Bigg Boss 7 Telugu ఆ ముగ్గురి లైఫ్‌తో ఆటాడుకొన్న బిగ్‌బాస్.. డ్యాన్స్ చేసి స్టెప్పులేసిన శివాజీ!
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ఉల్టా పల్టా కాన్సెప్ట్‌కు తగినట్టే అనేక ట్విస్టులతో సాగుతున్నది. కంటెస్టెంట్లకు ఊహించని షాకిలిస్తూ బిగ్‌బాస్ గేమ్‌ను అల్లాడిస్తున్నాడు. టాస్కులతో కంటెస్టెంట్లను హౌస్‌మేట్స్‌గా మార్చి.. నామినేషన్ నుంచి తప్పించడంతో హ్యాపీగా ఫీలయ్యారు. హౌస్‌మేట్స్‌గా మారిన శివాజీ, ఆట సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ ఇక మేము సేఫ్ అనుకొన్నారు. కానీ శనివారం ఎపిసోడ్‌లో శివాజీ పవర్ అస్త్రను లాగేసుకొని హౌస్‌మెట్ నుంచి కంటెస్టెంట్‌గా మార్చి షాకిచ్చారు. అయితే తాజాగా బిగ్‌బాస్ తీసుకొన్న మరో అనూహ్యమైన నిర్ణయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
శివాజీ పవర్ అస్త్రను బిగ్‌బాస్ తీసుకొనేలా సీరియల్ గ్యాంగ్ అమర్ దీప్, ప్రియాంక, శోభాశెట్టితోపాటు ఆట సందీప్ తదితరులు భారీ ప్లాన్ వేశారు. పవర్ అస్త్రను తీసుకొని శివాజీని సాధారణ కంటెస్టెంట్‌గా చేయడంతో గ్రూపిజం బ్యాచ్ హ్యాపీగా ఫీలయ్యారు. అయితే శివాజీ అవమానంతో ఉన్నప్పటికీ.. మౌనంగానే ఉన్నాడు.

యితే ఒకరోజు గడిచిన తర్వాత ఆదివారం ఎపిసోడ్‌లో శివాజీ తన ధిక్కారస్వరం వినిపించారు. హౌస్‌మెట్‌గా ఉండటానికి నాకు ఉన్న అనర్హత ఏమిటి? నేను ఎవరికి సానుకూలంగా వ్యవహరించానో చెప్పాలి అంటూ శివాజీ ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులను శివాజీ ఎందుకు అనర్హుడో అనేందుకు కారణాలు చెప్పాలని సూచించారు. అయితే ఇంటి సభ్యులు చెప్పిన కారణాలను నాగార్జున ఒప్పుకోలేదు. కానీ మీరు నిర్ణయం తీసుకొన్నారు కాబట్టి శివాజీ కంటెస్టెంట్‌గానే కొనసాగుతాడు అని నాగార్జున చెప్పాడు.
హౌస్‌మెట్ నుుంచి కంటెస్టెట్‌గా మారిన శివాజీ తనకు జరిగిన అన్యాయానికి కుమిలిపోయాడు. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆలోచిస్తూ ఎలా సమాధానం చెప్పాలనే విధంగా ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ అవకాశం శివాజీకి తొందర్లోనే వచ్చింది. ఇంటిలోని ముగ్గురు హౌస్‌మెట్స్ ఆట సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్రను వెనక్కి ఇచ్చేయనడంతో వారు కంగుతిన్నారు.

ఐదువారాలు ఇమ్యునిటీతో కూడిన పవర్ అస్త్రలను వెనక్కి తిరిగి ఇవ్వాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దాంతో ముగ్గురు వెంటనే పవర్ అస్త్రను తీసుకొచ్చి పెట్టెలో పెట్టారు. దాంతో శివాజీ చప్పట్లు కొడుతూ డ్యాన్సులు చేశారు. ఏయ్ ఎయ్రో కూత వేయరో అంటూ గట్టిగా అరిచారు. దాంతో శోభా శెట్టి, సందీప్ ఓ రకమైన ఫీలింగ్ గురయ్యారు.
శివాజీ సంతోషంలో ఉండటం చూసి.. శోభా శెట్టి స్పందిస్తూ.. కొందరు పోతే హ్యాపీగా ఫీలయ్యే వారు ఉంటారు. మనకు రాకపోయినా పక్కన రాకపోతే చాలు అనుకొంటారు అంటూ ఛీ కొట్టింది. అయితే ప్రస్తుతం అందరూ ఇంటిలో కంటెస్టెంట్లుగా మారిపోయారు. దాంతో ఇంటిలో బిగ్‌బాస్ ఎలాంటి గేమ్ ఆడబోతున్నాడనే విషయం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











