బిగ్‌బాస్ విజేతకు గడ్డుకాలం.. కోట్ల మంది ఆదరించినా.. ముఖం చాటేసిన ఇండస్ట్రీ.. కౌశల్ హాట్ కామెంట్స్

తెలుగు టెలివిజన్ రంగంలో పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) కు ప్రత్యేకమైన ప్రేక్షకులు ఉండటం విశేషం. ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్లను ఈ షో విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. దీంతో 9వ సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అసలు బిగ్ బాస్ టైటిల్ గెలిచిన విజేతలు ఇప్పుడేం చేస్తున్నారు. వారి పరిస్థితి ఏంటనేది టెలివిజన్ రంగంలో హాట్ టాపిక్ గ్గా మారింది. మరోవైపు తాజాగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌషల్ కామెంట్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ విజేతలు.. రన్నరప్ లు
2017లో బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ ప్రారంభం అయ్యింది. గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత 2వ సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి అక్కినేని నాగార్జున హోస్ట్ గా నిర్విరామంగా షో కొనసాగుతూనే వస్తోంది. ఇక మొదటి సీజన్ నుంచి 8వ సీజన్ వరకు టైటిల్ విన్నర్, రన్నరప్ ల వివరాలు ఇలా ఉన్నాయి. 1వ సీజన్ లో శివ బాలాజీ - ఆదర్శ్ బాలకృష్ణ, 2వ సీజన్ లో కౌశల్ మందా - గీతా మాధురి, 3వ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ - శ్రీముఖి, 4వ సీజన్ లో అభిజీత్ - అఖిల్ సార్థక్, 5వ సీజన్ లో వీజే సన్నీ - షణ్ముఖ్ జస్వంత్, 6వ సీజన్ లో ఎల్వీ రేవంత్ - శ్రీహాన్ షేక్, 7వ సీజన్ లో పల్లవి ప్రశాంత్ - అమర్ దీప్ చౌదరి, 8వ సీజన్ లో నిఖిల్ మాలియక్కల్ - గౌతమ్ కృష్ణ విజేతలుగా నిలిచారు.

Bigg Boss Telugu Title Winners Struggling

కెరీయర్ నిలబెట్టుకోలేక తంటాలు..
ప్రధానంగా బిగ్ బాస్ తెలుగు టైటిల్స్ విజేతలుగా గెలిచిన వారికి టెలివిజన్ రంగంతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ క్రేజ్ పెరుగుతుంది. దాంతో సినిమా ఆఫర్లు వచ్చి వారి కెరీయర్ మరో స్థాయికి వెళ్తుంది. కానీ బిగ్ బాస్ తెలుగు టైటిల్స్ గెలుచుకున్న వారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శివ బాలాజీ, కౌశల్ మందా, రాహుల్ సిప్లింజ్, అభిజీత్, వీజే సన్నీ, ఎల్వీ రేవంత్, పల్లవి ప్రశాంత్, నిఖిల్ మాలియక్కల్ లో ఎవరూ సినిమాల్లో సాలిడ్ ఆఫర్స్ ను దక్కించుకోలేక పోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

టైటిల్ విన్నర్ లో ఒక్కరే వెలిగారు..
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగించింది. ఈ షోకు టీఆర్పీ రేటింగ్స్ కూడా అదిరిపోయాయి. చివరి మూడు సీజన్లు దుమ్ములేపాయి. ఈ రిపోర్టుల ప్రకారం ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని తేలుతోంది. కానీ బిగ్ బాస్ విజేతల్లో ఇప్పటి వరకు ఒక్కరు కూడా వెండితెరపై హీరోగా, స్టార్ గా షైన్ కాలేకపోయారు. బిగ్ బాస్ మొత్తం సీజన్లలో ఒక్క రాహుల్ సిప్లిగంజ్ మాత్రం కెరీరియర్ ను టాప్ లో లీడ్ చేస్తున్నారని, ఈ షోకు రాకముందు కూడా రాహుల్ టాలెంట్ ప్రేక్షకులకు తెలిసిపోయిందని, ఆ తర్వాత కూడా తన టాలెంట్ తోనే ముందుకెళ్తున్నారని నిపుణులు అంటున్నారు.

బిగ్ బాస్ కౌశల్ షాకింగ్ కామెంట్స్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజేతగా కౌశల్ మందా నిలిచారు. ఆ సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించడం విశేషం. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన తర్వాత కౌశల్ దశ మారిపోతుందని అంతా భావించారు. ఇక కౌశల్ కూడా అదే అనుకున్నారంట. కానీ సీన్ రివర్స్ అయ్యిందని తాజాగా కౌశల్ కామెంట్స్ చెబుతున్నాయి. లేటెస్ట్ గా బిగ్ బాస్ కౌషల్ మంచు విష్ణు కన్నప్ప సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడారు. బిగ్ బాస్ విన్నర్ గా టైటిల్ అందుకున్న తర్వాత చాలా సినిమా ఆఫీస్ లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లను కలిశానని చెప్పారు. ఎలాగైనా మంచి సినిమాలు వచ్చి కెరీయర్ టర్న్ అవుతుందని భావించానని తెలిపారు. కానీ ఎక్కడా అవకాశం లభించలేదని చెప్పుకొచ్చారు. కానీ మంచు విష్ణు మాత్రం తన ప్రాజెక్ట్ లో అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానున్న సమయంలో ఆయన మాటలు హాట్ టాపిక్ గ్గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X