Bigg Boss Telugu Season 8 Live: బిగ్‌బాస్‌లోకి రష్మిక మందన్న ఫ్రెండ్..నేషనల్ క్రష్‌తో అలాంటి రిలేషన్
తెలుగు టెలివిజన్ రంగంలో అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకొన్న రియాలిటీ షో బిగ్‌బాస్. బిగ్‌బాస్ తెలుగు 8 షో సెప్టెంబర్ 1వ తేదీన గ్రాండ్‌గా మొదలైంది. ఈ షోకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసింది. ఈ షోకు సంబంధించిన లైవ్ అప్ డేట్స్, ఎవరెరవరూ ఈ షోలో పాల్గొంటున్నారనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 8 షోలోకి వెళ్లనున్నట్టు ప్రచారం జరుగుతున్న కంటెస్టెంట్ల వివరాలు: నైనిక, బేబక్క, యష్మీ గౌడ, ఆదిత్య ఓమ్, నిఖిల్ మాలియక్కల్, అభయ్ నవీన్, శేఖర్ భాషా, కిర్రాక్ సీత, సోనియా ఆకుల, విష్ణుప్రియ, ప్రేరణ, పరమేశ్వర్ హిర్వాలే, న్యూస్ రీడర్ కల్యాణి, మణికంఠ, రవితేజ అనపర్తి

బిగ్‌బాస్ తెలుగు 8 షో ఆదివారం సెప్టెంబర్ 1వ తేదీన 7 గంటలకు స్ట్రీమింగ్ ప్రారంభం కానున్నది. ఈ షోలో అపరిమితమైన వినోదం ఉంటుంది. ప్రేక్షకులకు ఫన్, ఎమోషన్స్ అందిస్తామని హోస్ట్ నాగార్జున వెల్లడించారు.
నాగార్జున అక్కినేని హోస్ట్‌గా బిగ్‌బాస్ వేదికపైకి వచ్చారు. తనదైన శైలిలో స్టేజ్ మీదకు వచ్చిన ఆయన అమ్మాయిలతో రొమాంటిక్‌గా పాటపై డ్యాన్స్ చేశారు. అనంతరం హాయ్ .. హలో.. అదాబ్ అంటూ మీ నాగార్జున పలకరించారు. ప్రతీ సీజన్‌లో నాకు మంచి ఆదరణ ఇచ్చారు. ఈ సారి బిగ్ బాస్ సెట్‌ను ప్రకృతి ఇన్సిపిరేషన్‌గా నిలిచింది. పక్షలు, పూలు, చెట్లతో కళకళలాడింది అంటూ ఇంటిని పరిచయం చేశారు.
ఫస్ట్ కంటెస్టెంట్‌గా యష్మీ గౌడ్
ఇంటిలోకి ఫస్ట్ కంటెస్టెంట్‌గా యష్మీ గౌడ్ ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ పాటలపై రెచ్చిపోయి డ్యాన్సులు చేస్తూ ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత నాగార్జునతో మాటా మంతి చేశారు. బిలేటెడ్ హ్యాపీ బర్త్ డే.. అంటూ ఆమె విష్ చేసింది. ఆమె రోజ్ ఫ్లవర్స్ ఇచ్చింది. మీ స్టైల్, లుక్, హోస్టింగ్, మంచి సినిమాలు చేసినందుకు, రొమాంటిక్ సాంగ్స్ చేసినందుకు, మీపై ఉన్న క్రష్‌కు రోజ్ ఇచ్చింది. ఓ పువ్వు ఇచ్చి..నాకు మీరు ఇస్తే.. నాకు హ్యాపీ అంది. దాంతో నాగార్జున వెంటనే ఆమెకు పువ్వు ఇచ్చింది.
2వ కంటెస్టెంట్‌గా నిఖిల్
కన్నడ టెలివిజన్ యాక్టర్ నిఖిల్ నిఖిల్ మాలియక్కల్ రెండో కంటెస్టెంట్‌గా ఇంటిలోకి వచ్చాడు. ఓజీ సినిమా పాటతో స్టేజ్ మీదకు వచ్చాడు. ఆ తర్వాత డబుల్ ఇస్మార్ట్ మూవీలో మార్ ముంతా..చోడ్ చింతా పాటపై స్టెప్పులేశాడు. ఆ తర్వాత నాగార్జున అతడిని కలిశాడు. అయితే కన్నడ సినిమా రంగంలో హీరోగా చేశాను. కానీ విలన్‌గా చేయాలన్నది నా కోరిక. ప్రస్తుతం సింగిల్ అంటూ.. అరెంజ్ మ్యారేజ్ చేసుకొంటాను అని చెప్పాడు.
3 కంటెంస్టెంట్‌గా అభియ్ నవీన్
తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన అభయ్ నవీన్. బిగ్‌బాస్ తెలుగులోకి 3వ కంటెస్టెంట్‌గా ఇంటిలోకి వచ్చాడు. పెళ్లిచూపులు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆయన 10 ఏళ్లకుపైగా యాక్టర్‌గా ఉన్న గుర్తింపు రాకపోవడంతో రామన్న యూత్ సినిమాతో డైరెక్టర్‌గా మారారు. ఇంటిలోకి వెళ్లే ముందు తన భార్య చెప్పిన విషయాలను వీడియో ద్వారా చూపించారు.
4వ కంటెస్టెంట్‌గా ప్రేరణ
పుష్ప 2 సినిమాలోని పాటతో ప్రేరణ ఇంటిలోకి వచ్చారు. స్పోర్ట్స్ విమెన్‌గా గుర్తింపు చేశారు. ఫుట్ బాల్, రగ్బీ, బేస్ బాల్, హై జంప్, లాంగ్ జంప్ క్రీడల్లో ప్రావీణ్యం సాధించారు. నాగార్జునను చూసి మీరు నిజంగా మన్మథుడే. నేను చిన్పప్పుడు నుంచి చూస్తేనే ఉన్నాను. మీరు అప్పటి నుంచి అలానే ఉన్నారు. రష్మిక నాకు క్లోజ్ ఫ్రెండ్. తనతో నాకు మంచి అనుబంధం ఉంది అని అన్నారు.

