For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: ఫినాలే టాస్కులో అపశృతి.. ఆ నలుగురు కంటెస్టెంట్లకు అస్వస్థత.. మెడికల్ రూమ్‌లోకి పంపడంతో!

  |

  బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ, కొన్ని మాత్రమే ప్రేక్షకుల మద్దతుతో చరిత్రను సృష్టిస్తుంటాయి. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ ఒకటి. దేశంలోని చాలా భాషల్లో వస్తున్నా.. మన దగ్గర ప్రసారం అయ్యే షో మాత్రమే నేషనల్ లెవెల్‌లో టీఆర్పీని అందుకుంటోంది. ఫలితంగా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఐదో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇందులో ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో అపశృతి జరిగినట్లు తెలిసింది. నలుగురు కంటెస్టెంట్లు మెడికల్ రూం‌మ్‌కు వెళ్లారట. ఆ వివరాలు మీకోసం!

  దీన్ని కూడా సక్సెస్ చేసేలా ప్లాన్లు

  దీన్ని కూడా సక్సెస్ చేసేలా ప్లాన్లు

  మొదటి నాలుగు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఐదో దానిపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇందులో నిర్వహకులు ఆరంభం నుంచే ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా మొదట్లోనే 19 మందిని పంపిన నిర్వహకులు షోపై ఆసక్తిని పెంచారు. ఆ తర్వాత క్రమంగా షోలో గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా ఎంటర్‌టైన్ చేశారు. ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో షోపై ఇంకా ఆసక్తిని పెంచేలా ప్లాన్ చేస్తూ సరికొత్త కాన్సెప్టులతో టాస్కులు ఇస్తున్నారు. దీంతో షో మాత్రం చాలా రంజుగా సాగుతోంది.

  బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!

  19లో 12 మంది బయటకు వెళ్లారు

  19లో 12 మంది బయటకు వెళ్లారు


  ఇప్పుడు జరుగుతోన్న ఐదో సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 12 వారాలకు పన్నెండు మంది సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారంలో హమీదా, ఆరో వారంలో శ్వేత, ఏడో వారంలో ప్రియ, ఎనిమిదో వారంలో లోబో, తొమ్మిదో వారంలో విశ్వలు, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ పదో వారంలో అనారోగ్యంతో వెళ్లిపోవాల్సి వచ్చింది.

  చివర్లో రక్తి కడుతోన్న బిగ్ బాస్ గేమ్

  చివర్లో రక్తి కడుతోన్న బిగ్ బాస్ గేమ్


  బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. మరో మూడు వారాల్లో ఫినాలే కూడా జరగబోతుంది. దీంతో నిర్వహకులు నిర్వహకులు చిత్ర విచిత్రమైన టాస్కులతో ముందుకు వస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు హౌస్‌లో ఉన్న ఏడుగురికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక, ఈ వారం నుంచి బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ ఉండదు.. అంటే ఇంటికి కెప్టెన్ ఉండడు. దీంతో మరిన్ని ప్రయోగాత్మక టాస్కులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి నుంచి ఆట మరింత కష్టంగా సాగేలా నిర్వహకులు వ్యూహాలు రెడీ చేశారని అంటున్నారు.

  ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!

  నేరుగా ఫినాలేలోకి తీసుకెళ్లేందుకు

  నేరుగా ఫినాలేలోకి తీసుకెళ్లేందుకు

  ప్రతి సీజన్‌లో ఫినాలేకు రెండు వారాల ముందు హౌస్‌లోని కంటెస్టెంట్లకు 'టికెట్ టు ఫినాలే' టాస్కును ఇస్తూ ఉంటారు. ఇది గెలుచుకున్న ఒక సభ్యుడు నేరుగా ఫైనల్‌లోకి అడుగు పెడతాడు. ఇక, ఐదో సీజన్‌కు సంబంధించి ఈ టాస్క్ మంగళవారం ఎపిసోడ్‌లో ప్రారంభం అయింది. ఈ టాస్కు మూడు రకాలుగా జరగబోతుంది. వాటిలో ఏది ఆడాలో అన్న నిర్ణయాన్ని కంటెస్టెంట్లు అందరూ కలిసి తీసుకోవాల్సి ఉంటుంది. ఏకాభిప్రాయంతో వాళ్లు ఒక విభాగం గురించి చెబితే.. దానికి సంబంధించిన జెండాను ఎగరవేయాల్సి ఉంటుందని బాస్ చెప్పాడు.

