twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గాయత్రి గుప్తా, శ్వేతా రెడ్డి ఆరోపణలపై తొలిసారి స్పందించిన ‘బిగ్ బాస్’ టీమ్

    |

    'హౌస్‌లోకి వస్తే వంద రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా..? నీ సెక్స్ జీవితాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటావు..?' అని 'బిగ్ బాస్' నిర్వహకులు తనను అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని ప్రముఖ నటి గాయత్రి గుప్తా షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

    ఈమెకు తోడు శ్వేతా రెడ్డి అనే టీవీ యాంకర్ కూడా ఈ షో నిర్వహకులపై సంచలన ఆరోపణలు చేశారు. 'మిమ్మల్ని షోకు సెలెక్ట్ చేశాము.. మరి మీరు మా బాస్‌ను ఎలా ఇంప్రెస్ చేస్తారు' అని అడిగారని ఆమె బాంబు పేల్చారు. దీంతో ఈ షో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది. వీళ్లిద్దరూ పోలీసులకు సైతం కంప్లైంట్ చేయడంతో ఈ వ్యవహారం సీరియస్ అయిపోయింది.

    Bigg Boss Telugu team gave clarity about Allegations

    వీళ్లకు ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డితో పాటు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు మద్దతుగా నిలవడంతో 'బిగ్ బాస్' షోను నిషేదించాలని డిమాండ్ ఎక్కువ వినిపించింది. వీరంతా కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ను, అక్కినేని నాగార్జున ఇంటిని ముట్టడించడం వంటివి చేశారు.

    ఇక్కడే కాదు.. శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా, కేతిరెడ్డిలు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఈ వ్యవహారం భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఒకపక్క ఇది జరుగుతుండగానే, 'బిగ్ బాస్' సీజన్ - 3 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఉండి 15 మందిని హౌస్‌ లోపలికి పంపించాడు.

    తాజాగా ఈ షో నిర్వహకులు ఈ వ్యవహారంపై స్పందించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా 'బిగ్ బాస్' టీమ్‌లో ఎవరెవరు ఏఏ బాధ్యతలు నిర్వర్తిస్తారు..? అనేవి పోలీసులకు వెల్లడించారు. అంతేకాదు, తాము ఇంటర్వ్యూలు చేసే సమయంలో మానసిక, ఆరోగ్య నిపుణులు ఉంటారని తెలిపారు. తమ వద్దకు వచ్చిన ఏ ఒక్కరితోనూ చెడుగా ప్రవర్తించలేదని క్లారిటీ ఇచ్చారు. అయినా, పోలీసులు మరికొన్ని వివరాలు కావాలని అడిగారు. దీంతో ఈ వ్యవహారానికి ముగింపు రాలేదు.

    English summary
    Telugu Sensationsl Anchor Swetha Reddy Sensational Allegation On Bigg Boss Telugu. Star Maa Offers Her For Bigg Boss Telugu season 3. But She Is Not Selected. now Show team clarity about this
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X