విమర్శకుల నోళ్లు మూయించిన సమంత.. పర్ఫెక్ట్ హోస్ట్ అనడానికి ఈ ఆధారం చాలదా?
అక్కినేని సమంత ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్తధనం ఉంటుంది. పెళ్ళైన తరువాత ఆమె మరింత కొత్తగా ఆలోచిస్తోంది. కెరీర్ విషయంలో తొందరపడకుండా సినిమాలను ఒకే చేయడం లేదు. వీలైనంత వరకు తనకు నచ్చిన సినిమాలే చేస్తోంది. ఇక ఇటీవల మామయ్య కోసం బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలను తీసుకొని అందరిని ఆకట్టుకున్న సమంత రేటింగ్ తో అదరగొట్టేసింది.

ఎవరు ఊహించలేదు..
నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ వలన బిగ్ బాస్ కి ఒక వారం గ్యాప్ ఇవ్వడంతో సమంత రంగంలోకి దిగి షోకి ఒక మంచి హైప్ క్రియేట్ చేసింది. దసరా సందర్భంగా ఆమె హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది మొదలుకొని బై బై చెప్పేవరకు ఓ వర్గం ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. నిజానికి సమంత ఆ రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తుందని ఎవరు ఊహించలేదు.

విమర్శకుల నోళ్లు మూయించేలా..
మొదట షోకి చా తక్కువ రేటింగ్ వచ్చిందని తప్పుడు ప్రచారాలు చేశారు. పైగా ఆ రోజు అఖిల్ కూడా స్పెషల్ గెస్ట్ గా రావడంతో బిగ్ బాస్ అక్కినేని షోగా మారిపోయిందని కొందరు ట్రోల్ చేశారు కూడా. కొందరైతే డైరెక్ట్ గా సమంత హోస్టింగ్ పరమ చెత్తగా ఉందంటూ కామెంట్స్ చేశారు. కానీ సమంత వాళ్ళ నోళ్ళు మూయించే విధంగా న్యాయం చేసిందని షోకు వచ్చిన TRP చూస్తేనే అర్ధమవుతోంది.

ఆ రోజు వచ్చిన రేటింగ్ ఎంతంటే..
దసరా రోజు టెలిక్యాస్ట్ అయిన బిగ్ బాస్ 4కు ఏకంగా 11.4 టీవి రేటింగ్ వచ్చింది. అంటే దాదాపు నాగార్జున రేంజ్ లో సమంత ఆకట్టుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక విధంగా సమంత షోను రెగ్యులర్ గా ఫాలో అవ్వకపోయినప్పటికి చాలా ఈజీగా కనెక్ట్ అయ్యింది. హోస్ట్ గా బాధ్యతలు నిర్వహించడం అంటే అంత ఈజీ కాదు. హౌజ్ లో ప్రతి ఒక్కరిని స్వభావాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విషయం సమంత సక్సెస్ అయ్యింది.

సమంత ఒత్తిడికి లోనైందా?
ఇక నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ వలన మరో రెండు వారాలు రాకపోవచ్చని అంతా అనుకున్నారు. ఇక సమంత సరైన న్యాయం చేసింది కాబట్టి ఆమెనే కొనసాగించాలని అనుకున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. కానీ కుదరలేదు. సమంత మొదటిసారి హోస్ట్ గా బాధ్యతలు తీసుకోవడంతో కాస్త ఒత్తిడిగా ఫీల్ అయినట్లు టాక్ వచ్చింది. అందుకే ఆమె మరో ఎపిసోడ్ చేయనని చెప్పినట్లు రూమర్స్ అయితే వచ్చాయి. ఆ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు కాని నాగ్ మాత్రం ఒకవైపు షూటింగ్ లో పాల్గొంటూనే వీకెండ్ లో బిగ్ బాస్ కోసం హైదరాబాద్ కు వచ్చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











