బిగ్ బాస్ ఈ సారి ఒకటి కాదు రెండు.. ఇండియాలోనే తొలిసారి తెలుగులోనే ఇలా!

తెలుగు బుల్లితెరపై పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ.. సంచలనమైన కంటెంట్‌తో ప్రకంపనలు రేపిన షోనే బిగ్ బాస్. ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభం అయిన ఇది.. ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకుల స్పందనను కూడగట్టుకుంది. ఫలితంగా దేశంలోనే ఏ షోకూ రానంత రేటింగ్‌ను అందుకుని సత్తా చాటింది. ఫలితంగా నిర్వహకులు ఏమాత్రం గ్యాప్ లేకుండా సీజన్లను నడుపుతున్నారు. ఇలా త్వరలోనే ఎనిమిదో దాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్ నుంచి ఓ సంచలనమైన సమాచారం లీకైంది. అదేంటో మీరే చూసేయండి మరి!

దేశంలో నెంబర్ వన్‌గా
బిగ్ బాస్ షో అనేది గతంలో అసలు పరిచయం లేని కాన్సెప్టుతో వచ్చింది. అయితేనేం తెలుగు ప్రేక్షకులు దీనికి ఫిదా అయిపోయారు. ఫలితంగా ఈ కార్యక్రమం భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా వరుసగా సీజన్లతో అలరిస్తోంది. మరీ ముఖ్యంగా మన దగ్గర ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో అత్యధిక రేటింగ్ సాధించి దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది.

Bigg Boss Telugu Team Building Two House Sets For 8th Season

8వ సీజన్‌ వచ్చేస్తుంది

బిగ్ బాస్ తెలుగు టీమ్ ఇప్పటికే ఏడు రెగ్యూలర్ సీజన్లతో పాటు ఒక ఓటీటీ వెర్షన్‌ను ప్రసారం చేసింది. ఇవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను ప్రారంభించబోతుంది. దీన్ని గతంలో కంటే ముందుగానే తీసుకు రావాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే అఫీషియల్ లోగోను సైతం విడుదల చేసేసింది.

ఈసారి అంతులేదుగా
వాస్తవానికి బిగ్ బాస్ అన్నీ సీజన్లు సరికొత్త ట్యాగ్‌లైన్‌తో వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే కొత్త కాన్సెప్టులను నిర్వహకులు పరిచయం చేస్తున్నారు. ఇక, ఎనిమిదో సీజన్ అంతులేని వినోదాన్ని అందించేలా కలర్‌ఫుల్‌గా రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు ప్రారంభం అయ్యాయి. దీంతో ఈ సీజన్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి.

Bigg Boss Telugu Team Building Two House Sets For 8th Season

ఆ కంటెస్టెంట్లు ఫిక్స్

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌ను ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇలా ఇప్పటికే కుషిత కల్లాపు, సుప్రిత, శీతల్ గౌతమ్, సీనియర్ నటి సన, మోడల్ ఊర్మిళ చౌహాన్, యూట్యూబర్ యువ సామ్రాట్ పేర్లు లీక్ అయ్యాయి.

రెండు హౌస్‌ సెట్లలో
ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి సెట్ వర్క్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఇప్పటికే ప్రారంభం అయినట్లు న్యూస్ వచ్చేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సారి కంటెస్టెంట్ల కోసం ఏకంగా రెండు హౌస్‌లను నిర్వహకులు నిర్మిస్తున్నారట. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

Bigg Boss Telugu Team Building Two House Sets For 8th Season

రెండు టీమ్‌లు చేసి

తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో రెండు ఇళ్లు ఉంటాయట. షోలోకి వచ్చే కంటెస్టెంట్లను ఆ రెండు ఇళ్లలో ఉంచుతారని అంటున్నారు. ఇలా వాళ్ల మధ్య పోటీని పెట్టి షోను రంజుగా మార్చబోతున్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో ఇండియాలోని ఏ భాషలో కూడా ఈ తరహా ప్రయోగం చేయలేదని బుల్లితెర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X