Bigg Boss Telugu 8: తొలి రోజే ఎలిమినేషన్.. హోస్టుగా మరో స్టార్ హీరో.. కొత్త కంటెస్టెంట్లుగా ఆ ఇద్దరు
బుల్లితెరపై కనివినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ.. సుదీర్ఘ కాలంగా ఇండియాలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది తెలుగు బిగ్ బాస్. మొదటి సీజన్ నుంచే మతిపోగొట్టే రికార్డులను బ్రేక్ చేస్తోంది కాబట్టే నిర్వహకులు ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సీజన్లను తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఎనిమిదో దాన్ని ప్లాన్ చేశారు. నేడే (సెప్టెంబర్ 1వ తేదీన) ఇది అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ప్రోమోను విడుదల చేశారు. అందులో ఏమేమి విశేషాలను చూపించారో మీరే చూసేయండి మరి!
గ్రాండ్‌గానే ఎనిమిదో సీజన్
తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఎనిమిదో దాన్ని నేటి నుంచి ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి. ఈ సీజన్‌ను అంతులేని వినోదం అనే కాన్సెప్టుతో తీసుకు వస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

ఆ స్టార్లు అందరూ గెస్టులు
ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ఈరోజు సాయంత్రం నుంచి ప్రారంభం కాబోతుంది. దీనికి అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తుండగా.. 'సరిపోదా శనివారం' ప్రమోషన్ కోసం నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ వచ్చారు. అలాగే, దగ్గుబాటి రానా, నివేదా థామస్ '35' మూవీ కోసం విచ్చేశారు. అనిల్ రావిపూడి కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
నానిని హోస్ట్ చేయమని
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ కోసం గెస్టుగా వచ్చిన నానితో హోస్ట్ అక్కినేని నాగార్జున 'నా కోసం నువ్వు ఒక పని చేయాలి' అని అడిగారు. దీనికతడు 'మీకోసం ఏదైనా చేస్తాను' అని చెప్పాడు. అప్పుడు నాగ్ 'నేను నాలుగు వారాలు హాలీడేకి వెళ్తున్నా. నాకోసం షో హోస్ట్ చేయాలి' అని అడిగాడు. దీంతో భయపడిన నాని అది తన వల్ల కాదని చెప్పేశాడు.
కొత్త కంటెస్టెంట్లుగా వాళ్లు
ఎంతో గ్రాండ్‌గా సాగబోతున్న బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్‌లో '35' సినిమా కోసం హీరోయిన్ నివేదా థామస్, నిర్మాత దగ్గుబాటి రానా వచ్చారు. అప్పుడు వాళ్లను నాగార్జున ట్విస్ట్ ఇస్తూ 'మీరిద్దరూ కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి వెళ్లాలి' అని చెప్పాడు. దీంతో నివేదా 'నేను మూడు రోజులు, రానా 5 రోజులు ఉంటాం. అప్పుడు 35 అవుతుంది' అంటూ బదులిచ్చింది.
తొలిరోజే ఎలిమినేషన్‌తో
ప్రీమియర్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు అందరూ లోపలికి వెళ్లిపోయిన తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి కూడా హౌస్‌లోకి వెళ్లాడు. అప్పుడాయన 'ఈసారి సీజన్ లిమిట్‌లెస్ అంట. ట్విస్ట్ అంట.. టర్న్ అంట.. ఆ పని ఫస్ట్ వీక్ నుంచే మొదలుపెడుతున్నారు. నేను ఇప్పుడు ఒకరిని బయటకు తీసుకు వెళ్తే.. వాళ్ల ప్లేస్‌లో ఇంకొకరు లోపలికి వస్తారు' అని షాక్ ఇచ్చాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తం ట్విస్టులతో సాగబోతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ ప్రోమో ఫుల్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











