Bigg Boss Telugu 6: ఫైమాకు బిగ్ బాస్ షాక్.. సీజన్ చివర్లో అంత పెద్ద శిక్ష.. ఆ వెంటనే మరో ట్విస్ట్

ఓ సుందరమైన హౌస్.. అందులో కొందరు సెలెబ్రిటీలను ఉంచి.. వాళ్లకు చిత్ర విచిత్రమైన టాస్కులు ఇచ్చి.. అందులో ఒకరిని విజేతగా చేయడం అనే కాన్సెప్టుతో వచ్చిన షోనే బిగ్ బాస్. కొత్త కాన్సెప్టుతో ప్రసారం అవుతోన్నా.. దీనికి ప్రేక్షకులు ఊహించని రీతిలో స్పందనను అందిస్తున్నారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఆరో సీజన్‌ను ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న ఫైమాకు బిగ్ బాస్ షాకిచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

21 మందిలో ఫైమా స్పెషల్‌గా

21 మందిలో ఫైమా స్పెషల్‌గా

అంతకు ముందు సీజన్ల కంటే ఆరో సీజన్ కోసం కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో బిగ్ బాస్నిర్వహకులు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా సెలెక్ట్ చేశారు. ఇలా మొత్తంగా ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపించారు. అందులో జబర్ధస్త్ ఫైమా లేడీ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి హైలైట్ అయింది.

 ఆటే కాదు ఎంటర్‌టైన్‌మెంట్

ఆటే కాదు ఎంటర్‌టైన్‌మెంట్

చాలా ఏళ్లుగా బుల్లితెరపై తెగ సందడి చేస్తోన్న ఫైమా అనతి కాలంలోనే విశేషమైన గుర్తింపును, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు క్రేజ్ కూడా దక్కింది. అలాగే, ఇటీవలే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోంది. ఆటకు ఆటతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందిస్తూ విశేషమైన పేరు ప్రఖ్యాతలను కూడా సొంతం చేసేసుకుంది.

వెటకారం వల్ల విమర్శల వర్షం

వెటకారం వల్ల విమర్శల వర్షం

బిగ్ బాస్ షోలోకి ఎంటరైన తక్కువ రోజుల్లోనే అటు ప్రేక్షకుల, ఇటు హోస్ట్ మన్ననలు అందుకున్న ఫైమా.. అప్పుడప్పుడూ అడల్ట్ జోక్‌లు, చెత్త ప్రవర్తనతో విమర్శలను కూడా ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా, అతి వెటకారంతో మాట్లాడుతూ చెడ్డపేరును మూటగట్టుకుంటోంది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున కూడా ఆమెతో చెప్పాడు. దీంతో చివర్లో ఆమె కాస్త మారినట్లు కనిపిస్తోంది.

ఫ్యామిలీ వీక్.. తల్లితో సందడి

ఫ్యామిలీ వీక్.. తల్లితో సందడి

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పన్నెండో వారానికి సంబంధించి కంటెస్టెంట్ల ఇంటి సభ్యులు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఫైమా కోసం వాళ్ల అమ్మ లోపలికి వచ్చారు. ఆమెకు అందరూ స్వాగతం పలికి సరదాగా గడిపారు. అందుకు తగ్గట్లుగానే ఆమె కూడా అందరి ఆట గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఫైమాకు వెటకారం తగ్గించమని చెప్పడంతో పాటు కొన్ని జాగ్రత్తలు చెప్పారు.

మట్టి తిన్న ఫైమా.. బిగ్ షాక్

మట్టి తిన్న ఫైమా.. బిగ్ షాక్

శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో మొదట్లోనే ఫైమా గార్డెన్ ఏరియాలో కూర్చుని ఏదో చేసినట్లు కనిపించింది. దీంతో బిగ్ బాస్ ఆమెను ఈ విషయంపై సూటిగా ప్రశ్నించాడు. దీనికామె 'మట్టి తింటున్నా బిగ్ బాస్. అదంటే నాకు చాలా ఇష్టం' అని సమాధానం చెప్పింది. అంతేకాదు, 'నేనే కాదు బిగ్ బాస్.. అప్పుడప్పుడూ కీర్తి భట్ కూడా ఇలాగే తింటుంది' అని ఆరోపించింది.

ఫైమాకు బిగ్ బాస్ కఠిన శిక్ష

ఫైమాకు బిగ్ బాస్ కఠిన శిక్ష

ఫైమా మాటలకు అవాక్కైన బిగ్ బాస్ ఆ తర్వాత 'ఫైమా.. మీరు మీ రేషన్‌ను ఎంపిక చేసుకున్నందున ఇకపై బిగ్ బాస్ హౌస్‌లో మీకు రేషన్ కట్ చేయడం జరుగుతుంది' అంటూ శిక్షను విధించి షాకిచ్చాడు. దీంతో ఫైమా 'సారీ బిగ్ బాస్.. ఇంకెప్పుడూ అలా చేయను. దయచేసి నా రేషన్ కట్ చేయకండి. ప్లీజ్ బిగ్ బాస్' అంటూ ప్రాధేయపడింది. కానీ, బిగ్ బాస్ వినలేదు.

చివర్లో సర్‌ప్రైజ్ చేసిన బాస్

చివర్లో సర్‌ప్రైజ్ చేసిన బాస్

ఆ తర్వాత ఫైమా జరిగిన విషయం మొత్తం బోర్డుపై ఇంగ్లీష్‌లో రాసి బిగ్ బాస్‌కు సారీ చెప్పింది. అది జరిగిన కొద్ది సేపటికి అదే బోర్డుపై బిగ్ బాస్ రాసినట్లుగా కొంత మేటర్ ఉంది. అందులో ఫైమాకు నాలుగు కోడిగుడ్లను పంపుతున్నట్లు చెప్పారు. దీంతో అవి తీసుకుని ఆమె ఎంతగానో సంతోషించింది. ఇదంతా ఎంతో ఫన్నీగా సాగడంతో ప్రేక్షకులకు మంచి వినోదం దొరికినట్లైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X