Bigg Boss 8 Telugu: బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్.. ఆ నలుగురు పక్కా కన్ఫార్మ్.. వారెవరంటే
Bigg Boss 8 Telugu: అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ పేరుతో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్ లతో కేవలం కంటెస్టెంట్లకే కాదు.. బీబీ ప్రేక్షకులకు కూడా దిమ్మతిరిగేలా చేస్తున్నారు బిగ్ బిగ్. ఇలా అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ తో గతంలో ఏ సీజన్ కు రాని హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోంది బిగ్ బాస్ సీజన్ 8. బిగ్బాస్ లవర్స్ ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్డేట్ వచ్చేసింది. ఇంతకీ ఎంతమంది హౌస్ లోకి వెళ్లబోతున్నారు. ఎవరి ఫ్లేస్ కన్ఫర్మ్ అయ్యిందనే ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీకోసం..
బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు ప్రేక్షకుల నుండి ఎనలేని ఆదరణ వస్తుంది. ఎన్నో రకాలైన ఎమోషన్స్ ఈ ఒక్క షోలోనే కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కంటెస్టెంట్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మరోవైపు గ్రూపులు.. ఓవైపు రొమాన్స్.. హక్కులు.. లవ్ స్టోరీలు.. ఇలా ఎన్నో రకాల సీన్స్ ఒక్క బిగ్ బాస్ షో లోనే కనిపించడంతో ఈ షోను ఎంతగానో ఆదరిస్తున్నారు.

బిగ్ బాస్ ప్రారంభంలో 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా మొదటివారం బెజవాడ బీభక్క రెండో వారం శేఖర్ భాష మూడోవారం అభయ్ నవీన్ ఇక తాజాగా నాలుగో వారం బిగ్ బాస్ ముద్దుబిడ్డ ఆకుల సోనియా ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం పది మంది మాత్రమే హౌస్ లో ఉన్నారు అందులో ఎమోషనల్ స్టార్ మణికంఠ ను జైల్లో సీక్రెట్ రూమ్ లో వేయడంతో తొమ్మిది 9 మందితో షో రన్ అవుతుంది.
అయితే గత వారం బిగ్ బాస్ లో భూకంపం అంటూ.. కంటెస్టెంట్ల మనుగడ ప్రశ్నార్ధకమంటూ రాబోయే రోజుల్లో 12 మంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని బిగ్ బాస్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, వారిని సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌ల్లో గెలిచి వారిని ఆపొచ్చని కూడా తెలిపాడు. ఈ క్రమంలో ఐదు టాస్కులు ఆడిన శక్తి, కాంతారా క్లాన్స్ మూడు గెలిచాయి. దాంతో మూడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ద్వారా రాకుండా అడ్డుకున్నట్టు.

నిన్నటి షోలో మరోసారి బిగ్బాస్ పోస్ట్ నాగార్జున కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఇచ్చారు. దీంతో వైల్డ్ కార్డు ద్వారా ఎంతమంది షూలోకి అడుగుపెడుతున్నారు. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు అనే క్యూరియాసిటీ బిగ్ బాస్ లవర్స్ లో పెరిగింది. సీజన్ 8 కాబట్టి 8 మంది వైల్డ్ కార్డ్ ద్వారా రావొచ్చనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొంత కంటెస్టెంట్లు కాకుండా బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్లన్లు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. వారిలో నలుగురికి మాత్రం నూటికి నూరు శాతం కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.

వారెవరంటే.. బిగ్ బాస్ సీజన్ 1 నుండి హరితేజ, బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ నయని పావని, జబర్దస్త్ అవినాష్, సీజన్ 5 కంటెస్టెంట్ యాంకర్ రవి లు బిగ్ బాస్ 8 తెలుగులోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతానికి ఈ నలుగురు కన్ఫర్మ్ అయినట్లు పక్కా సమాచారం అందింది. వీరందరూ అక్టోబర్ 5 నాడు ఏంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. వీరితోపాటు.. జబర్దస్త్ రోహిణీ, యాంకర్ శ్యామలకు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి వచ్చే అవకాశముందని టాక్. వీళ్లే కాకుండా.. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ నుంచి మిత్రా శర్మ కూడా వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉంది. మరీ బిగ్ బాస్ ఎలాంటి ప్రయోగం చేస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