  ఐదో బకెట్ టాస్క్.. మార్కులు ఇచ్చి

  ఐదో బకెట్ టాస్క్.. మార్కులు ఇచ్చి


  మొత్తం మూడు రౌండ్లలో జరగనున్న 'టికెట్ టు ఫినాలే' టాస్కులో మొదటి దానికి ఎండ్యూరెన్స్‌ను ఎంచుకున్నారు కంటెస్టెంట్లు. ఇందులో వీళ్లందరికీ ఐస్ బకెట్ టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం.. కంటెస్టెంట్లు తమ పోడియం దగ్గర పెట్టిన ఐస్‌ టబ్‌లో నిల్చోవాల్సి ఉంటుంది. అలాగే, వాళ్ల పేరిట రెండు బకెట్లు పెట్టారు. పైన ఉన్న దాని నిండా బాల్స్, కింద ఉన్నది ఖాళీగా ఉంచారు. గేమ్‌ ఆడేప్పుడు కంటెస్టెంట్లు ఐస్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ల బాల్స్ కొట్టేయొచ్చు.. ఇలా ఈ రౌండ్ చివరికి ఎవరి దగ్గర ఎక్కువ బాల్స్ ప్రకారం మార్కులు ఇస్తారు.

  Janhvi Kapoor: బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ముందుకు వంగి మరీ అందాల జాతర

  ఫినాలే టాస్క్‌లో అపశృతి.. వాళ్లంతా

  ఫినాలే టాస్క్‌లో అపశృతి.. వాళ్లంతా


  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిన 'టికెట్ టు ఫినాలే' టాస్క్ సరదా సరదాగా సాగింది. ఐస్‌లో నిల్చోడానికి పలువురు కంటెస్టెంట్లు తెగ ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ చాలా సేపు తుంటరి పనులు చేస్తూ ఎంజాయ్ చేశారు. అలాగే, ఒకరి బాల్స్ ఒకరు దొంగిలించేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. దీంతో తాజాగా ముగిసిన ఎపిసోడ్‌ చక్కగా సాగింది. అయితే, బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఈ టాస్క్ ఆడుతోన్న సమయంలో ఓ అపశృతి జరిగినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని వల్ల నలుగురు కంటెస్టెంట్లు మెడికల్ రూమ్‌కు వెళ్లారని సమాచారం.

  83 Movie Trailer Review | TeamIndia Obstacles In Kapil Dev's Era || Filmibeat Telugu
  మెడికల్ రూమ్‌కు చేరిక కంటెస్టెంట్లు

  మెడికల్ రూమ్‌కు చేరిక కంటెస్టెంట్లు


  'టికెట్ టు ఫినాలే' టాస్క్‌లో భాగంగా ఐస్ టబ్ ఛాలెంజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది ఆడుతోన్న సమయంలో షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామ చంద్ర, ప్రియాంక సింగ్, సిరి హన్మంత్‌లు అస్వస్థతకు గురయ్యారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ టాస్క్ సమయంలో వాళ్లు స్పర్శను కోల్పోయారట. దీంతో బిగ్ బాస్ వెంటనే టాస్కును ఆపేసి ఆ నలుగురు కంటెస్టెంట్లను మెడికల్ రూమ్‌లోకి పంపాడని సమాచారం. అక్కడ పరీక్షలు చేసిన తర్వాత ప్రమాదం లేదని వైద్యులు చెప్పారట. దీంతో తర్వాత వాళ్లంతా టాస్కులను కంటిన్యూ చేశారని అంటున్నారు.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. Sreerama Chandra, Priyanka Singh, Shanmukh Jaswanth and Siri Hanmanth are Went to Medical Room.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X