Bigg Boss Unseen: నన్నే తప్పుపడుతావా, నీతో రిలేషన్ వేస్ట్.. మోనాల్‌కు అఖిల్ షాక్
బిగ్‌బాస్ ఇంటిలో ఐదోవారం నామినేషన్ ప్రక్రియ తర్వాత ఇంటి సభ్యుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకొన్నాయి. ముఖ్యంగా మోనాల్, అభిజిత్, అఖిల్ సార్థక్ మధ్య రిలేషన్స్ మరీ దారుణంగా మారాయి. మోనాల్ విషయంలో అఖిల్, అభిజిత్ గొడవ పడటం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత మోనాల్, అఖిల్ ఎడమొగం, పెడమొగం పెట్టుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో మోనాల్‌తో అఖిల్ మాట్లాడుతూ..

అఖిల్ నేను నీకు నచ్చడం లేదా
ఇంటిలో నీకు నచ్చడం లేదా అని అఖిల్‌ను మోనాల్ అడిగింది. అయితే ఏ విషయంలో, ఎందుకు నేను నచ్చాలి అంటూ అఖిల్ ఎదురు ప్రశ్న వేశారు. దాంతో నాకు ఇంటిలో బాగా నచ్చే వ్యక్తి అంటే అఖిల్. మిగితా ఎవరూ నాకు అంతగా సపోర్ట్ చేయరు. అలా నిన్ను ఇష్టపడితే తూ కౌన్ హై అంటావా? అని మోనాల్ అంటే.. అవునా.. నీకు నేనంటే ఇష్టమా? అంటూ ఆశ్చర్యంగా అఖిల్ ముఖం పెట్టారు. బిగ్‌బాస్ ఇంటిలో నాకు ఎవరూ నచ్చలేదు. నాకు సపోర్ట్ ఇవ్వురు అనే ఫీలింగ్ నాకు కలిగింది అంటూ అఖిల్ క్లారిటీ ఇచ్చారు.

నాకు ఇంటిలో ఎవరూ సపోర్ట్ చేయరు
బిగ్‌బాస్ ఇంటిలో నాకు ఎవరూ లేరు. నాకు సపోర్ట్‌గా, స్టాండ్ ఇచ్చేవాళ్లు నాకు కనిపించలేదు. గంగవ్వ తప్ప.. మరోకరు నన్ను ఇష్టపడరు. ఏదో సోహైల్ నాతో బ్రదర్‌లాగా వ్యవహరిస్తాడు. కాబట్టి వాడితో నేను మాట్లాడుతుంటాను. మెహబూబ్ నాకు ఫ్రెండ్ కాబట్టి వాడితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను అని అఖిల్ చెప్పారు.

ఇంట్లో రిలేషన్స్ వేస్ట్
బిగ్‌బాస్ ఇంటిలో రిలేషన్‌షిప్ బక్వాస్ (వేస్ట్). నువ్వే నన్ను ఇలా చేశావు అలా చేశావు అంటూ నిలదీస్తున్నావు. అలాంటప్పుడు ఎవ్వరితో కూడా రిలేషన్స్ పెట్టుకోవద్దని అనుకొంటున్నాను. అలాంటి ప్రశ్నలకు బెస్ట్ అన్సర్ మౌనంగా ఉండటమే. మీతో ఎలాంటి విషయం మాట్లాడదలచుకోవడం లేదు అని మోనాల్‌తో అఖిల్ అన్నాడు.

నీకు బాధ లేకపోతే నేను తోడుంటాగా..
ఎదైనా జరిగితే బాధపడుతావు. ఏడుస్తావు. నీకు ఒంట్లో బాగా లేకపోతే నీ కోసం నేను ఉంటాను. నిన్ను ఎప్పుడూ ఒక మాట అనలేదు. ఒక్క మాట తప్పుగా అనలేదు. ఏం చెప్పాలో అది చెప్పాను. నీవు ఎందుకు ఏడుస్తున్నావని అడగలేదని అఖిల్ అనడంతో మోనాల్ కంటతడి పెట్టింది. దాంతో కంటతడి తుడిస్తే.. నీవు ఎవరు నా కంటతడి తుడుస్తావని అడిగితే.. తూ కౌన్ హై అని అనలేదు కదా అని జవాబిచ్చాడు
Recommended Video

మోనాల్ నీ వద్ద ఏదీ దాచడం లేదు
అఖిల్ ప్రశ్నలకు స్పందిస్తూ.. నువ్వే కదా నాకు ఎవరూ లేరు. సోహైల్, మెహబూబ్ తప్ప మరోకరు లేరని నువ్వే చెప్పావు కదా అంటే మోనాల్ అంటే.. నాకు అలాంటి ఫీలింగ్ వస్తున్నది. నేను అనుభవిస్తున్న పరిస్థితులని బట్టి నేను అలా మాట్లాడాల్సి వస్తున్నది. ఏదైనా చెప్పకపోతే చెప్పడం లేదు అంటావు. అలా అని నేను నీ వద్ద ఏదీ దాచడం లేదు అని అఖిల్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











