Bigg Boss Unseen నా అవసరం లేదా? నన్నే వద్దని అనుకొంటావా? అఖిల్‌కు సొహెల్ ఝలక్
బిగ్‌బాస్ రియాలిటీ షోలో 73వ రోజున అఖిల్ సార్థక్ బర్త్‌డే కావడంతో ఇంటి సభ్యులు హ్యాపీగా ఫీలయ్యారు. అందరూ అఖిల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందంగా గడిపారు. అయితే అఖిల్‌పై సోహైల్ అలుగుతూ.. నిరసన తెలియజేశారు. అఖిల్ వ్యవహరించిన తీరు తనకు నచ్చలేదంటూ ఫిర్యాదు చేశారు. అఖిల్ తన బర్త్‌డే రోజున ఏం చేశారంటే..

అర్ధరాత్రి బర్త్ డే సెలబ్రేషన్స్
బిగ్‌బాస్ ఇంటిలో 72వ అర్ధరాత్రి అఖిల్ బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. అఖిల్ కోసం యాంకర్ లాస్య కేక్ తయారు చేశారు. అప్పటికే డైనింగ్ టేబుల్ వద్ద అభిజిత్ ఏదో తింటూ ఉండటం కనిపించింది. ఆ సమయంలోనే అఖిల్ కేక్ బాగుంది అంటూ కట్ చేశాడు. ఆ తర్వాత మోనాల్‌కు కేక్ తినిపించాడు. కేక్ కటింగ్ సమయంలో ఎవరిని పిలువకుండా నలుగురే ఉండటం గమనార్హం.

ఏకాంతంగా మోనాల్‌తో అఖిల్
తన బర్త్‌డే రోజున కేక్ కటింగ్ చేసి లాన్‌లో మోనాల్‌తో అఖిల్ ఏకాంతంగా కొద్ది నిమిషాలు గడిపారు. ఆ తర్వాత నిద్ర వస్తుందని లేచిపోవడానికి తయారై.. మోనాల్‌ను కౌగిలించుకోమని కోరాడు. అఖిల్‌ను కౌగిలించుకొని ముద్దుల వర్షం కురిపించింది. అయితే హుషారుగా లేచిన అఖిల్‌కు ఉదయమే సోహైల్ షాక్ ఇచ్చారు.

అఖిల్‌పై సోహెల్ నిరసన
అయితే ఉదయాన్ని అఖిల్‌కు అందరూ బర్త్ డే విషెస్ చెప్పినా సోహెల్ మాత్రం చెప్పకుండా నిరసన తెలిపారు. దాంతో నాకు సరిగా విషెస్ చెప్పు రా అంటూ అఖిల్ వెంటపడ్డాడు. అయితే నీకు నేను బర్త్ డే విషెస్ చెప్పను. నన్ను లేపకుండా కేక్ ఎలా కట్ చేస్తావు. సార్ మనల్ని లేపకుండా అర్ధరాత్రి కేక్ కట్ చేసి బర్త్ డే జరుపుకొన్నారు అంటూ సొహెల్ గట్టిగా అరిచారు.
Recommended Video

నాకు చెప్పకుండా కేక్ కటింగా?
అంతలోనే అవినాష్ జోక్యం చేసుకొంటూ.. అందర్ని ఎందుకు లేపలేదు అని అంటే.. సార్‌కు ఎవరు అవసరం లేదు. నన్నే వద్దు వద్దని అనుకొన్నారు. మనం పడుకొన్నామని లేపలేదు. కానీ నేను మోనాల్‌కు చెప్పాను లేపమని.. అయితే పడుకొన్నారని వద్దని అఖిల్ అన్నాడట. నన్నే లేపలేదు. నాకు చెప్పకుండా కేక్ కట్ చేసుకొన్నాడు అంటూ సొహెల్ కంప్లయింట్ చేశారు. ఆ తర్వాత విషెస్ చెప్పి అఖిల్ కౌగిలించుకొని సంకలోకి ఎక్కడం జరిగింది.


Click it and Unblock the Notifications











