బిగ్ బాస్ తెలుగు: ఎంపికైన సెలబ్రిటీలు వీరే...
ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ఆదివారం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే 12 మంది పేర్లు బయటకు లీక్ అయ్యాయి.
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో బిగ్గెస్ట్ రియాల్టీషో 'బిగ్ బాస్' ఆదివారం(జులై 16) రాత్రి 9 గంటలకు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 14 మంది పోటీ దారులతో ఈ షో రన్ కాబోతోంది.
సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు, శని-ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం అవుతుంది. 12 మందిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపి లాక్ చేస్తారు. 70 రోజుల పాటు వారు అందులో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాల్సి ఉంటుంది. వారి కదలికలను 60 కెమెరాలతో పర్యవేక్షిస్తుంటారు.

సింగర్ మధు ప్రియ
ప్రేమ వివాహం, ఫ్యామిలీ వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన సింగర్ మధుప్రియ బిగ్ బాస్ షోకు ఎంపికైంది. బిగ్ బాస్ షోకు కావాల్సింది వివాదాస్పద వ్యక్తులే కాబట్టి ఈ విడను ఎంపిక చేశారు.

కమెడియన్ ధనరాజ్
తెలుగు కమెడియన్ ధనరాజ్ కూడా బిగ్ బాస్ రియాల్టీ షోకు ఎంపికయ్యాడు. ఇతడి ద్వారా బిగ్ బాస్ హౌస్ లో కామెడి పండుతుందనే ఉద్దేశ్యంతో ఇతడిని ఎంపిక చేసినట్లు సమాచారం.

సమీర్
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సమీర్ ను కూడా ఈ షోకు ఎంపిక చేశారు.

నటి అర్చన
హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి ప్రస్తుతం అడపా దడపా అవకాశాలతో నెట్టుకొస్తున్న నటి అర్చన కూడా ఈ షోకు ఎంపికైంది.

సింగర్ కల్పన
తెలుగు సింగర్ కల్పన కూడా బిగ్ బాస్ షోకు ఎంపికయ్యారు. సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కల్పన ఈ షో ద్వారా ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తుందని భావిస్తున్నారు.

కత్తి కార్తీక
వి6 యాంకర్ కత్తి కార్తీక కూడా బిగ్ బాస్ షోకు ఎంపికైంది. వి6 ఛానల్ లో తన యాంకరింగ్ తో ఆకట్టుకున్న కత్తి కార్తీక.... బిగ్ బాస్ ద్వారా మరింత వినోదం పంచుతుందని అంచనా వేస్తున్నారు.

ఆదర్శ్ బాలకృష్ణ
తెలుగు నటుడు ఆదర్శ్ బాలకృష్ణ కూడా బిగ్ బాస్ షోకు ఎంపికయ్యాడు. ఆదర్శ్ యాటిట్యూడ్ బిగ్ బాస్ ఎంటర్టెన్మెంటుకు బాగా పనికొస్తుందనే ఉద్దేశ్యంతో అతడిని ఎంపిక చేసినట్లు సమాచారం.

హీరో సంపూర్ణేష్ బాబు
తెలుగులో అతి తక్కువ కాలంలోనే బర్నింగ్ స్టార్ గా ఎదిగిన కామెడీ హీరో సంపూర్ణేష్ బాబును ‘బిగ్ బాస్' షో కోసం ఎంపిక చేసినట్లు సమాచారం.

జ్యోతి
అడపాదడపా అవకాశాలతో వెండితెరపై హాట్‌హాట్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న జ్యోతి బిగ్‌బాస్‌లోకి రావడం ద్వారా మళ్లీ నటిగా పాపులర్ అయ్యే అవకాశం ఉంది.

శివ బాలాజీ
నటుడు శివ బాలాజీ బిగ్ బాస్ షోకు ఎంపికైనట్లు సమాచారం. ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక పోవడంతో శివ బాలాజీ దీనికి ఓకే చెప్పినట్లు సమాచారం.

ముమైత్ ఖాన్
ఒకప్పుడు ఐటం గర్ల్ గా రాణించి సెక్స్ బాంబ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ముమైత్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ కు ఎంపికైనట్లు సమాచారం. అదే నిజమైతే ఆమె తన అందంతో అందరినీ మెస్మరైజ్ చేసే అవకాశం ఉంది.

మహేష్ కత్తి
తెలుగులో వివాదాస్పద మూవీ క్రిటిక్ గా పేరు తెచ్చుకున్న మహేష్ కత్తి కూడా ఈ షోకు ఎంపికయ్యారు.


Click it and Unblock the Notifications











