Bigg Boss Telugu7 బిగ్ బాస్ హౌస్‌లో షకీలాకు ఘోర అవమానం... చివరికి అతనే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబరు 3న అట్టహాసంగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ షోలో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమా తరఫున ప్రమోషన్స్ కోసం నవీన్ పొలిశెట్టి బిగ్ బాస్ లోకి అడుగుపెడతాడు. అయితే అక్కడి కంటెస్టెంట్స్ ను పరిచయం చేసుకున్న నవీన్.. వారికి లేడి లక్ అంటూ ఓ టాస్క్ ఇస్తాడు. ఇక ఈ టాస్క్ లో నటి షకీలాకు ఘోర అవమానం జరుగుతుంది. అయితే అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలుగులో అత్యధిక ప్రేక్షాకదరణ పొందిన షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఆరు సీజన్స్ కంప్లీట్ చేసుకుని.. సెప్టెంబరు 3న గ్రాండ్ గా ఏడవ సీజన్ ప్రారంభం అయింది. అయితే ఈ షోలో కేవలం 14 మంది మాత్రమే ఎంటర్ అయ్యారు. మొదటి నుంచి ఈ షోలో 22 మంది కంటెస్టెంట్స్ ఉంటారని చెప్పుకొచ్చినా... బిగ్ బాస్ మాత్రం కేవలం 14మందిని లోపలికి పంపించింది. మిగతా వారిని కూడా త్వరలో పంపిస్తారని టాక్.

ఇక బిగ్ బాస్ సీజన్ 7 మొదటి రోజే... ఆసక్తి కలిగించేలా.. అంతా ఉల్టా పుల్టా ఉంది. మొదటి నుంచి నాగార్జున ఈ సీజన్ ఊహకు అందకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినట్లుగానే ఈ సీజన్ ఉంటుందని అర్థం అవుతుంది. బిగ్ బాస్ ప్రారంభం రోజు... మూవీ ప్రమోషన్స్ కోసం.. నవీన్ పొలిశెట్టి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు.
మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ పొలిశెట్టిని 15వ కంటెస్టెంట్ లెక్క పంపిస్తారు. ఇక డార్క్ రూంలో నవీన్ పొలిశెట్టి ప్రత్యక్ష్యం అయి... కంటెస్టెంట్స్ కు సర్ ప్రైజ్ ఇస్తారు. ఇక అందరితో పరిచయం చేసుకుంటాడు నవీన్ పొలిశెట్టి. ఇక వారితో ఫన్నీ జొక్స్ వేస్తూ.. వారితో కలిసిపోతాడు నవీన్.

ఇక వీఐపీ రూం ఓపెన్ చేసి.. అక్కడ సందడి చేస్తారు. కాసేపు అయ్యాక... కంటెస్టెంట్స్ కోసం టాస్క్ ఇస్తాడు నవీన్ పొలిశెట్టి. సినిమాలోని లెేడి లక్ పాటను ఉద్దేశించి... నవీన్ వారితో... మీ లేడి లక్ ఎవరు అనిపిస్తే వారికి ఈ బ్యాండ్ కట్టాలని చెబుతాడు. ఇక ఆట సందీప్.. ప్రియాంక జైన్ ను సెలెక్ట్ చేసుకోగా... గౌతమ్ కృష్ణ- దామిని, అమర్ దీప్- శోభాశెట్టిని, పల్లవి ప్రశాంత్- రతికా, శివాజీ-శుభ శ్రీ, ప్రిన్స్ యావార్ - కిరణ్ రాథోడ్ ను సెలెక్ట్ చేసుకుంటారు.
ఇక మిగిలింది టెస్టీ తేజ... దీనితో ఆయనకు కేవలం ఆప్షన్ షకీలా మాత్రమే. అందుకే ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ టాస్క్ లో గమనిస్తే... షకీలాను లేడి లక్ గా సెలెక్ట్ చేసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. ఆమెను కేవలం శృంగార తారగానే చూస్తున్నారు. ఇక మున్ముందు షకీలకు ఎలాంటి అవమానాలకు జరగనున్నాయో చూడాలి.


Click it and Unblock the Notifications











