ఈసారి డబుల్ హౌస్.. డబుల్ డోస్.. సిలబస్ మార్చేశా.. ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు 9కి సమయం దగ్గర పడుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఉండే అవకాశం ఉంది. దీంతో బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే వరుస ప్రోమోలతో హైప్ తీసుకొస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగు 8ను మించేలా సీజన్ 9 ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా తాజాగా విడుదల చేసిన బిగ్‌బాస్ ప్రోమో కలకలం రేపుతోంది ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెన్నెల కిషోర్?
టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్- నాగార్జున మధ్య జరిగే సంభాషణల మధ్య ఈసారి బిగ్‌బాస్ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమోలోకి వెళితే.. కిశోర్ కారులో వెళ్లుండగా బిగ్‌బాస్ పోస్టర్ కనిపిస్తుంది. వెంటనే శ్రావణి గారు నా నెక్ట్స్ 100 డేస్ షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసేయండి. కొత్త ప్లాన్.. బిగ్‌బాస్ సీజన్ 9కి వెళ్లాలనుకుంటున్నానని చెప్పడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేస్తాడు. ప్లానింగ్ ఉంటే సరిపోదు సార్. ఆ 9 ప్లానెట్స్ బ్లెసింగ్స్ కూడా ఉండాలని అంటాడు డ్రైవర్. మరి ఆ గ్రహాల కామన్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అని కిశోర్ అడగ్గా.. కమెండింగ్ ఫ్రెండే ఒకరున్నారని నాగార్జున దగ్గరికి తీసుకెళ్తాడు డ్రైవర్.

ఈసారి బిగ్‌బాస్ వెరీ టఫ్
వెన్నెల కిషోర్ ఓ మాయా ప్రపంచంలోకి వెళ్లి వెతుకుతూ ఉండగా.. నాగార్జున ప్రత్యక్షమై పిలుస్తాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి వచ్చావా? అని ప్రశ్నిస్తాడు. టైపో.. వెళ్లడానికి కాదు.. ఏలడానికి వచ్చానని చెబుతాడు. దానికి నాగార్జున బిగ్గరగా నవ్వి అది నీ వల్ల కాదులే.. ఈసారి వెరీ టఫ్ అంటాడు. నేను చాలా రఫ్.. ఎంటర్‌టైన్‌మెంట్‌లో కింగ్‌ని, అమ్మాయిలకి మన్మథుడిని, అబ్బాయిలకి అసలు సిసలైన మాస్.. ఊరమాస్ అని ఎలివేషన్స్ ఇస్తాడు వెన్నెల కిషోర్.
పాత సిలబస్‌తో కొత్త ఎగ్జామ్ రాస్తామా
అసలు ఈ హౌస్ గురించి తెలుసుకున్నావా అని నాగార్జున అడగ్గా.. తెలుసుకోవడానికి ఇది డ్రీమ్ హౌస్ అని అంటాడు కిశోర్. ఈసారి డబుల్ హౌస్- డబుల్ డోస్ అని నాగ్ చెప్పడంతో కిశోర్ మైండ్ బ్లాక్ అవుతుంది. అంటే ఈసారి కామనర్స్.. సెలబ్రెటీలు కలిసే ఆడతారా? అని కిశోర్ అడుగుతాడు. ఆడతారో? ఆడుకుంటారో చూద్దామని నాగ్ చెబుతాడు. 8 సీజన్లు, అన్ని ఎపిసోడ్స్ చూసేశా అని కిశోర్ చెప్పడంతో.. ఎప్పుడైనా పాత సిలబస్‌తో కొత్త ఎగ్జామ్ రాస్తావా అని నాగ్ ప్రశ్నిస్తాడు.
ఇదంతా కాదు నేను డైరెక్ట్‌గా బిగ్‌బాస్‌తోనే మాట్లాడుకుంటానని కిషోర్ వెళ్లిపోతుండగా.. అందుకే ఈసారి బిగ్‌బాస్‌నే మార్చేశా, ఈ సీజన్‌లో అందరి సరదాలు తీరిపోతాయ్.. ఈసారి చదరంగం కాదు.. రణరంగమే అని నాగార్జున పవర్ ఫుల్ డైలాగ్ వదలడంతో ప్రోమో ముగుస్తుంది. చూస్తుంటే ఈసారి బిగ్‌బాస్‌లో కొత్త నిబంధనలు పెడతారేమోనని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. డబుల్ హౌస్ అంటే రెండు బిగ్‌బాస్ హౌస్‌లు ఉంటాయా? కామనర్స్‌తో సెపరేట్‌గా ఏమైనా ప్లాన్ చేశారా అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తోంది. మొత్తానికి తాజా ప్రోమోతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9పై అంచనాలను పెంచేశారు కింగ్ అక్కినేని నాగార్జున. బిగ్‌బాస్ 9 లాంచింగ్ డేట్.. కంటెస్టెంట్స్ వివరాలపై త్వరలోనే అప్‌డేట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











