For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కెవ్వు కేక ఐటెం గర్ల్‌గా హారిక దేత్తడి.. మోనాల్, అఖిల్‌కు ఫిట్టింగ్ పెడుతా.. అభిజిత్ ప్లాన్ అలా

    |

    బిగ్‌బాస్ ఇంటిలో భాగంగా బ్లాక్ బస్టర్ టాస్క్‌కు తెరలేచింది. ఇంటి సభ్యులందరూ సినిమా షూట్ చేయాలి. దాంతో బిగ్‌బాస్ ఇంటిలో సినిమా సందడి నెలకొన్నది. డైరెక్టర్‌గా అభిజిత్, హీరోగా అఖిల్, హీరోయిన్‌గా మోనాల్, అలా ఇంటి సభ్యులందరూ నటీనటులుగా, సాంకేతిక నిపుణులుగా తమ పాత్రల్లో జీవించి ఇంట్లో ఎలాంటి సందడి, హంగామాను సృష్టించారంటే..

    హీరో వచ్చాడమ్మా అంటూ

    హీరో వచ్చాడమ్మా అంటూ

    సినిమా షూటింగ్ సందర్బంగా ఇంటి సభ్యుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఒక సెలబ్రిటీ వచ్చాడమ్మా హీరో అంటూ కామెంట్ చేస్తే... అవినాష్ ఎవరో ఒకరి వాదనపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభిజిత్, అమ్మా రాజశేఖర్ మధ్య ఏదో విషయంపై వాదన జరిగింది. ఇలాంటి సన్నివేశాలతో ఎపిసోడ్ కాకపుట్టించే విధంగా మారింది.

    అఖిల్; మోనాల్ రొమాంటిక్‌గా

    అఖిల్; మోనాల్ రొమాంటిక్‌గా

    సోహైల్, లాస్య ఇద్దరు కలిసి ఇంట్లో గాసిప్స్ గురించి చర్చించుకొంటూ కనిపించారు. డైరెక్టర్‌కు స్క్రీన్ ప్లే రైటర్‌కు ఏదో లొల్లి జరిగిందంటూ ముచ్చటకు తెర లేపారు. ఇక హీరో, హీరోయిన్లుగా అఖిల్, మోనాల్ రొమాంటిక్‌గా ఫీల్ అవుతూ కనిపించారు. దాంతో లాస్య, అఖిల్ వారిని టీజింగ్ చేస్తూ ఆహా.. ఓహో అంటూ కామెంట్ చేస్తూ ఆటపట్టించారు.

     అఖిల్, మోనాల్ అఫైర్‌లో ఫిట్టింగ్ పెడుతా

    అఖిల్, మోనాల్ అఫైర్‌లో ఫిట్టింగ్ పెడుతా

    మోనాల్, అఖిల్‌‌ పాట పాడుకుంటూ లవ్ ఫీల్‌లోకి వెళ్లిపోయారు. వారి రొమాన్స్‌ చూసి... నేను దీనికి డైరెక్షన్ చేయడమేంటి? వారిద్దరికి ఫిట్టింగ్ పెట్టకపోతే చాలూ అంటూ అభిజిత్ సెటైర్ వేశాడు. ఈ క్రమంలో నన్ను పంజరంలో పెట్టి ప్రేమ పావురాలు బాగానే ప్రేమించుకొంటున్నాయి అంటూ మెహబూబ్ వీరలెవల్లో డైలాగ్ కొట్టాడు. ఆ తర్వాత అఖిల్, మెహబూబ్ మధ్య భారీ ఫైట్ సీన్ చిత్రీకరించారు.

    Bigg Boss Telugu 4: Bigg Boss show was once again criticised for its elimination process
    హారిక ఐటెంగర్ల్‌గా

    హారిక ఐటెంగర్ల్‌గా

    ఇంట్లో ఫస్ట్‌షాట్‌కు దివి క్లాప్ కొట్టగా.. అరియానా ప్రేమికురాలి పాత్రలో నటించాడు. ఇక హారిక, సోహైల్ కెవ్వు కేక అంటూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో లాస్య ఈ సినిమాకు టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశారు. బిగ్‌బాస్ తెలుగు 4‌ కంటెస్టెంట్స్‌ను దమ్ముంటే ఆపు అనే టైటిల్ పెడుదాం అన్నారు.

    English summary
    Bigg Boss Telugu's 47 day update: Blackbuster Film Shooting in took in the Show. Abijeet as director. Akhil and Monal are the heroine. Harika dances for Kevvu Keka song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X