Bigg Boss 9: రోజంతా తిండిలేక కంటెస్టెంట్స్ తిప్పలు.. అలమటించిన సంజనా గల్రానీ.. మాస్క్ మ్యాన్ దూకుడు
బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ పండుగ ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్ 7న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఎంతో గ్రాండ్ గా బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ను ప్రారంభించారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో సెలబ్రెటీ కంటెస్టెంట్స్ 9 మంది, కామనర్స్ గా 6గురు హౌజ్ లో ఉన్నారు. వీరందరికీ అక్కినేని నాగార్జున వారికి గ్రాండ్ గా వెల్కమ్ పలికారు.
ఇక సెలబ్రెటీ కంటెస్టెంట్స్ గా తనూజ గౌడ, ఆషా షైనీ, సంజనా గల్రానీ, రీతూ చౌదరి, రాము రాథోడ్, భరణి, శ్రేష్టి వర్మ, ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి ఉన్నారు. ఇక కామనర్స్ గా మాస్క్ మ్యాన్ హరీశ్, డిమోన్ పవన్, కళ్యాణ్ పడాల, ప్రియా శెట్టి, శ్రీజా దమ్ము, మర్యాద మనీశ్ లు హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో రెండు టీమ్ లను సెపరేట్ గా హౌజ్ లో సెట్ చేశారు. సెలబ్రెటీలను టెనెంట్ లుగా, కామనర్స్ ను ఓనర్స్ గా గుర్తించారు. సకల సౌకర్యాలు ఉన్న హౌజ్ ను కామనర్స్ కు, సాధారణమైన ఇంటిని సెలబ్రెటీలకు కేటాయించారు బిగ్ బాస్.

ఈ సందర్భంగా హౌజ్ మేట్స్ మధ్య మొదటి రోజు ఎలాంటి సన్నివేశాలు జరిగాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రతి రోజూ స్టార్ మాలో రాత్రి 9:30 గంటలకు రోజు వారి హౌజ్ మూమెంట్స్ ను ప్రేక్షకులను చూపించబోతున్నారు. కాగా తాజాగా మొదటి రోజు హౌజ్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దానిపై తాజాగా బిగ్ బాస్ టీమ్ ఒక ప్రోమోను విడుదల చేసింది. ఇందులో మొదటి రోజు కంటెస్టెంట్స్ అందరూ గందరగోళంగా హౌజ్ లో తిరుగుతూ కనిపించారు. ఇక వారికి బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
సెలబ్రెటీ కంటెస్టెంట్స్ టెనెంట్ లుగా హౌజ్ లో ఉంటున్నారని బిగ్ బాస్ మరోసారి గుర్తు చేశారు. అంత కంటే ముందు కంటెస్టెంట్స్ కిచెన్ లో బిర్యానీ తింటూ ఉంటారు. కొందరికి బిర్యానీ ఉంటుంది. మరికొందరికి తినడానికి ఏమీ లేదు. అయితే బిగ్ బాస్ అప్పుడే పంపించిన బిర్యానీని కంటెస్టెంట్స్ తినేందుకు సిద్దమవుతారు. ఇదే సమయంలో బిగ్ బాస్ వారందరినీ ప్లేట్స్ అక్కడే వదిలేసి లివింగ్ హాల్ లోకి రమ్మని చెబుతాడు. ఓనర్స్ పర్మిషన్ లేకుండా టెనెంట్స్ వాళ్ల గదుల్లోకి వెళ్లడానికి వీల్లేదని ఆదేశిస్తాడు.
ఇక ఆ తర్వాత సెలబ్రెటీల కంటెస్టెంట్స్ సంజనా గల్రానీ, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్ రోజంతా తిండి లేకుండా ఎలా ఉంటాం బిగ్ బాస్ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇలా తిండి లేకుండా ఉండటం దారుణమని అన్నారు. ఆ తర్వాత ఏమైందనేది చూడాలి. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రోమోలో ఇమ్మాన్యుయేల్, మాస్క్ మ్యాన్ హరీశ్ కు గొడవ జరిగింది. ఇమ్మాన్యుయేల్ హరీశ్ ను గుండు అంకుల్ అని అనడంతో హరీశ్ సీరియస్ అయ్యాడు. ఎవరు అంకుల్? ఎవరు గుండు? బాడీ షేమింగ్ కు వెళ్తే ఊరుకునేది లేదని మండిపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఫుల్ ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











