జేమ్స్ బాండ్ రేంజిలో అదరగొట్టిన ఎన్టీఆర్... (టీజర్ కేక)

ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న బిగ్ బాస్ తెలుగు టీజర్ రిలీజైంది. ఇందులో ఎన్టీఆర్ జేమ్స్ బాండ్ ను తలపించేలా ఉన్నాడని అంటున్నారు ఫ్యాన్స్.

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో 'బిగ్ బాస్' అనే రియాల్టీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. స్టార్ మాటీవీలో ఈ షో త్వరలో ప్రసారం కాబోతోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన టీజర్ రిలీజైంది.

జేమ్స్ బాండ్ సినిమా టీజర్ గుర్తొచ్చేలా అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్‌తో ఈ టీజర్ డిజైన్ చేశారు. దీన్ని చూస్తుంటే జేమ్స్ బాండ్ గొర్తొస్తున్నాడని, ఎన్టీఆర్ అలాంటి పాత్రలకు బాగా సూటవుతాడని అనిపిస్తోందని అంటున్నారు అభిమానులు.

బిగ్ బాస్ తెలుగు టీజర్

బిగ్ బాస్ షో గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘టెలివిజన్‌ ఇపుడు అతి పెద్ద ఎంటర్టెన్మెంటుగా మారింది. తెలుగు టెలివిజన్‌లో అతిపెద్ద షోగా వస్తున్న ‘బిగ్‌ బాస్‌' కోసం నన్ను సంప్రదించినప్పుడు ఈ సవాలు నాకు ఆసక్తిగా అనిపించింది. ఈ షో ఓ గేమ్‌ ఛేంజర్‌లా మారుతుందన్న నమ్మకం నాకు కలిగింది' అన్నారు.

12 మంది పోటీ దారులు

12 మంది పోటీ దారులు

ఈ రియాల్టీ షోలో మొత్తం 12 మంది పోటీ దారులు ఉంటారు. వీరందరినీ ప్రత్యేకంగా నిర్మించిన ఓ ఇంట్లోకి పంపించి తాళం వేస్తారు. వారి కదలికలను సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటారు. హిందీ బిగ్ బాస్ లో సామాన్యులు, సెలబ్రిటీలు కలిసి పాల్గొనే వారు. తెలుగులో ఇదే మొదటి సీజన్ కాబట్టి ప్రస్తుతానికి సామాన్యులకు అవకాశం లేదు. కేవలం సెలబ్రిటీలతోనే తొలి సీజన్ నిర్వహించబోతున్నారు.

ఎలాంటి సంబంధాలు ఉండవు

ఎలాంటి సంబంధాలు ఉండవు

బిగ్ బాస్ హౌస్ లో భిన్నమైన వాతావరణం ఉంటుంది. అందులో వాళ్లు బ్రతకడానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఉంటాయి. కానీ సెల్‌ఫోన్ లు, టీవీలు, దినపత్రికలు వంటివి కూడా వారికి అందుబాటులో ఉండవు. బయటి ప్రపంచంతో అసలు ఎలాంటి సంబంధాలు ఉండవు.

భావోద్వేగాలు

భావోద్వేగాలు

ఒక భిన్నమైన పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్ లో గడుపుతున్న వారి.... భావోద్వేగాలు ఎలా ఉంటాయో గమనించడమే ప్రేక్షకులకు ఎంటర్టెన్మెంట్. విభిన్న రంగాలకు చెందిన, భిన్నమైన అభిరుచులు కలిగిన పలువురు సెలబ్రిటీలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకే చోట ఎలా ఉంటారన్నదే ఈ షోలో ఆసక్తికరం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X