Bigg Boss Telugu 7: ఫినాలే మూడో ఎలిమినేషన్.. టాప్ 3లో ఉంటాడనుకుంటే ఇలా ఎలిమినేట్ అయిపోయాడేంటి?

బిగ్ బ్రదర్ ఇనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చిన బిగ్ బాస్ షోకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మన దేశంలోని చాలా భాషల్లో ఈ షో వస్తోంది. అలాగే తెలుగులో కూడా వస్తోంది. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న షో.. రేపటితో ఏడో సీజన్ ను కూడా ఘన విజయంగా పూర్తి చేసుకోబోతుంది. ముఖ్యంగా ఈ సీజన్ విన్నర్ గా ఎవరు నిలుస్తారని అంతూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే రన్నరప్ గా ఎవరుంటారని కూడా అంచనాలు వేస్తున్నారు. ఈక్రమంలోనే టాప్ 6 కంటెస్టెంట్లలో ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ సీజన్ టాప్ 4 కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారని మనం ఇప్పుడు తెలుసుకోవాలి.

బిగ్ బాస్ సీజన్ 7షోలో మొదటి వారంలో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. ముఖ్యంగా సీరియల్ నటులు కొందరు, కామన్ మాన్ ఒకరు, మరికొంత మంది నటులు వచ్చారు. ఆ తర్వాత ఐదో వారంలో మరో ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. అలాగే గతంలో ఎలిమినేట్ అయిపోయిన మరో కంటెస్టెంట్ ను హౌస్ లోకి తీసుకొచ్చారు. ఇలా మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లో కొనసాగగా... మొత్తం ఆరుగురు టాప్ 6లోకి వచ్చారు. ముఖ్యంగా ప్రియాంక జైన్, అమర్‌ దీప్ చౌదరి, శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్‌ లు ఫినాలేలోకి అడుగు పెట్టి టైటిల్ రేసులో ఉన్నారు.

Bigg Boss Third Elimination is Top 3 Contestant Prince Yawar in Bigg Boss Telugu 7

ప్రస్తుతం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు టాప్ లో ఉండగా... ఆరో స్థానంలో అంబటి అర్జున్ ఎలిమినేట్ అయిపోయాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయిపోందని తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఎవరు ఎలిమినేట్ అయ్యారు... ముఖ్యంగా టాప్ 3 కంటెస్టెంట్లు ఎరవరు.. విన్నర్, రన్నరప్ గా నిలిచింది ఎవరని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు సీరియల్ బ్యాచ్, ఇటు స్పై బ్యాచ్ లలు చెందిన అభిమానులు వాళ్ల గ్రూపుకు చెందిన వాళ్లనే గెలిపించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, శివాజి, ప్రిన్స్ యావర్ లు.. ముగ్గురిలో ఒకరుగా నిలుస్తారని అంతా అనుకున్నారు.

Bigg Boss Third Elimination is Top 3 Contestant Prince Yawar in Bigg Boss Telugu 7

అలా జరక్కపోతే టాప్ 3లో పల్లవి ప్రశాంత్, శివాజి, అమర్ దీప్ లు నిలుస్తారని కూడా మరికొంత మంది భావించారు. అయితే ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ముఖ్యంగా అమర్ దీప్ తో బాగా పోటీ పడ్డాడు. కానీ చివరకు మాత్రం ప్రిన్స్ యావరే ఎలిమినేట్ అయిపోయినట్లు సమాచారం. ఇక టాప్ 4వ స్థానంలో నిలిచిన ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇక మిగతా మూడు స్థానాల్లో నిలిచిన పల్లవి ప్రశాంత్, శివాజి, అమర్ దీప్ లలో ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారో తెలియాలన్నా, ఎంత గెలుచుకున్నారో తెలియాలన్నా రేపటి వరకూ ఆగాల్సిందే.

Bigg Boss Third Elimination is Top 3 Contestant Prince Yawar in Bigg Boss Telugu 7

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ యే విన్నర్ గా నిలుస్తాడని.. రెండోస్థానంలో శివాజి ఉంటాడని అంతా భావిస్తున్నారు. ఇక మూడో స్థానంలో అమర్ దీప్ ఉంటాడని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి తన ముద్దుబిడ్డ, టైటిల్ ఫేవరెట్ అయిన అమర్ దీప్ ను అందరికీ షాకిచ్చి రెండో స్థానంలో నిలబెడతారా.. లేదా మూడో స్థానంలోనే ఉంచుతారా అనేది చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X