Bigg Boss Telugu 7: ఇదే అసలైన ఉల్టా పుల్టా.. రీఎంట్రీ ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్.. తిరిగి వచ్చేది ఆమే!

చిన్న స్క్రీన్‌పై సంచనాలకు కేంద్ర బిందువుగా ఉంటూ.. ప్రేక్షకుల మన్ననలు అందుకుని తెలుగులోనే నెంబర్ వన్ షోగా సత్తా చాటుతోంది బిగ్ బాస్. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే మన భాషలోకి వచ్చిన దీనికి ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా జాతీయ స్థాయిలో టాప్ ప్లేస్‌కు సైతం చేరుకుంది. దీంతో ఇప్పుడు ఏడో సీజన్‌ను సరికొత్త హంగులతో రన్ చేస్తున్నారు. ఇక, ఇందులో మాజీ కంటెస్టెంట్ల రీఎంట్రీ అంటూ సరికొత్త సర్‌ప్రైజ్ ఇచ్చారు. కానీ, దీనిలో ఓ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలిసింది. ఆ సంగతులు మీరే చూసేయండి!

బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఇందులో ఎన్నో ఊహించని ట్విస్టులను ఇస్తున్నారు. ముఖ్యంగా మొదట 14 మంది కంటెస్టెంట్లనే తీసుకు వచ్చిన నిర్వహకులు.. ఐదు వారాలు పూర్తైన తర్వాత మరో ఐదుగురిని లోపలికి పంపించారు. వీళ్లను పోటుగాళ్లు, ఆటగాళ్లుగా మార్చి టాస్కులు ఆడిస్తున్నారు.

Unexpected Twist In Bigg Boss Telugu 7

ఉల్టా పుల్టా సీజన్ కావడంతో ఇందులో నిర్వహకులు మరిన్ని ప్రయోగాలకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం జరిగిన ఎపిసోడ్‌లో గతంలో ఎలిమినేట్ అయిన దామిని, రతికా రోజ్, శుభశ్రీ రాయగురులను హౌస్‌లోకి తీసుకు వచ్చారు. అంతేకాదు, వీళ్లలో ఒకరికి షోలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని అందించబోతున్నట్లు హోస్ట్ నాగార్జున అధికారికంగా వెల్లడించాడు.

బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి రీఎంట్రీ ఇవ్వడం కోసం గత ఎపిసోడ్‌లో దామిని, రతికా రోజ్, శుభశ్రీ రాయగురులు ఓట్ అప్పీల్ చేసుకున్నారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు వేసే ఓట్ల ఆధారంగా వీళ్లలో ఒకరిని సెలెక్ట్ చేయబోతున్నట్లు కూడా నాగార్జున తెలిపాడు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు ఇంట్లోకి రీఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున చెప్పిన దాని ప్రకారం.. దామిని, రతికా రోజ్, శుభశ్రీ రాయగురులలో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల ద్వారా ఎక్కువ ఓట్లు పడిన వాళ్లే బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి రీఎంట్రీ ఇస్తారని అంతా అనుకున్నారు. అదే సమయంలో శుభశ్రీ రాయగురుకే ఎక్కువ ఓట్లు నమోదు అయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

Singer Damini ReEntry To Bigg Boss

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దామిని, రతికా రోజ్, శుభశ్రీ రాయగురుల రీఎంట్రీలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్లు తెలిసింది. అదేమిటంటే.. ఆదివారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు వేసే ఓట్లలో ఎవరికైతే తక్కువ వస్తాయో.. ఆ అమ్మాయితోనే రీఎంట్రీ ఇప్పిస్తారట. దీనిబట్టి దామినికే తక్కువ ఓట్లు పడి.. ఆమెనే హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Rathika Rose ReEntry To Bigg Boss

వాస్తవానికి దామిని, రతికా రోజ్, శుభశ్రీ రాయగురులలో ఎవరు హౌస్‌లోకి వచ్చినా పోటుగాళ్ల టీమ్‌లోకే వెళ్తారు. దీనివల్ల వాళ్లకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. రతికా రోజ్ లేదా శుభశ్రీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X