బిగ్ బాస్ అనుకున్నదే చేస్తున్నాడు.. అందుకే ఆ కంటెస్టెంట్‌ను హైలైట్ చేస్తున్నారు.!
భారతదేశంలోని అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటూ సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. మరీ ముఖ్యంగా తెలుగులో ఎన్నో అనుమానాల నడుమ మొదలై.. ఊహించని రీతిలో పాపులర్ అయిన ఈ షో.. ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, ఈ మధ్యనే నాలుగో సీజన్ సైతం మొదలైంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి మాత్రం మరింత ఎక్కువ రేటింగ్‌ను అందుకుంటోంది. అదే సమయంలో విమర్శలను కూడా ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ నిర్వహకులు ఓ కంటెస్టెంట్ విషయంలో వేసిన ఓ ప్లాన్ లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

అన్నింటినీ మరిపించి మొదలైన సీజన్ 4
బిగ్ బాస్ నాలుగో సీజన్ గత నెలలో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఎంతో సందడిగా సాగిన ఈ ప్రీమియర్ ఎపిసోడ్‌ను అక్కినేని నాగార్జున అద్భుతంగా హోస్ట్ చేశాడు. ఆరోజు పదహారు మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఇక, గత మూడు సీజన్లకు మించి దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ ఎపిసోడ్‌కు రికార్డు రేటింగ్ వచ్చింది.

అప్పుడు వివాదాలు.. ఇప్పుడు విమర్శలు
తెలుగులో ఇప్పటి వరకు మూడు సీజన్లు పూర్తయ్యాయి. ఈ మూడు సీజన్లు ఎన్నో వివాదాల నడుమ ప్రసారం అయ్యాయి. ఆ సమయంలో షోను నిషేదించాలని కూడా డిమాండ్లు వినిపించాయి. అయితే, ఇప్పుడు మాత్రం అటువంటివి పెద్దగా కనిపించడం లేదు. కానీ, బిగ్ బాస్ నిర్వహకుల పనులతో విమర్శలు మాత్రం వస్తున్నాయి. దీంతో షోపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

వాళ్ల ఎలిమినేషన్‌తో పెరిగిన సందేహాలు
ఈ సీజన్ కంటెస్టెంట్లు దేవీ నాగవల్లి, కుమార్ సాయి, దివి ఎలిమినేట్ అయిన తీరు వివాదాస్పదం అయింది. ఈ ముగ్గురికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉన్నప్పటికీ.. షో నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ పరిణామాలను బిగ్ బాస్ ప్రియులు జీర్ణించుకోలేకపోయారు. నిజాయితీగా ఆడిన ఈ ముగ్గురు ఎలిమినేట్ అవడంతో షో ఓటింగ్ సిస్టమ్‌పై అనుమానాలు కలిగాయి.

బిగ్ బాస్.. అనుకున్నట్లే చేస్తున్నాడా.?
బిగ్ బాస్ హౌస్‌లో ఎవరు ఉండాలి.? ఎవరు ఎలిమినేట్ అవ్వాలి.? అన్నది ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. కానీ, ఈ సీజన్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం ప్రేక్షకులను కాదని, బిగ్ బాస్ నిర్వహకులే నచ్చిన వాళ్లను ఉంచి, మిగతా వాళ్లను ఎలిమినేట్ చేస్తున్నారని అనిపిస్తోంది. దీంతో ఈ షో ప్లాన్ ప్రకారమే ప్రసారం అవుతుందన్న టాక్ కూడా బాగా వినిపిస్తోంది.

ఈ వారం డేంజర్ జోన్‌లో బిగ్ సెలెబ్రిటీ
ఈ వారం నామినేషన్ ప్రక్రియలో మోనాల్ గజ్జర్, మెహబూబ్, అఖిల్ సార్థక్, లాస్య, అమ్మ రాజశేఖర్, ఆరియానా గ్లోరీ ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు. ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ నిరాశ పరిచినప్పటికీ.. ఎలిమినేషన్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ వారం అమ్మ రాజశేఖర్ ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఖాయమని తెలుస్తోంది.
Recommended Video

ఆ కంటెస్టెంట్‌ను హైలైట్ చేస్తున్నారు.!
దేవీ నాగవల్లి, కుమార్ సాయి, దివిలు ఎలిమినేట్ అయినట్లుగానే ఈ వారం అమ్మ రాజశేఖర్‌ను ఎలిమినేట్ చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అందుకే బిగ్ బాస్ నిర్వహకులు ఈ వారం మొత్తం ఆయననే హైలైట్ చేసి చూపించారని టాక్. అభిజీత్, హారిక, ఆరియానా సహా పలువురితో గొడవ పడడాన్ని చూపించడంతో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి.


Click it and Unblock the Notifications











