Bigg Boss Telugu 14 Week Voting: మిడ్ వీక్ ఎలిమినేషన్? ఆ టాప్ కంటెస్టెంట్‌ బ్యాగ్ సర్దేసిందేనా?

Bigg Boss Telugu 14 Week Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్‌ దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ సీజన్ కు ఎండ్ కార్డ్ పడుతుంది. ఇప్పటికే రసవత్తంగా సాగుతోన్న ఈ షోను మరింత రసవత్తంగా మార్చాడానికి బిగ్ బాస్ సరికొత్త ప్లాన్ వేశారు. ఈ వారం ఎవరూ ఊహించిన విధంగా నామినేషన్స్ రద్దు చేసి, ప్రత్యక్ష యుద్ధం టాస్క్ తీసుకొచ్చాడు. ఈ టాస్క్‌లో ఎవరైతే టాప్ స్కోర్ సాధిస్తారో వారు టాప్ 5లో సేఫ్ అవుతారు. మిగతా కంటెస్టెంట్లు ఎలిమినేషన్ లో ఉంటారని బిగ్ బాస్ ప్రకటించడంతో హౌస్‌లో హై టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో మిక్ వీక్ ఎలిమినేషన్ అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇక 14వ వారం ఓటింగ్ ఎలా సాగుతోంది? మిక్ వీక్ ఎలిమినేషన్ కు ఎవరు బలికాబోతున్నారు? అనే వివరాల్లోకెళ్తే..

బిగ్ బాస్ షోలో రోజురోజుకు ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక 14 వారం నామినేషన్స్ రద్దు చేసి, ప్రత్యక్షయుద్ధం టాస్క్ తీసుకొచ్చాడు.ఈ టాస్క్ లో భాగంగా పవన్ కళ్యాణ్‌ను తప్పిస్తే.. మిగతా ఆరు మంది కంటెస్టెంట్లు నామినేషన్‌ల్లో ఉండడం, అందులోనూ డబుల్ ఎలిమినేషన్ జరగబోతుందన్న సమాచారం అభిమానుల్లో ఉత్కంఠను పెంచింది. ప్రధానంగా నేడు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో హౌస్‌లో హై టెన్షన్ మొదలైంది. దీంతో కంటెస్టెంట్స్ కే కాదు.. బీబీ అభిమానులకు కూడా కంటి మీద కునుగు లేకుండా పోయింది. ఈ పరిస్థితి చూస్తే.. బీబీ హౌస్ లో మూడవ యుద్ధం కొనసాగుతుందా? అన్నట్లుగా ఉంది.

Bigg Boss Telugu Voting Week 14 Midweek Elimination Shock Top Contestant in Danger Zone

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 14 వారం సోషల్ మీడియా ఓటింగ్ ట్రెండ్ చర్చనీయంగా మారాయి. అన్ ఆఫిషియల్ ఓటింగ్స్ ప్రకారం.. తనుజా పుట్టస్వామి ఈ వారం కూడా టాప్ లో కొనసాగుతోంది. దాదాపు 29.66 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక తరువాత రెండో స్తానంలో డిమోన్ పవన్ ఉన్నారు. దాదాపు 15.64 శాతం ఓట్లు కైవసం చేసుకున్నారు. ఇక టాస్కుల్లో అంతగా ప్రభావితం చూపించకపోయిన సంజన ఓటింగ్ లో మాత్రం తన సత్తా చాటుతుంది. దాదాపు 15.63 శాతం ఓటింగ్ తో మూడో స్థానంలో నిలిచారు.

ఇక భరణీ శంకర్ నిన్నటితో పోలిస్తే ఓటింగ్ లో వెనుకబడ్డారు. 14.72 శాతం ఓటింగ్ తో నాలుగో స్థానంలో నిలిచారు. ఇక ఇమ్మాన్యుయేల్ ఓటింగ్ దారుణంగా పడిపోయింది. ప్రతి ఓటింగ్ లో టాప్ 3లో నిలిచే ఇమ్మూ.. కేవలం 14.31 శాతం ఓటింగ్ ను అందుకున్నారు. దీంతో డేంజర్ జోన్ లో నిలిచారు. ఇక 10.04 శాతం ఓటింగ్ తో సుమన్ శెట్టి బాటమ్ లో నిలిచారు. ఓటింగ్ ప్రకారం చూస్తే.. సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో నిలిచినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇమ్మ్యూనిటీ టాస్కులు కూడా గేమ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయి. నిన్నటి టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్ టాప్ స్కోర్లతో ముందుకు వచ్చారు. ఇక ఇమ్మాన్యుయేల్‌కు ఆడియన్స్ ఓటు అప్పీల్ చేసే అవకాశం దక్కింది. అలాగే.. తనూజ, భరణీ పర్ఫార్మెన్స్ హైలైట్ గా మారింది. బిగ్ బాస్ నిర్వహించిన బాల్స్ టాస్క్‌లో తనూజ టాప్ 1, భరణీ టాప్ 2గా నిలవగా, తర్వాత జరిగిన పజిల్ టాస్క్‌లో భరణీ టాప్ 1గా, తనూజ టాప్ 2గా నిలిచారు. ఈ వారంలో తనుజాకు అత్యధిక ఓట్లు రావడంతో ఆమెకు ఓటు అప్పీల్ చేసే అవకాశం లభించినట్టు తెలుస్తోంది.

అత్యంత ఆసక్తికర అంశం ఏమిటంటే.. బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేపట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. గురువారం నాటికి ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్లవచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, అది ఓటింగ్ ఆధారంగా జరుగుతుందా? లేక ఇమ్మ్యూనిటీ టాస్క్‌ల ప్రదర్శన ఆధారంగా జరుగుతుందా? అన్నది ఇంకా స్పష్టత లేదు. ఇమ్మ్యూనిటీ టాస్క్‌లలో సంజనా అవుట్ అయినట్టు సమాచారం రావడంతో, టాస్క్ ఆధారంగా ఎలిమినేషన్ జరిగితే సంజన బయటకు వెళ్లే అవకాశం ఎక్కువ. మరోవైపు, ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా నిర్ణయం తీసుకుంటే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X