For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రముఖ నటిపై కేసు పెట్టిన బిగ్ బాస్ నిర్వహకులు.. ఆమె మాత్రం వేరేగా చెబుతోంది.. ఇంతకీ ఏది నిజం.?

|
Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel

ఉత్తరాదిలో బాగా ఫేమస్ అయింది టాప్ రియాలిటీ షో 'బిగ్ బాస్'. 2006లో హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షో గత 12 సీజన్లుగా టాప్ రియాలిటీ షోగా వర్ధిల్లుతోంది. దక్షిణాదిలో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో ఈ షో ప్రసారం అవుతోంది. దక్షిణాది భాషల్లో తమిళంలో కాంట్రవర్సీలు అయినంతగా దేశంలో ఎక్కడా జరగవు. అందుకే తమిళ బిగ్ బాస్‌కు ఎంతో రేటింగ్ వస్తోంది. ఇప్పటికే ఎన్నో ఘటనలు జరిగిన ఈ షోలో.. తాజాగా మరో వివాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

తమిళంలో కొంత ప్రత్యేకం

తమిళంలో కొంత ప్రత్యేకం

బిగ్ బాస్ షోను అన్ని భాషల్లో లాగ తమిళనాడు ప్రజలు స్వాగతించలేదు. దీంతో ఈ షో ప్రారంభంపై అప్పట్లో నీలి నీడలు అలముకున్నాయి. దీనికితోడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తారని తెలియడంతో చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. అయినా, బిగ్ బాస్ మాత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆ తర్వాత విజయవంతంగా రెండు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడో సీజన్‌ కూడా ప్రారంభమైంది.

వివాదాలతో సతమతం

వివాదాలతో సతమతం

తమిళ బిగ్ బాస్ షో మొదటి నుంచీ వివాదాలతో సతమతం అవుతోంది. బిగ్ బాస్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఓవియా అనే వర్ధమాన నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో నమోదైన ఓ కేసు నిమిత్తం బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న సినీ నటి వనితా విజయకుమార్‌ను విచారించడానికి హైదరాబాద్ పోలీసులు అక్కడికి చేరుకోవడం కలకలం రేపింది. ఇటీవల ఓ నటుడు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటి వాటితో షోపై వ్యతిరేకత వ్యక్తమైంది.

నటి ఆత్మహత్యాయత్నంతో మరో లెవెల్

నటి ఆత్మహత్యాయత్నంతో మరో లెవెల్

‘ఒరుకల్‌ ఒరు కన్నాడీ' చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత గత శనివారం చాకుతో మణికట్టును కోసుకుంది. దీంతో ఆమెకు వైద్యం అందించిన అనంతరం షో నుంచి బయటకు పంపించేశారు. హౌస్‌లో కవిన్ అలానే మిగిలిన కొందరి మధ్య జరిగిన వాదనల కారణంగా గొడవ జరగడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. మధుమిత యాభై రోజులు పైగా హౌస్‌లో ఉంది. గత వారం కెప్టెన్సీ బాధ్యతలు కూడా నిర్వర్తించింది. ఈమె చేసిన పని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవడంతో పాటు షో మరో లెవెల్‌కు వెళ్లింది.

నటిపై కేసు నమోదు

నటిపై కేసు నమోదు

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మధుమితను విజయ్ టీవీలోని బిగ్ బాస్ నిర్వహకులు బయటకు పంపివేశారు. షోకు చెడ్డ పేరు తీసుకు వచ్చిందనే కారణంతోనే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఇక, తాజాగా సదరు నటిపై షో నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెమ్యూనరేషన్ ఇచ్చినప్పటికీ మరింత ఇవ్వాలని డిమాండ్ చేస్తుందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని వాళ్లు కేసు పెట్టారు. దీంతో ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగింది.

మధుమిత మాత్రం వేరేగా చెబుతోంది

మధుమిత మాత్రం వేరేగా చెబుతోంది

వివాదాస్పద తీరుతో ఆత్మహత్నాయత్నం చేసుకుని షో నుంచి బయటకు వచ్చిన మధుమిత మాత్రం ఈ కేసు విషయంపై సరికొత్త అంశాలను తెరపైకి తీసుకు వస్తోంది. తనకు ముందు చెప్పిన ప్రకారం రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, అది అడిగినందుకే తనపై కేసు పెట్టారని ఆమె ఆరోపిస్తోంది. దీనిపై హోస్ట్ కమల్ హాసన్ స్పందిచి తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఈ వ్యవహారంతో తమిళ బిగ్ బాస్ మరోసారి చర్చనీయాంశం అయింది.

English summary
Controversies galore in the Bigg Boss Tamil 3 house ever since Vanitha and Kasthuri made their way into the house. Though Kasthuri is not able to make inroads in terms of issues, Vanitha’s plot is thickening by the day.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more