బిగ్‌బాస్ ఎలిమినేషన్ ట్విస్ట్.. ఎవరినీ సేఫ్ చేయని నాగ్.. కానీ స్వాతి దీక్షిత్ అవుట్

బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం ఎలిమినేషన్ ఉండటంతో ఇంటి సభ్యులతో ఫన్ గేమ్స్, కొన్ని టాస్కులు ఆడించారు. 27 రోజున ఫార్చున్ ఆయిల్ ఈట్ అండ్ డ్యాన్స్, ఫోలీస్ ఆఫీసర్ టాస్క్‌ను బిగ్‌బాస్ నిర్వహించాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులతో నాగ్ సరదాగా ఉంటూ అవినాష్, అరియానాను ఆటపట్టించారు. అలా సరదాగా ఎపిసోడ్‌ను నాగ్ కొనసాగించారు. ఈ వారం ఎలిమినేషన్‌లో ఎవరు వెళ్లిపోయారంటే..

Recommended Video

Bigg Boss Telugu 4 : Swati Dixit Eliminated కొంపతీసి గెస్ట్ గా వచ్చిందా ?
మోనాల్, అఖిల్ Vs అభిజిత్, హారిక

మోనాల్, అఖిల్ Vs అభిజిత్, హారిక

మోనల్, అఖిల్ తాపీగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకొంటూ అభిజిత్ గురించి చర్చ పెట్టారు. తనతో మాట్లాడటం లేదని చెబుతూ నీతో కూడా మాట్లడటం లేదా అంటూ అఖిల్‌ను మోనల్ అడిగింది. అవసరమైతే తప్ప నాతో మాట్లాడటం లేదు అని అఖిల్ సమాధానం ఇచ్చాడు. అయితే అందరికి ఓ జోడి ఉంది. అభిజిత్‌కే ఎవరు లేరు అని మోనల్ చెప్పింది. ఇక అభిజిత్, హారిక మధ్య మోనల్ గురించి, అఖిల్ గురించి చర్చ జరిగింది.

ఫార్చ్యూన్ ఆయిల్ ఈట్ అండ్ డ్యాన్స్

ఫార్చ్యూన్ ఆయిల్ ఈట్ అండ్ డ్యాన్స్

ఇంటి సభ్యులకు ఫార్చ్యూన్ ఆయిల్ ఈట్ అండ్ డ్యాన్స్ అనే టాస్క్ ఇచ్చారు.ఇంటి సభ్యులు రెండు జట్లుగా విడిపోవాలి. వాళ్లు తమ వంటలు తయారు చేసుకోవాలి. బిగ్‌బాస్ థీమ్ మ్యూజిక్ మోగగానే డ్యాన్స్ చేస్తూ తయారు చేసుకొన్న పదార్థాలను తినాలి. ఎవరైతే ఎక్కువ సేపు డ్యాన్స్ చేసి ఎక్కువ తింటారో వారు విజేతగా నిలుస్తారు. ఈ పోటీలో కుమార్ సాయి విజేతగా నిలిచారు. అంతే స్థాయిలో టాలెంట్ చూపిన మెహబూబ్‌ను కూడా అభినందించారు.

పోలీస్ ఆఫీసర్ టాస్క్

పోలీస్ ఆఫీసర్ టాస్క్

ఇంటి సభ్యులపై ఒకరు ఆరోపణలు చేస్తూ పోలీస్ క్యాప్ పెట్టుకొని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. అలా ప్రతీ ఒక్కరిని దోషిగా బోనులో నిలబెట్టి చేసిన తప్పలు చెప్పాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పూర్తయిన తర్వాత బోనులో ఉన్న వ్యక్తి తనకు తాను డిఫెండ్ చేసుకోవాలి. లేదా మరొకరి డిఫెన్స్ లాయర్‌గా నియమించుకొని తన నిర్ధోషిని అని నిరూపించుకోవాలి. ఇంటి సభ్యులు ఓటు వేసి బోనులో ఉన్న వ్యక్తిని నిర్దోషిగానో లేదా దోషిగానో తేల్చాలి. ఈ గేమ్ చాలా హ్యాపీగా కొనసాగింది.

పిస్టల్‌ గురిపెట్టి ఎలిమినేషన్ ప్రక్రియ

పిస్టల్‌ గురిపెట్టి ఎలిమినేషన్ ప్రక్రియ

సరదాగా టాస్క్, గేమ్స్ ఆడిస్తూ హోస్ట్ నాగార్జున ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. నామినేట్ అయిన స్వాతి దీక్షిత్, అభిజిత్, యాంకర్ లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, సోహైల్, హారిక దేత్తడి వరుసగ నిలబెట్టారు. ఓ పిస్టల్‌ను తెప్పించి ఒక్కక్కొరు కాల్చుకోవాలని సూచించారు. మూడు లెక్కపెట్టగానే తమ కణతలకు పెట్టి పిస్టల్‌ను షూట్ చేసుకొన్నారు. అలా ఏడుగురు సభ్యులు తమ కణతలక కాల్చుకొన్న తర్వాత అసలు ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ సారి కాల్చుకొంటే గన్ షూట్ సౌండ్ వస్తుంది. అలా వచ్చిన వారు ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతారు అని చెప్పారు.

నాలుగో వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్

నాలుగో వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్

మళ్లీ స్వాతి దీక్షిత్, అభిజిత్, యాంకర్ లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, సోహైల్, హారిక దేత్తడి వరుసగా నిలబెట్టారు. పిస్టల్ ఇచ్చి కుమార్ సాయికి చెప్పారు. అప్పటికే కెప్టెన్ అయినప్పటికీ.. ఈ వారం ఎలిమినేషన్‌లో ఉంటావని కుమార్ సాయికి చెప్పారు. ఆ తర్వాత కుమార్ పిస్టల్‌ను తన కణతకు గురిపెట్టుకొని కాల్చుకోగా షూట్ సౌండ్ రాలేదు. అలా అందరూ పిస్టల్‌ను కాల్చుకోగా సౌండ్ రాలేదు. స్వాతి పిస్టల్‌తో కాల్చుకోగా సౌండ్ రాగానే నాగార్జున ఎలిమినేటెడ్ అని చెప్పారు. ఇంటి నుంచి ఎవరినీ సేఫ్ చేయలేదు ఎలిమినేషన్ మాత్రమే చేశాను అని నాగ్ ట్విస్టు ఇచ్చారు.

ఇంటి నుంచి బయటకు వచ్చిన స్వాతి దీక్షిత్

ఇంటి నుంచి బయటకు వచ్చిన స్వాతి దీక్షిత్

ఇంటి నుంచి స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులు షాక్ తిన్నారు. నోయల్ సీన్ భోరుమని ఏడ్చాడు. ఇంటి సభ్యులందరూ స్వాతిని ఓదార్చారు. స్వాతితో ఇంటి సభ్యులు సెల్ఫీ దిగారు. ఆ తర్వాత ఏదైనా ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి అంటూ స్వాతి దీక్షిత్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X