twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Unseen బర్రెలా తిన్నావు.. మళ్లీ అలాంటి పని చేస్తావా? అరియానాపై సోహైల్ ఆగ్రహం

    |

    బిగ్‌బాస్ ఇంటిలో కొనసాగిన పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్క్ సందర్భంగా అరియానా బియ్యం దొంగతనం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. బియ్యం దొంగతనం చేయడం చూసిన తన కూతురు అరియానాను గ్రామ పెద్ద ఘాటుగా మందలించారు. ఊరి ప్రజలు సొంతంగా కష్టపడి బియ్యం సంపాదించుకొంటున్నారు. నీవు దొంగతనం చేస్తావా? అంటూ గట్టిగా క్లాస్ పీకాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాడి వేడి చర్చ ఎలా జరిగిందంటే..

    అందరికి ఓ న్యాయం.. నాకు మరోలా...

    అందరికి ఓ న్యాయం.. నాకు మరోలా...

    గ్రామ పెద్దగా అందరికి ఓ న్యాయం.. నాకు ఓ న్యాయం చెబుతాడు మానాన్న. ఊర్లో వారికి భయపడి వాళ్లకు అనుకూలంగా న్యాయం చెబుతాడు. నా మీదే ప్రతాపం చూపిస్తుంటాడు. నాపైనే అరుస్తుంటాడు అని అరియానా తన తండ్రికి ఎదురు జవాబు చెప్పింది. దాంతో గ్రామ పెద్దగా సోహైల్ తన కూతురుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    నాకు భయమా? అంటూ సోహైల్

    నాకు భయమా? అంటూ సోహైల్

    గ్రామ పెద్దగా న్యాయం చేయడమే నాకు తెలుసు. భయమనేది నాకు తెలియదు. భయమనే మాట ఎత్తితే పరిణామాలు సీరియస్‌గా ఉంటాయి. నోర్మూయ్ అంటూ సోహైల్ అరిచాడు. భయం గియం అంటే నా వద్దకు రండి.. సంగతి చూస్తా అంటూ సోహైల్ రెచ్చిపోయారు. అయితే సోహైల్‌పై కోపంతో.. ఆస్తులు సంపాదించాడు. డబ్బులు కూడ బెట్టారు. తిండి పెట్టమంటే నాపై ఆయనకు కోపం అంటూ అరియానా దెప్పిపొడిచింది.

    రంగంలోకి దిగిన లాస్య

    రంగంలోకి దిగిన లాస్య

    దాంతో లాస్య రంగంలోకి దిగింది. తండ్రిని అలాంటి మాటలు అనొద్దు. నీకు తిండి పెట్టనిదే ఇంత దానివి అయ్యావా? అంటూ లాస్య ప్రశ్నించింది. నీవు ఇలా దర్జాగా బతుకుతున్నావంటే మీ నాన్న వల్లే. మా అమ్మవాళ్లు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అంటూ లాస్య అంటే.. మీ ఆయనను ప్రతీ విషయంలో వెనుక వేసుకురాకు అని అరియానా సీరియస్ అయింది. అయితే మా ఆయన పక్కన ఉంటే వెనుక ఎలా వేసుకొంటాను అని అరియానాకు లాస్య పంచ్ విసిరింది.

    మీరు ఊరంతటికి నాన్న

    మీరు ఊరంతటికి నాన్న

    సోహైల్‌ను ఉద్దేశించి ఆయన ఊరంతటికి నాన్న. నాకు నాన్న కాదు అంటూ అరియానా దీర్ఘాలు తీసింది. ఆయన ఊరంతటికి నాన్న కాదు.. గ్రామపెద్ద. నీకు మాత్రమే నాన్న అంటూ లాస్య సమాధానమిచ్చింది. పక్కనే ఉన్న అమ్మా రాజశేఖర్ స్పందిస్తూ.. నాన్నను అలా అంటారా? అంటూ కామెంట్ చేశాడు. నన్ను కన్నారు.. కానీ పెంచడానికి వడ్లు ఇవ్వరా.. నేనే సంపాదించుకోవాలా అని అరియానా కౌంటర్ ఇచ్చింది.

    రాత్రి రొట్టెలు బర్రెలా తిన్నావు కదా...

    రాత్రి రొట్టెలు బర్రెలా తిన్నావు కదా...

    ఇంట్లో నాకు తిండి పెట్డడం లేదు. నీళ్లు పోయడం లేదు అంటూ అరియానా అరుస్తుంటే.. నిన్న రాత్రి రొట్టెలు బర్రెలా తిన్నావు కాదా అని సోహైల్ సీరియస్ అయ్యాడు. నేను ఊరి కోసం ఎంతో త్యాగం చేశాను. చివరకు కట్టెలు దొంగతనం చేయాల్సి వచ్చింది అంటూ సోహైల్ ఆవేదన చెందాడు. వెంటనే అరియానా మాట్లాడుతూ.. తండ్రి దొంగ అయితే కూతురు దొంగతనం చేయదా అంటూ సోహల్‌కు మరో కౌంటర్ ఇచ్చింది.

    English summary
    Bigg Boss Telugu 4s 60th day update: As Palleku Podam Chalo Chalo task, There has been a serious discussion between the Sohel Syed and Ariana related to food in the house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X