బిగ్ బాస్ సీజన్ 3: బయటపడిన ఓటింగ్ రహస్యం.. ఆ కంటిస్టెంట్‌కే జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు
తెలుగులోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది 'బిగ్ బాస్' షో. ఉత్తరాది నుంచి వచ్చిన ఈ షోపై తెలుగు వారు మక్కువ చూపిస్తున్నారు. అందుకే ఈ షో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్‌లో అడుగుపెట్టింది. దీనికి కారణం 'బిగ్ బాస్' ఫార్మాటే అన్నది అందరికీ తెలిసిందే. దీనికితోడు ప్రేక్షకులు తమకు నచ్చిన వారికి ఓట్లు వేసే వెసలుబాటు కూడా ఉండడం ఈ షోకు మరింత ప్లస్ అయింది. ఎవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయన్నది రహస్యమే అయినప్పటికీ.. దానికి సంబంధించిన ఓ వార్త తాజాగా బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఈ వారం ఐదుగురు
ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఒక్కొక్కరూ ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పిన బిగ్ బాస్.. తమకు ఇష్టం లేని ఇద్దరి కంటెస్టెంట్స్ పేరు చెప్పి వాళ్లకు నామినేషన్ స్టాంప్ గుద్దాలని సూచించాడు. ఈ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు వచ్చి తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్‌లు ఈవారం ఎలిమినేషన్‌లో లిస్ట్‌లో నిలిచారు.

ఓటింగ్‌లో సెన్సేషన్
అయొతే ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లలో బాబా భాస్కర్‌కు భారీ స్థాయిలో ఓట్లు పడుతున్నాయని ఓ వార్త బయటకు వచ్చింది. అంతేకాదు, షో చరిత్రలోనే ఈ రేంజ్‌లో ఎవరికీ ఓట్లు పడలేదని అంటున్నారు. ఐదుగురిలో ఆయన ఒక్కడికే దాదాపు ఎనభై శాతం ఓట్లు నమోదయ్యాయని సమాచారం. ఓటింగ్ విషయాన్ని బిగ్ బాస్ నిర్వహకులు రహస్యంగా ఉంచినప్పటికీ ఇది లీక్ కావడం విశేషం.

అందరితో మంచిగా ఉండడమే
గతంలో ఎవరికీ దక్కనన్ని ఓట్లు రావడం వెనుక బాబా భాస్కర్ చేసిందేమీ లేదు. కేవలం ఆయన మిగిలిన హౌస్‌మేట్స్‌తో మంచిగా ఉండడం వల్లే ఓట్లు ఎక్కువగా పడ్డాయని అంటున్నారు. వాస్తవానికి ఆయన ఎలిమినేషన్ జోన్‌లోకి వస్తారని కూడా ఎవరూ ఊహించలేదు. కానీ, కొందరు టార్గెట్ చేసి ఓట్లు వేశారన్న టాక్ కూడా వినిపించడం ఆయనకు ప్లస్ అయింది.

తమిళ కంటెస్టెంట్
తెలుగు ‘బిగ్ బాస్' షోలో తమిళనాడుకు చెందిన సెలెబ్రిటీని తీసుకున్నారు. అది ఎవరో కాదు.. ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్. ఈటీవీలో ప్రసారమైన డీ డాన్స్ షోతో బాగా ఫేమస్ అయ్యారు. చిరంజీవి మొదలుకొని రామ్ చరణ్ వరకు అందరికీ కొరియోగ్రఫీ అందించారు. నందమూరి హీరోలకు సైతం ఈయన అందించిన కొరియోగ్రఫీ బాగా కలిసొచ్చింది. ఈ మధ్యనే దర్శకుడి అవతరమెత్తి తమిళ్ సినిమాకు దర్శకత్వం వహించాడు.

తెలుగు వాళ్లు లేరా?
తెలుగు షోలో తమిళ సెలెబ్రిటీని తీసుకోవడం పట్ల ‘బిగ్ బాస్' నిర్వహకులపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో ఎంతో మంది సెలెబ్రిటీలు ఉండగా.. తమిళనాడుకు చెందిన వ్యక్తిని తీసుకోవడం ఏంటని పలువురు ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ కూడా చేశారు. కానీ, హౌస్‌లో అతడి తీరును చూసి అంతా తమ అభిప్రాయాలను మార్చుకున్నారు.


Click it and Unblock the Notifications











