Bigg Boss Telugu 8th Week Voting: ఓటింగ్‌ తారుమారు.. దుమ్మురేపుతోన్న తనుజా.. డేంజర్‌జోన్‌లో ఎవరున్నారంటే?

Bigg Boss Telugu Season 9 Week 8 Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఈ సీజన్‌లో గతంలో ఎప్పుడూ చూడని ట్విస్టులు, టర్న్‌లు చోటుచేసుకుంటున్నాయి. ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచేస్తున్నాయి. ఎవరిని ఎప్పుడు ఎలిమినేట్ చేస్తారో? ఎవరు సేఫ్ అవుతారో? అనే ఆసక్తి ప్రతి వారం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ టీం మాజీ కంటెస్టెంట్లు అయిన భరణి శంకర్, శ్రీజ దమ్ములను రీఎంట్రీ పేరుతో హౌస్‌లోకి పంపించడం హౌస్ వాతావరణాన్నే మార్చేసింది. ఈ రీఎంట్రీలతో షో మరింత హీట్ పుట్టించి, కొత్త హంగామాకు నాంది పలికింది. ఈ నేపథ్యంలో రసవత్తరంగా సాగిన 8వ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఎవరు నామినేట్ అయ్యారు? ఎవరికి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? ఎవరు డేంజర్ జోన్ లో నిలిచారు? అనే విషయంలోకి వెళితే..

అయితే టాప్ కంటెస్టెంట్లు వరుసగా ఎలిమినేట్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కొంత తగ్గింది. ఈ పరిస్థితిని మార్చేందుకు బిగ్ బాస్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆడియన్స్ డిమాండ్ మేరకు మాజీ కంటెస్టెంట్లు భరణి శంకర్, శ్రీజ దమ్ములకు రీ-ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరి రావడం హౌస్ వాతావరణాన్నే మార్చేసింది. ముఖ్యంగా శ్రీజ ఎంట్రీతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం, మాటల తూటాలు, పాత విభేదాలు మళ్లీ ముందుకు వచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే రీఎంట్రీ డ్రామా హౌస్‌లో కొత్త హంగామా తెర తీసింది.

Bigg Boss Telugu Season 9 Week 8 Voting

ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 9లో మొత్తం 9 మంది కంటెస్టెంట్లు గేమ్ నుండి బయటకు వెళ్లారు. వీరిలో శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైనీ, భరణి శంకర్, రమ్య మోక్ష, ఆయేషా ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఆయేషా మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా గేమ్‌కి గుడ్‌బై చెప్పింది. అయితే, టాప్ కంటెస్టెంట్లు వరుసగా ఎలిమినేట్ కావడంతో షోలో ఆసక్తి కొంత తగ్గిందని భావించిన బిగ్ బాస్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు మాజీ కంటెస్టెంట్లు భరణి శంకర్, శ్రీజ దమ్ములకు రీఎంట్రీ ఇచ్చి హౌస్‌లో కొత్త జోష్ తీసుకువచ్చారు.ఈ రీఎంట్రీ ట్విస్ట్ సీజన్‌కి హైప్ క్రియేట్ చేసిందనే చెప్పాలి.

ఇక ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ చరిత్రలో ప్రత్యేకమైనది. సాధారణంగా హౌస్‌లో సభ్యులు ఒకరినొకరు నామినేట్‌ చేస్తారు. కానీ, ఈసారి మాత్రం బిగ్ బాస్ కొత్త ఫార్మాట్‌ పరిచయం చేశారు. మాజీ కంటెస్టెంట్లు తిరిగి హౌస్‌లోకి తీసుకవచ్చి, ప్రస్తుత కంటెస్టెంట్లను నామినేట్ చేశారు. దీంతో హౌస్‌లో షాకింగ్ వాతావరణం నెలకొంది. ప్రస్తుత కంటెస్టెంట్లు తమపై వచ్చిన కామెంట్లకు రియాక్ట్ అవుతూ, తమను రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఇది ప్రేక్షకులకు కూడా కొత్త అనుభవం అందించింది. రసవత్తరంగా జరిగిన నామినేషన్లలో దువ్వాడ మాధురి, రీతు చౌదరి, కళ్యాణ్ పడాల, సంజనా గల్రాని, తనుజ పుట్టస్వామి, డెమోన్ పవన్, గౌరవ్ గుప్తా, రాము రాథోడ్ ఇలా మొత్తం ఎనిమిది మంది ఎలిమినేషన్ రేస్‌లో నిలిచారు. గత వారం టాస్క్‌లు అన్నీ మళ్లీ చర్చకు రావడంతో హౌస్‌లో వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది.

ఓటింగ్ విషయానికొస్తే ఈ వారం కూడా సోషల్ మీడియాలో బిగ్ బాస్ తెలుగు 9 టాపిక్ ట్రెండింగ్ అవుతోంది. అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు మద్దతుగా నిలుస్తూ.. ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. అనధికారిక సర్వేలు, సోషల్ మీడియా పోల్స్ ప్రకారం తనుజ పుట్టస్వామి మరోసారి 33.23 శాతం ఓట్లు అందుకుని అగ్రస్థానంలో నిలిచారు. తనుజా మాట్లాడే తీరు, గేమ్‌లో చూపిస్తున్న తెలివైన స్ట్రాటజీ ఆమెకు బలమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించింది.

ఆ తరువాత స్థానంలో కళ్యాణ్ పడాల ఉన్నారు. ఇతడు 18.69 శాతం ఓట్లు సాధించారు. ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్‌ను చూస్తే తనుజా వర్సెస్ కళ్యాణ్ మధ్య పోటీ నడుస్తోంది. ఇక సంజనా గల్రానీ 10 శాతం ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఆమె ఫన్నీ టాస్క్‌లు ప్రేక్షకులను అలరించగా, కొందరు ఆమెను కంట్రోవర్సీ క్వీన్ అని పిలుస్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్లలో రాము రాథోడ్ 8.35%, గౌరవ్ గుప్తా 7.83%, డెమోన్ పవన్ 7.49%, మధురి దువ్వాడ 7.45%, రీతు చౌదరి 7.44% ఓట్లు సాధించారు. ఈ ఫలితాల ప్రకారం రాము, గౌరవ్, పవన్, మధురి, రీతు లు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రీతు, మాధురి మధ్య ఓటింగ్ పోటాపోటీగా సాగుతోంది. వీరిద్దరి మధ్య వివాదం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది.

గేమ్ షోనే కాదు.. ఓటింగ్ కూడా రోజురోజుకు మారుతోంది. ఓటింగ్ లో కూడా ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే.. మరో రెండు రోజులు ఓటింగ్ కు ఛాన్స్ ఉండటం ఫలితాలు మారే అవకాశం ఉంది. అభిమానులు చివరి రోజు వరకు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు గెలిపించుకునేందుకు చివరి క్షణం వరకు ఓటింగ్ పాల్గొంటారు. కాబట్టి.. ఫలితాల్లో చాలా మార్పులు జరగవచ్చు. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రీఎంట్రీలతో, కొత్త నామినేషన్ ఫార్మాట్‌తో మరింత ఉత్కంఠభరితంగా మారింది. రాబోయే ఎపిసోడ్లలో ఇంకా ఎన్ని ట్విస్టులు, ఎన్ని ఎలిమినేషన్లు ఎదురవుతాయో చూడాలి. ఈ సీజన్ నిజంగానే "గేమ్ ఆఫ్ మైండ్, గేమ్ ఆఫ్ స్ట్రాటజీ"గా నిలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X