Bigg Boss Telugu 8: బిగ్ బాస్ లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ అవుట్!

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎవరూ ఊహించని, దిమ్మతిరిగే ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నెల రోజుల పాటు కాస్త చప్పగా.. సాగిన షోలో .. వైల్డ్ కార్డు ​ఎంట్రీలు, డబుల్ ​ఎలిమినేషన్స్ చేసి షోపై ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచేశారు. గత సీజన్లో ఎప్పుడు చూడని కంటెంట్ ఇస్తుండటంతో భారీ రెస్పాన్స్‌ వస్తుంది. హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దూసుకపోతోంది. రసవత్తరంగా సాగుతోన్న ఈ షోలో ఆరో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది.

గతంలో ఎన్నాడు లేని విధంగా ఈ సీజన్ లో ఐదోవారం 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వారు ఓజీ క్లాన్ మెంబర్స్‌ను నామినేట్ చేయగా.. రాయల్ క్లాన్ లో ఇద్దరూ నామినేషన్‌ చేశారు. ఇలా ఆరోవారం నామినేషన్స్‌లో టోటల్‌గా ఆరుగురు నామినేట్ అయ్యారు. అలా నామినేషన్స్‌లో యష్మీ, పృథ్వీరాజ్, సీత, విష్ణుప్రియ, మెహబూబ్, గంగవ్వ నిలిచారు.

Bigg Boss Telugu Season 8 sixth week nominations According to the voting Kirrak Seetha will be eliminated in the sixth week

లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. ఈవారం ఓటింగ్ లో ఎవ్వరూ ఊహించని విధంగా గంగవ్వ మొదటి ప్లేస్ లో నిలిచింది. దాదాపు 32 % ఓటింగ్ తో టాప్ గేర్ లో దూసుకుపోతుంది. గంగవ్వ ఆటతీరు కూడా ఓ రేంజ్ లో ఉంది. యంగ్ కంటెస్టెంట్లతో పోటీపడుతూ. తన న్యాచురల్ ఆటతో బిగ్ బాస్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. గంగవ్వ కామెడీ టైమింగ్స్ కూడా అదుర్స్. షోలో గంగవ్వ వేసే పంచులకు పడిపడి నవ్వాల్సిందే. ఇలా టాప్ ప్లేస్ లో నిలిచి కంటెస్టెంట్లకు అందరికీ షాక్ ఇస్తుంది గంగవ్వ.

ఆ తర్వాత ప్లేస్ లో మెహబూబ్ నిలిచాడు. తన ఆటతో బిగ్ బాస్ లవర్ ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. దీంతో అతనికి దాదాపు 18% ఓట్లు పడ్డాయి. పైగా ఈ వారం మెగా చీప్ గా కూడా ఎంపికయ్యాడు. దీంతో మరింత రెస్పాస్బుల్ గా గేమ్ ఆడుతున్నారు.ఆ తర్వాత యష్మీ 16% ఓట్ల దక్కించుకుని థర్డ్ ప్లేస్ లో నిలిచింది. వాస్తవానికి ఈ వారం యశ్మీ నే వెళ్ళిపోతది. ఆమెనే ఎలిమినేట్ అవుతుందని కొన్ని యూట్యూబ్ చానల్స్, సైట్స్ ప్రచారం చేశాయి. కానీ వారి అంచనాలను మించి ఓటింగ్ సంపాదించుకుంది యశ్మీ. ఈ కంటెస్టెంట్ కూడా సేఫ్ ప్లేస్లో ఉందనే చెప్పాలి.

Bigg Boss Telugu Season 8 sixth week nominations According to the voting Kirrak Seetha will be eliminated in the sixth week

ఇక మిగిలింది ముగ్గురు కంటెస్టెంట్లు. వారే విష్ణు ప్రియ, పృథ్వి, కిరాక్ సీత. ఇందులో విష్ణుప్రియ ఈ ఇద్దరు కంటెస్టెంట్ల కంటే బెటర్ అనే చెప్పాలి.తన ఫన్నీ కన్వర్జేషన్, షాకింగ్ కామెంట్స్ తో కాస్త కంటెంట్ ను ఇస్తుంది. దీంతో ఈ అమ్మడు దాదాపు 14% ఓట్లు పొందింది.కాబట్టి యాంకర్ విష్ణు ప్రియకూడా ఆల్మోస్ట్ సేపే. .

ఇక మిగిలింది ఇద్దరు పృద్వి అండ్ సీత. వీరిద్దరి మధ్యనే ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. అయితే.. పృద్వికి 12 శాతం ఓట్లు రాగా .. కిరాక్ సీత కేవలం 8 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకొని లీస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఈ ఓటింగ్ ప్రకారం ఆరో వారం కిర్రాక్ సీత కచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ అందిన ఇన్పుట్స్ ప్రకారం కూడా ఆరో వారం ఎలిమినేట్ అయ్యేది సీత అనే ప్రచారం జోరుగా సాగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X