యష్మీతో కలిసి ఉండాలని.. ఆమెకు వేరొకరితో పెళ్లి జరిగితే.. బిగ్‌‌బాస్ నిఖిల్ ఎమోషనల్

బిగ్‌బాస్ తెలుగు 8లో టఫ్ ఫైట్ మధ్య టైటిల్ విజేతగా నిలిచారు నిఖిల్ మలియక్కల్. కర్ణాటకకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తన మైండ్‌గేమ్, నిర్ణయాలు, ఫిజికల్ గేమ్స్‌లోనూ దూకుడుగా ఆడి తెలుగు ప్రేక్షకులను అలరించారు. బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభమైన నాటి నుంచే ఖచ్చితంగా ఈసారి నిఖిల్ విన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు. చివరికి అదే జరిగింది. అయితే గత సీజన్‌లో నిఖిల్ - యష్మీ గౌడల మధ్య ప్రేమాయణం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యష్మీతో రిలేషన్‌పై నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

కలిసిరాని కన్నడ సీమ
నిఖిల్ తొలుత పలు కన్నడ సినిమాల్లో నటించారు. శాండల్‌వుడ్‌లో సరైన గుర్తింపు రాకపోవడంతో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. తెలుగు బుల్లితెరపై అవకాశాలు రావడంతో తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. కోయిలమ్మ, గోరింటాకు, స్రవంతి తదితర చిత్రాల్లో నిఖిల్ నటనకు మంచి మార్కులు వచ్చాయి. ఈ ఫేమ్‌తో అనూహ్యంగా బిగ్‌బాస్ తెలుగు 8లో అతనికి అవకాశం వచ్చింది. కన్నడ బ్యాచ్‌తో కలిసి నిఖిల్ మ్యానిప్యులేట్ చేశాడని, అలాగే కొందరి ఎమోషన్స్‌తో ఆడుకున్నాడని నిఖిల్‌పై విమర్శలు వచ్చాయి. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా గ్రాండ్ ఫినాలేకు చేరుకుని విజేతగా నిలిచాడు.

Bigg Boss Telugu Winner Nikhil Maliyakkal about relationship with Yashmi Gowda

కావ్యశ్రీతో ప్రేమాయణం
నిఖిల్‌కు గుర్తింపు తీసుకొచ్చిన సీరియల్ రంగంలోనే అతని జీవితంలోకి ఓ అమ్మాయి ప్రవేశించింది. గోరింటాకు సినిమాలో తనతో నాటించిన కన్నడ నటి కావ్యశ్రీతో నిఖిల్ ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ ఫోటోలు, వీడియోలతో హల్‌చల్ చేసేవారు. నేడో రేపో పెళ్లి చేసుకుంటారనగా తాము విడిపోయామని బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే నిఖిల్ బాంబు పేల్చాడు. తమ గురించి ఎలాంటి వార్తలు రాయొద్దని ఆమెతో లింక్ పెట్టొద్దని నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. అయితే యష్మీ గౌడతో నిఖిల్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై తాజాగా నిఖిల్ స్పందించారు.

మంచివాడిని కాదన్న నిఖిల్
ఓ ఛానెల్‌లో జబర్దస్త్ ఫేమ్ వర్ష నిర్వహిస్తున్న కిస్సిక్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నిఖిల్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను కొన్ని విషయాల్లో అర్జున్ రెడ్డి టైప్ అని.. అస్సలు మంచివాడిని కాదని నిఖిల్ తెలిపారు. ఏదైనా రూమ్‌లో స్టక్ అయిపోతే నువ్వు వర్ష ఉండాలి అనుకుంటావా? యష్మీ ఉండాలి అనుకుంటావా అని అడగ్గా.. నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటానని తేల్చిచెప్పాడు. నేను, యష్మీ మంచి మిత్రులమని.. కొంతమంది మేం కలిసుండాలని ఆశిస్తూ ఫ్యాన్ పేజీ పెట్టారని కానీ ఆమె రేపు వేరెవరినో పెళ్లి చేసుకుంటే యష్మీకి ప్రాబ్లం అవుతుందన్న అర్ధంలో నిఖిల్ ఆన్సర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బయటివాడు, మనదానిలోకి ఎందుకొచ్చాడని మాటలు పడ్డానని తెలిపారు.

Take a Poll

అమ్మ టీతోనే ఆకలి తీర్చుకునేది
తనకు చాలా ఆస్తులు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారని.. కానీ కోటి రూపాయలు దొరికితే అప్పులు తీర్చుకుంటానని ఆన్సర్ ఇచ్చాడు నిఖిల్. బిగ్‌బాస్‌లో వచ్చిన డబ్బును ఏం చేశావని వర్ష అడగ్గా.. దానితో ఊరంతా కొనేయలేం కదా అని చెప్పాడు. నాకు, తమ్ముడికి అవసరాలు తీర్చి టీ, బన్నుతో అమ్మ ఆకలి తీర్చుకునేవారని తన మధ్యతరగతి కకష్టాలను పంచుకున్నారు. మరి నిఖిల్ యష్మీ మధ్య నిజంగానే ఎఫైర్ నడిచిందా? తన ప్రియురాలు కావ్యశ్రీతో ఎందుకు గ్యాప్ వచ్చింది? ఆమెనే ఒప్పించి పెళ్లి చేసుకుంటారా? తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లు ఏంటీ? వీటిపై నిఖిల్ ఏం చెప్పారో తెలియాలంటే ఈ శనివారం వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X