Bigg Boss Telugu 9th Week Voting: బిగ్‌బాస్ ఓటింగ్‌లో తుక్కురేగ్గొట్టిన తనుజా.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది అతనే?
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9)లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి వారం కొత్త టాస్కులు, సీక్రెట్ మిషన్‌లు, ఊహించని ట్విస్టులతో షో మరింత రసవత్తరంగా మారుతోంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య వ్యూహాత్మక కదలికలు, భావోద్వేగాల పర్వాలు, ఫ్రెండ్‌షిప్స్ అండ్ ఫైట్స్ కలగలిసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో 9వ వారం నామినేట్ అయ్యిందేవరు? ఎవరికి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? ఎవరు డేంజర్‌జోన్‌లో నిలిచిందేవరు? ఈ వారం ఎలిమినేట్ అయ్యేదేవరు? అనే విషయంలోకి వెళితే..
నామినేషన్స్‌తో హౌస్‌లో హీట్
ఈ వారం బిగ్ బాస్ కొత్త నామినేషన్ ఫార్మాట్‌ను ప్రవేశపెట్టడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కిపోయింది. కంటెస్టెంట్స్ మధ్య సీక్రెట్ టాస్క్‌లు, మైండ్ గేమ్స్, ఎమోషనల్ కన్‌ఫ్యూజన్ అన్నీ ఎంటర్టైన్ చేశాయి. ప్రస్తుతం హౌస్‌లో రీతూ చౌదరి, భరణి, దివ్య నిఖిత, రాము రాథోడ్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి, పవన్ కళ్యాణ్ పడాల, పవన్ డీమోన్, నిఖిల్ నాయర్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, సాయి శ్రీనివాస్, గౌరవ్ గుప్తా ఉన్నారు. వీరంతా తమదైన వ్యూహాలతో గేమ్‌ను కొనసాగిస్తూ ప్రేక్షకుల మనసును గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

షాక్ ఇచ్చిన తనూజ పుట్టస్వామి
నామినేషన్స్ ప్రక్రియలో తనూజ పుట్టస్వామి చేసిన ఓ నిర్ణయం హౌస్ మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది. భరణిని నామినేట్ చేయడం హౌస్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చర్యతో ఆమెపై హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. కొందరు ఆమెను వ్యూహాత్మకంగా ఆడుతోందని ప్రశంసిస్తుండగా, మరికొందరు "ఎమోషనల్ బాండ్‌ని కూడా సాక్రిఫైస్ చేస్తుందా?" అని విమర్శిస్తున్నారు. మొత్తానికి 9 వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో పవన్ కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, భరణి, సుమన్ శెట్టి, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఉన్నారు. వీరిలో ఒక్కరు (లేదా ఇద్దరు) ఈ వారం హౌస్‌కు గుడ్‌బై చెప్పనున్నారు.
ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉందంటే?
సోషల్ మీడియాలో, ఆన్‌లైన్ పోర్టల్స్‌లో వెలువడిన తాజా ఓటింగ్ ట్రెండ్ ప్రకారం.. ఈ వారం కూడా తనూజ పుట్టస్వామి టాప్‌లో దూసుకెళ్లింది. మొత్తం 31.54 శాతం ఓట్లు సాధించి, గేమ్‌లో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆమె టాస్కుల్లో యాక్టివ్‌గా ఉండటం, హౌస్‌లో స్ట్రాంగ్ పర్సనాలిటీ చూపించడం, ఎమోషనల్ కన్‌నెక్ట్ కలగలవడంతో ప్రేక్షకులు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ పడాల ఉన్నారు. ఆయనకు 19.93 శాతం ఓట్లు వచ్చాయి. గత వారం వరకు టాప్‌లో ఉన్న పవన్ ఈ వారం కొద్దిగా వెనుకబడ్డారు. కానీ ఆయన లీడర్‌షిప్ నైపుణ్యం, టాస్క్‌లో స్ట్రాటజిక్ గేమ్‌ప్లే ఆయనను ఇంకా సేఫ్ జోన్‌లో ఉంచాయి. మూడో స్థానంలో సీనియర్ కంటెస్టెంట్ సుమన్ శెట్టి నిలిచారు. ఇతడు 15.53 శాతం ఓట్లతో మంచి సపోర్ట్ పొందారు. ఆయన బిగ్ బాస్ ఇచ్చిన రెబల్ సీక్రెట్ టాస్క్‌ను అద్భుతంగా పూర్తి చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన గేమ్ ప్రెజెన్స్ హౌస్‌లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
డేంజర్ జోన్ లో ఉన్నవారు ఎవరు?
నాలుగో స్థానంలో భరణి ఉన్నారు. రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన గేమ్ మొత్తం మార్చేశాడు. ఎవరితోనూ పెద్దగా బంధాలు లేకుండా 'నో బాండింగ్' అటిట్యూడ్‌తో ముందుకు సాగుతున్న ఆయనకు 10.1 శాతం ఓట్లు వచ్చాయి. తర్వాత సంజన గల్రానీ ఉన్నారు. ఆమె సైలెంట్‌గా గేమ్ ఆడుతున్నప్పటికీ 9.12% ఓట్లు సాధించి తన స్థానం కాపాడుకుంది. ఆమె తర్వాత రాము రాథోడ్ ఉన్నారు. ఈ మధ్య రామ్ చాలా సైలెంట్‌గా మారిపోవడం, హౌస్‌లో ఎవరితోనూ ఎక్కువగా ఇన్‌టరాక్ట్ కాకపోవడం ఆయన ఓటింగ్ మీద ప్రభావం చూపింది. ప్రస్తుతం ఆయనకు 8.91% ఓట్లు మాత్రమే లభించాయి. తక్కువ ఓట్లు పొందిన కంటెస్టెంట్ సాయి శ్రీనివాస్. కేవలం 4.88% ఓట్లతో ఆయన డేంజర్ జోన్‌లో ఉన్నారు.
సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతారా?
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ వారం ఎలిమినేషన్‌కి అత్యధిక అవకాశమున్న కంటెస్టెంట్ సాయి శ్రీనివాస్. మొదటిసారి నామినేషన్‌లోకి వచ్చిన ఆయనకు బయట పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడం, పీఆర్ టీమ్ సపోర్ట్ లేకపోవడం, సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరగకపోవడం వంటి అంశాలు ఆయన ఓటింగ్ ఫలితంపై ప్రభావం చూపాయి. అయితే ఆయన గేమ్‌లో ఎటువంటి నెగిటివిటీ లేదని చెప్పాలి. ఫెయిర్‌గా, క్లీన్‌గా ఆడటం ఆయన ప్రత్యేకత. కానీ సేఫ్ గేమ్ ఆడకపోవడం, ఇతర కంటెస్టెంట్స్‌లా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వకపోవడం ఆయనకు వెనుకబాటుగా మారింది.
అయితే.. ఓటింగ్ లైన్స్ ఇంకా ఒక రోజు సమయం మాత్రమే ఉంది. కాబట్టి, ఈలోపు ఏదైనా అద్భుతం జరిగితేనే సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చు. లేకపోతే ఆయన ఈ వారం హౌస్‌ను విడిచిపెట్టే అవకాశం ఎక్కువ. మరోవైపు బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తే.. రాము రాథోడ్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం మీద, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తొమ్మిదవ వారం హీట్ పీక్‌కి చేరుకుంది. ఎవరు బయటకు వెళ్తారు? ఎవరు టాప్‌లో నిలుస్తారు? అన్న ఉత్కంఠలో ప్రేక్షకులు ఉన్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఆదివారం వరకు వేచిచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