బిగ్‌బాస్ స్టేజ్ మీద రానా దగ్గుబాటి
బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్ ఈవెంట్ లాంచ్ సందర్భంగా 35: చిన్న కథ కాదు సినిమా యూనిట్ తెరపైకి వచ్చారు. రానా దగ్గుబాటి, నివేదా థామస్, దర్శకుడు వచ్చారు. రానా ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ మూవీ ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ సందర్బంగా మ్యాథ్స్ అంటే నాకు ఇష్టం అని నాగార్జున చెప్పారు.

5వ కంటెస్టెంట్‌గా ఆదిత్య ఓం
వైవీఎస్ చౌదరీ దర్శకత్వంలో రూపొందిన లాహిరి లాహిరిలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఆదిత్య ఓం.. బిగ్‌బాస్ తెలుగు 8 షోలోకి అడుగుపెట్టారు. ఉత్తరాదికి చెందిన వారైనప్పటికీ.. తెలుగులో చాలానే సినిమాలు చేశారు. సినిమా నుంచి నేను దూరం కాలేదు. అలా గ్యాప్ వచ్చింది అంటూ కామెంట్ చేశారు.

6వ కంటెస్టెంట్‌గా సోనియా ఆకుల
బిగ్‌బాస్ తెలుగు 8 షోలోకి ఆకులు సోనియా అడుగుపెట్టింది. తెలుగులో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో యూట్యూబర్‌గా, ఇన్‌ఫ్లూయెన్సర్‌గా సుపరిచితులు. ఆమె 9 మంత్ థియరీ గురించి చెబుతూ.. నాకు నచ్చిన వ్యక్తికి లిట్మస్ టెస్ట్ పెడుతాను. ఆ తర్వాత అతడిని బాయ్ ఫ్రెండ్‌గా చేసుకొంటాను అని ఆమె అన్నారు.

7వ కంటెస్టెంట్‌గా
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్క. నా అసలు పేరు మధు నెక్కంటి. వీడియోలు చేస్తూ బెజవాడ బేబక్క అయ్యాను. నేను పాటలు పాడటం చూసి నాకు నా తల్లిదండ్రులు నాకు ట్రైనింగ్ ఇప్పించారు. పెళ్లి అయింది.. పెటాకులు అయిపోయింది. అమెరికాలో కొన్ని రోజులు ఉన్నారు. వీడియోల చేసి మంచి యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకొన్నారు.

