బిగ్ బాస్ 3లో సిగపట్లు మొదలు... చిచ్చు పెట్టింది ఎవరు? శ్రీముఖి కారణమా?
Recommended Video
తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ 3' నాగార్జున హోస్ట్‌గా ఆదివారం గ్రాండ్‌గా మొదలైంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటరయ్యారు. 64 కెమెరాల నిఘాలో 100 రోజుల పాటు వీరు ఇంట్లో గడపాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు విజయవంతంగా పూర్తి చేస్తూ ప్రేక్షకుల మద్దతుతో ఎవరు చివరి వరకు కొనసాగుతారో వారే విజేతలుగా నిలుస్తారు.
సోమవారం నుంచి అసలు సిసలైన బిగ్ బాస్ గేమ్ మొదలైంది. తొలివారాంతంలో జరిగే ఎలిమినేషన్ ప్రక్రియ కోసం సింగర్ రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు, శ్రీముఖి, బాబా భాస్కర్, జాఫర్‌లను నామినేట్ చేస్తూ బిగ్ బాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆరుగురిలో ఒకరు వచ్చే ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నారు.

కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హేమ
తొలివారం ఇంటి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే బంపర్ అవకాశం నటి హేమకు దక్కింది. కెప్టెన్ కావడం వల్ల ఆమె తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి సేఫ్‌గా బయట పడ్డారు. తన బాధ్యతలు నిర్వర్తించడంలో భాగంగా ఇంట్లో వివిధ పనులను సభ్యులందరికీ సమానంగా కేటాయించారు.

సిగపట్లు మొదలయ్యాయి
ఆడవారు ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు ఖాయం. బిగ్ బాస్ ఇంట్లో కూడా అదే జరుగుతోంది. ఇంటి కెప్టెన్ హేమతో... హిమజ గొడవ పడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో మంగళవారం విడుదల చేశారు. ఇది వీక్షకుల్లో షోపై మరింత ఆసక్తి పెంచింది.

గొడవకు కారణం శ్రీముఖి?
ఇంటి కెప్టెన్ హేమతో హిమజ గొడవ పడటానికి కారణం శ్రీముఖి అని ప్రోమోలోని కొన్ని సీన్లు స్పష్టం చేస్తున్నాయి. నేను ఏదైనా తప్పు చేస్తే జనాలు నన్ను తిడతారు అంటూ హేమ వాదించగా... మీరు నిందలు యాక్సెప్ట్ చేస్తారేమో? నేను నిందలు యాక్సెప్ట్ చేయను అంటూ హిమజ గొడవకు దిగింది. అసలు ఈ గొడవ వెనక కారణం ఏమిటి? అనేది మంగళవారం రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్లో క్లారిటీ రానుంది.

బిగ్ బాస్ 3
ఈషోలో కంటెస్టెంట్లుగా వి6 సావిత్రి(శివజ్యోతి), రవికృష్ణ, అషురెడ్డి, జాఫర్, హిమజ, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, హేమ, అలీరెజా, మహేష్ విట్టా, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షేరు ఎంటరయ్యారు.


Click it and Unblock the Notifications











