బిగ్‌బాస్ ఉచ్చులో వరుణ్ సందేశ్ దంపతులు, బిగ్గెస్ట్ మిస్టేక్.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు!

Recommended Video

Bigg Boss Telugu 3: Upset Fans Wish Varun Sandesh-Vithika's Marriage Won't End In Divorce| Filmibeat

నాగార్జున హోస్ట్‌గా తెలుగులో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టీషో గత రెండు సీజన్లకంటే మరింత రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సారి అందరూ సెలబ్రిటీలే కావడంతో పాటు వరుణ్ సందేశ్ తన భార్య వితికతో కలిసి హౌస్‌లోకి అడుగు పెట్టడం ఆసక్తికరంగా మారింది.

అయితే రియల్ లైప్ కపుల్ ఈ షోలో అడుగు పెట్టడంపై కొందరు ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ షో కారణంగా వరుణ్ సందేశ్-వితిక కాపురంలో ఎలాంటి విబేధాలు రావొద్దని, విడాకులు లాంటి వాటికి దారి తీయకుండా విజయవంతంగా వీరు ఈ షో నుంచి బయటకు రావాలని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

బిగ్ బాస్ హౌస్‌లో ఏమైనా జరుగవచ్చు

బిగ్ బాస్ హౌస్‌లో ఏమైనా జరుగవచ్చు

బిగ్ బాస్‌లో ఏమైనా జరుగవచ్చు... ప్రేమికులు విడిపోవచ్చు, విడిపోయిన వారు ప్రేమలో పడొచ్చు. గతంలో వివిధ భాషల్లో జరిగిన బిగ్ బాస్ షోలో ఇలాంటివి చాలా చోటు చేసుకున్నాయి. కొందరు బిగ్ బాస్ షోలో ప్రేమలో పడి హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న వారూ ఉన్నారు. అయితే ఇండియన్ బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా భార్య భర్తలుగా అడుగు పెట్టింది మాత్రం వరుణ్ సందేశ్, రితిక మాత్రమే.

విడాకుల వరకు తెచ్చుకోవద్దు

వరుణ్ సందేశ్, వితికా బిగ్ బాస్ సీజన్ 3లోకి ఎంటరయ్యారు. నేను వీరి విషయంలో కోరుకునేది ఒకటే... ఈ షో తర్వాత వారి మ్యారేజ్ విడాకులకు దారి తీయకుంటే చాలు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో వారికి తెలుసో లేదో? ఇక్కడ ఎదురయ్యే పరిస్థితులు వారు ఎలా ఎదుర్కొంటారో చూడాలి...అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్లో వ్యాఖ్యానిస్తున్నారు.

వాళ్ల మధ్య గొడవ పెట్టకండి

వరుణ్ సందేశ్, వితికా బిగ్ బాస్ ఇంట్లో గొడవ పడరని ఆశిస్తున్నాను. వాళ్ల మధ్య గొడవ పెట్టకండి బిగ్ బాస్ అంటూ కొందరు ఫ్యాన్స్ తమ మనసులోని మాటను బయట పెట్టారు. సోషల్ మీడియాలో ఈ సినీ జంట ఎంట్రీ వ్యవహారం చర్చనీయాంశం అయింది.

ఇద్దరూ రావడం బిగ్గెస్ట్ మిస్టేక్, అయ్యో పాపం అంటున్న నెటిజన్లు

వరుణ్ సందేశ్, వితికా షేరు ఇద్దరూ ఒకే సీజన్లో రావడం బిగ్గెస్ట్ మిస్టేక్ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అమాయకమైన కపుల్ బిగ్ బాస్ ఉచ్చులో పడ్డారని, వీరి మధ్య గొడవ పెట్టి టీఆర్పీలు పెంచే ప్రయత్నం చేస్తారని, పాపం వీరు బలయ్యారు అంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నాురు.

బిగ్‌ బాస్ కంటెస్టెంట్లు వీరే

బిగ్‌ బాస్ కంటెస్టెంట్లు వీరే

ఈషోలో కంటెస్టెంట్లుగా వి6 సావిత్రి(శివజ్యోతి), రవికృష్ణ, అషురెడ్డి, జాఫర్, హిమజ, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, హేమ, అలీరెజా, మహేష్ విట్టా, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షేరు ఎంటరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X