8వ కంటెస్టెంట్‌గా ఆర్జే భాషా
బిగ్‌బాస్ తెలుగు 8 ఇంటిలోకి వివాదాస్పద ఆర్జే.. ఆర్జే భాషా అలియాస్ శేఖర్ భాషా అడుగు పెట్టాడు. చిన్నతనంలో ఆర్జేగా గుర్తింపు పొందారు. కాకినాడలో పుట్టి హైదరాబాద్‌తోపాటు చాలా నగరాల్లో తిరిగాను. 2005 సంవత్సరంలో ఆర్జేగా చేరాను. ఇండియాలో 18 సంవత్సరాలు అత్యధిక అవార్డులు గెలుచుకొన్నాను. నేను సామాజిక కార్తకర్తగా మారడానికి మగాడికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిఘటించాను అని ఆయన చెప్పారు. బెజవాడ బేబక్కతో కలిసి ఇంటిలోకి అడుగుపెట్టారు.

9వ కంటెస్టెంట్‌గా
పాపులర్ రియాలిటీ షోలోకి కిర్రాక్ సీత అడుగుపెట్టింది. బేబీ సినిమాలో వైష్ణవీ చైతన్యకు ఫ్రెండ్‌గా చేయడం వల్ల నన్ను అలాగే ట్రీట్ చేశాడు. ఆ సినిమా తర్వాత నన్ను, నా ఫ్యామిలీని దారుణంగా ట్రోల్ చేశారు. అసభ్యంగా బూతులు తిట్టారు. అయితే ఎవరైనా ఓ పాత్ర వేస్తే.. ముఖ్యంగా అమ్మాయిలు విషయంలో అలా అసభ్యంగా ప్రవర్తించకూడదు అని నాగార్జున చెప్పారు.

10 కంటెస్టెంట్‌గా
బిగ్‌బాస్ తెలుగు షోలోకి మణికంఠ ప్రవేశించాడు. తన జీవితంలో జరిగిన విషాదాలు వెలువడుతూ ఎమోషనల్‌గా ఆడియెన్స్ ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. జీవితంలో ఏదైనా అవకాశం వస్తే.. తన తల్లిని తిరిగి బతికించుకొంటాను. ఈ ఇంటిలోకి వెళ్లిన తర్వాత నేనేంటో ఆడియెన్స్‌కు తెలియజేయడానికి ఈ షోను ఉపయోగించుకొంటాను అని అన్నారు. కిర్రాక్ సీతతో కలిసి ఇంట్లోకి వెళ్లాడు.

11 కంటెస్టెంట్‌గా
బిగ్‌బాస్ ఇంటిలోకి పృథ్వీ ఎంట్రీ ఇచ్చాడు. స్టేజ్ మీద తెలుగు పాటలకు స్టెప్పులేసి ఆకట్టుకొన్నారు. నాగార్జునను కలిసి తర్వాత పాపులారిటీ సాధించాలని ఉంది. అంతేకాకుండా డబ్బు కోసం కూడా ఇంట్లోకి వచ్చాను అని అన్నారు.

12వ కంటెస్టెంట్‌గా విష్ణుప్రియ భీమినేని
బిగ్‌బాస్ తెలుగు 8 షోలోకి యాక్టర్, యాంకర్ విష్ణుప్రియ భీమినేని ఎంట్రీ ఇచ్చారు. విష్ణుప్రియ సినిమాలు, టెలివిజన్ షోల ద్వారా సుపరిచితులు. అయితే ఆమె అప్పటికే వచ్చిన పృథ్వీతో కలిసి ఇంట్లోకి వెళ్లారు. అయితే మాకు ఐక్యూ తక్కువ అనడంతో నాగార్జున నవ్వుల్లో మునిగిపోయారు.

13వ కంటెస్టెంట్‌గా నైనిక
నైనిక డ్యాన్సర్‌గా సోషల్ మీడియాలోను, సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొన్నది. ఢీ రియాలిటీ షో విన్నర్‌గా ఆమె మంచి పాపులారిటీ ఉంది. అయితే డ్యాన్సర్ కాకుండా ఉంటే నేను నటిగా కావాలనుకొన్నాను. కెమెరా ముందు మాత్రమే ఉండాలని అనుకొన్నాను. నా తల్లి కోరిక ప్రకారం.. నేను బాగా ఆడాలని కోరుకొంటున్నాను అని నైనిక అన్నారు.

14వ కంటెస్టెంట్‌గా నబీల్ అఫ్రిదీ
వరంగల్‌కు చెందిన య్యూట్యూబర్,సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గా నబీల్ అఫ్రిది సుపరిచితులు. హైదరాబాద్ డైరీస్ అనే సోషల్ మీడియా ట్యాగ్‌తో 1 మిలియన్ సబ్ స్క్రైబర్లను సొంతం చేసకొన్నాడు. తాజాగా ఇంటిలోకి 14వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు.


Click it and Unblock the Notifications











