలేం జరిగిందంటే..?

Bigg Boss Telugu season 8 Did Gangavva suffer heart attack inside the Bigg Boss house

అసలేం జరిగిందంటే.. గంగవ్వకు కాస్త అస్వస్థతకు గురి కావడంతో ఇతర కంటెస్టెంట్స్ తీవ్ర ఆందోళకు గురయ్యారట. విష్ణుప్రియ అయితే చాలా టెన్షన్ పడ్డారంట. గంగవ్వకు హార్ట్ అటాక్ వచ్చిందా? అని భయపడిందట. ఇంతలోనే గంగవ్వకు వైద్యం అందించేందుకు వైద్యుల బృందం బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించారట. ఈ విషయం హౌస్ లో కాస్త అలజడికి గురి చేసింది. ఇందంతా ఫ్రాంక్ అంట. నిజంగా గంగవ్వకు హార్ట్ అటాక్ రాలేదట. గంగవ్వ తన నటనతో బిగ్ బాస్ తన తోటి కంటెస్టెంట్స్ కి ఝలక్ ఇచ్చిందట.

ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ ప్రచారం అవుతున్నది. అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇలాంటి టాస్కుల ద్వారా కంటెస్టెంట్స్ తో పాటు అభిమానులతో ఆందోళన గురి చేయడం సరికాదంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X